విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సెల్ఫ్ చెక్ కయాస్కులు
భువనేశ్వర్ : స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యాలను మరింతగా మెరుగుపరుస్తున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం 5 సెల్ఫ్ చెక్ కయాస్కులు ఏర్పాటు చేశారు. స్వదేశీ టెర్మినల్–1 ప్రాంగణంలో ఈ సదుపాయం కల్పించారు. ఈ యంత్రాలతో ప్రయాణికులు స్వీయ నిర్వహణతో సీటుతో పాటు బోర్డింగ్ పాస్ పొందడానికి వీలవుతుంది. ఈ యం త్రాలను బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.సీ హొత్తా ప్రారంభించారు. ఈ సదుపాయంతో ప్రయాణికుల తనికీ సమయం ఆదా అవుతుంది. తక్కువ(చేతి) లగేజితో ప్రయాణించే వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ప్రయాణికులు బారులు తీరి నిలబడాల్సిన అవసరం ఉండదని డైరెక్టర్ ఎస్.సీ. హొత్తా తెలిపారు.
టచ్ స్క్రీన్‌తో ఏర్పాటు చేసే ఈ యంత్రాల్లో ప్రయాణికుల పీఎన్‌ఆర్ నంబరుతో అనుబంధ సమాచారం నమోదు చేస్తే కోరిక మేరకు సీటుతో పాటు బోర్డింగ్ పాస్ పొందేందుకు వీలవుతుంది. బోర్డింగ్ పాస్ పొందడంతో ప్రయాణికులు నేరుగా సెక్యూరిటీ చెక్‌కు వెళ్ల గలుగుతాడు. రూ.20 లక్షల వ్యయంతో 5 సెల్ఫ్ చెక్ కయాస్కులు ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా మరిన్ని కయాస్కులు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ(ఐఏటీఏ,) కామన్ యూజ్ సెల్ఫ్ సర్వీస్(సీయూఎస్‌ఎస్) మార్గదర్శకాల మేరకు ఈ సదుపాయం ప్రవేశపెట్టడం విశేషం. ప్రారంభ కార్యక్రమానికి విమానాశ్రయ సిబ్బందితో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment