సొంత తెలివితేటలు ఎక్కడ ఉంటాయి?
భాషణం
మనిషిని నడిపించేది మైండ్. ‘ఒళ్లు దగ్గర పెట్టుకో’ అంటే అర్థం, మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకొమ్మని. అయితే మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం కుదరని పని. ఎందుకంటే మైండే మనిషి కంట్రోల్‌లో ఉంచుకుంటుంది. మైండ్ ఎంత చెబితే అంత. ఒక విధంగా మైండ్‌కి మనిషి బానిస.
mind అంటే సాధారణ అర్థం ‘మనసు’. ‘ఆలోచనలను కలిగించేది’ అని కూడా. కానీ ఇది టెక్నికల్‌గా రాంగ్. ఆలోచనలను కలిగించేది brain అవుతుంది కానీ ‘మనసు’ అవదు.
సందర్భాన్ని బట్టి mind అనే మాటకు thoughts, be careful, take care of, oppose అనే అర్థాలూ వస్తాయి. ఈ వాక్యాలు చూడండి.
1) I am not quite clear in my mind about what I am doing. (ఇక్కడ mind అంటే thoughts).
2) Mind that box, the bottom is not very strong. (ఇక్కడ mind అంటే be careful).
3) Could you mind my bag for a moment while I go to the toilet? (ఇక్కడ mind అంటే take care of).
4) Do you mind if I put the television on? (ఇక్కడ mind అంటే oppose).
అలాగే mind అనే మాటతో కొన్ని పదబంధాలు ఉన్నాయి. mind-altering, mind-blowing, mindboggling, mind numbing ఇలా. వీటిల్లో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది.
mind-altering అంటే మనిషిని ఉన్మాదస్థితిలోకి తీసుకెళ్లే ఔషధ గుణం.
mind-blowing అంటే ఆశ్చర్యాన్ని, విభ్రమాన్ని కలిగించేదని. Extremely impressive or surprising అన్నమాట. (The special effects in this film are pretty mind-blowing).
mind-boggling అంటే మనసును కలవరపరిచే, అతి క్లిష్టమైన అని అర్థం. Extremely surprising and difficult to understand or imagine అని. (She was paid the mind-boggling sum of ten million pounds for that film).
ఇక mind-numbing అంటే మాత్రం extremely boring అని. one-track mind అనే ఇంకో మాట ఉంది. అదే ఆలోచన అని దీనర్థం. to think about one particular thing and nothing else అన్నమాట. (And no, Priya, I wasn't talking about money - you have got a one-track mind!).open mind అంటే తెలిసిందే. ఒక అభిప్రాయానికి రావడానికి ముందు అన్ని వైపుల నుంచి నిజానిజాలను తెలుసుకోడానికి సిద్ధంగా ఉండడం.
ఇప్పుడు కొన్ని సంక్లిష్టమైన వాడుకల గురించి తెలుసుకుందాం.get your mind round something అంటే ఏదైనా ఒక కష్టమైన అంశాన్ని లేదా కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడంలో విజయం సాధించడం. ఈ వాక్యం చూడండి. I find it hard to get my mind round such complex issues. సంక్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోలేనని చెప్పడం ఇందులోని భావం.
అలాగే have a mind of its own. దీనర్థం కంట్రోల్ తప్పడం అని. ప్రధానంగా ఇది హ్యూమరస్ ఎక్స్‌ప్రెషన్. మిషన్ గానీ, వస్తువు గానీ మనం నడిపిస్తున్నట్లు కాకుండా, తన ఇష్టానుసారం కదిలిపోతుంటే ఇలా అంటారు. (This shopping trolley has a mind of its own). ఇంకా తేలిగ్గా చెప్పాలంటే... సొంత తెలివితేటలు ఉపయోగించడం అని దీనర్థం.
out of mind అంటే బాగా మద్యం సేవించి పట్టుతప్పి పోవడం. బోరు కొట్టి చావడాన్ని కూడా ఇలాగే అంటారు. ఉదా: I'd go out of my mind if I had to do her job all day!
mind how you go
ఈ ఫ్రేజ్‌ను ఎక్కువగా ఇంగ్లండ్‌లో వాడతారు. దీనర్థం take care అని. ఎవరికైనా వీడ్కోలు చెబుతున్నప్పుడు mind how you go అని అంటే, ‘ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కాస్త జాగ్రత్త’ అని చెప్పడం.
ఇంచుమించు ఇలాంటిదే mind your p's and q'sఅని అనడం. జాగ్రత్తగా, ఆచితూచి మసులుకొమ్మని. ఈ వాక్యం చూడండి. I have to mind my p's and q's when I'm with my grandmother.