![DRDO maiden autonomous aircraft successful - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/2/01BNG09-603629_27_44.jpg.webp?itok=VO5U9yFz)
సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో శుక్రవారం ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. విమానం చక్కగా ఎగిరిందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment