సెల్ఫ్ చెక్
ఇంగ్లిషులో జనవరి, ఫిబ్రవరి, మార్చి... లానే తెలుగులో చైత్రం, వైశాఖం, జ్యేష్టం... ఇలా మాసాలను లెక్కిస్తారు. అయితే తెలుగు మాసాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసో లేదో గుర్తుచేసుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్.
1. చిత్తానక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల చైత్రమాసమని, విశాఖానక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల అది వైశాఖమాసమనీ తెలుసు.
ఎ. అవును బి. కాదు
2. పౌర్ణమినాడు జ్యేష్ఠానక్షత్రం ఉంటుంది కాబట్టి అది జ్యేష్టమాసం.
ఎ. అవును బి. కాదు
3. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల అది ఆషాఢం.
ఎ. అవును బి. కాదు
4. {శావణ మాసమంటే పౌర్ణమినాడు శ్రవణ నక్షత్రముంటుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
5. ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రంలో పున్నమి రావడం వల్ల అది భాద్రపదమాసమని, అశ్విని నక్షత్రంలో పౌర్ణమి ఉంటే ఆశ్వయుజ మాసమని, కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఉంటే కార్తిక మాసమని తెలుసు
ఎ. అవును బి. కాదు
6. పౌర్ణమినాడు మృగశిరా నక్షత్రం ఉండటం వల్ల అది మార్గశిరమాసంగా తెలుసు.
ఎ. అవును బి. కాదు
7. పుష్యమీ నక్షత్రంలో పౌర్ణమి ఉంటే పుష్యమాసం, మఖానక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది మాఘమాసమనీ తెలుసు.
ఎ. అవును బి. కాదు
8. ఉత్తరఫల్గుణి లేదా పూర్వఫల్గుణీ నక్షత్రంలో పున్నమి ఉంటే అది ఫాల్గుణమాసమనీ గుర్తు.
ఎ. అవును బి. కాదు
పైవాటిలో ‘బి’లు ఎక్కువ వస్తే మీరు లౌకిక వ్యవహారాలే కాదు, మన ఆచార సంప్రదాయాలపట్ల కూడా అవగాహన పెంచుకోవాలని అర్థం.