మీరు కూడా ఇంతేనా?
సెల్ఫ్‌చెక్
1. బస్సులో కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తినీ అనుమానంగా చూస్తారు.
ఎ.అవును. బి. కాదు
2. కొత్తవ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇష్టపడరు. కొత్తవారిని నమ్మకూడదు అనేది మీ విశ్వాసం.
ఎ.అవును. బి. కాదు
3. గతంలో ఎవరికో సహాయం చేస్తే ఇరుకున పడ్డామనే కారణంతో, మంచి వారికి కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తుంటారు.
ఎ.అవును. బి.కాదు
4. ఒకరి మీద ఒక అభిప్రాయం ఏర్పడితే... ఇక అది ఎప్పటికీ అలాగే ఉంటుంది.
ఎ.అవును. బి.కాదు
5. నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఉండదు. ఏది జరిగినా మీకు అన్వయించుకుంటారు.
ఎ.అవును. బి.కాదు
6. ఒక వ్యక్తి చేసే తప్పులను అందరికీ అన్వయించుకుంటారు.
ఎ.అవును. బి.కాదు
7. ఎప్పుడూ మనసు మనసులో ఉండదు. అకారణంగా ఆందోళన పడుతుంటారు.
ఎ.అవును. బి. కాదు
ఒకసారి ఒక హోటల్‌కు వెళ్లారు. ఆ రోజు పొరపాటున చట్నీలో ఉప్పు ఎక్కువై ఉంటుంది. ఇక జన్మలో ఆ హోటల్‌కు వెళ్లొద్దనుకుంటారు. ఒకాయన సరదాకు మీతో ఒకసారి అబద్ధమాడి ఉంటాడు. ఇక మీ దృష్టిలో అతను ఎప్పుడూ అబద్ధాలకోరే.... దీన్నే ‘ఓవర్ జనరలైజేషన్’ అంటారు. దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చాలామందికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అకారణశత్రుత్వం ఏర్పడుతుంది. పై వాటిలో మీకు ‘ఎ’లు ఎక్కువగా వచ్చాయంటే, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.