మనలో చాలామందికి నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరేసుకునే అలవాటు ఉంటుంది. ఆ రోజు ఎదైనా తప్పు చేసినా, ఎవరినైనా బాధపెట్టినా లేదా మనకు నచ్చని పని ఏదైనా చేసినా ప్రశాంతంగా నిద్రపోలేం. హీరోయిన్ శ్రుతీహాసన్‌కి కూడా ఇదే అలవాటు ఉందట. నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ తను చేసిన పనులను ఒక్కసారి గుర్తు చేసుకుంటారట. అలా గుర్తు చేసుకోవడమే కాదు ఆరోజు తను ఏదైనా పనిని అయిష్టంగా చేస్తే, అకారణంగా ఎవరినైనా బాధపెడితే జీవితంలో మళ్లీ అలా చేయరట.
ఈ అలవాటు ఎక్కడ నుంచి వచ్చింది? అని అడిగితే.. ‘‘ఇదంతా మా నాన్నగారే నేర్పారు. ‘ఏ రోజైనా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ఆ రోజు నువ్వు ఏదో చేయకూడని పని చేసి ఉంటావ్. జీవితంలో ఆ పని మళ్లీ చేయొద్దు’ అనే సూత్రాన్ని చెప్పి, ‘ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోవద్దు’ అన్నారు. అంతే.. నాన్నగారి మాటను ఆరోజు నుంచి ఇప్పటికీ ఓ జీవన సూత్రంలాగా పాటిస్తున్నా. ప్రతిరోజూ సెల్ఫ్‌చెక్ చేసుకుంటే వ్యక్తిగా మనం రోజు రోజుకీ బెటర్ అవుతామని నా నమ్మకం’’ అన్నారు శ్రుతీహాసన్.
సెల్ఫ్‌చెక్ చేసుకో అన్నారు
Published Fri, Mar 16 2018 1:07 AM | Last Updated on Fri, Mar 16 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment