సాక్షి, ముంభై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ వేదికగా చాలా ఆసక్తికరమైన విషయాలను ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటారు. అయితే, ఈ రోజు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన, మంచి ప్రేరణ కలిగించే అలవాట్లను ట్వీట్ చేశాడు. హర్ష్ గోయెంకా తొమ్మిది అలవాట్లను ట్విటర్‌లో ‘‘సమ్ కూల్’’ అని పేరుతో పోస్ట్ చేసారు. ఈ తొమ్మిది అలవాట్లు వచ్చేసి ‘ఎల్లప్పుడూ సమయస్ఫూర్తితో ఉండాలి, థ్యాంక్యూ చెప్పడం, ఎప్పుడైన తప్పు చేస్తే క్షమాపణ అడగడం, చెప్పింది బాగా వినడం, ఎదుటి వారితో మంచిగా వ్యవహరించడం, గురువుగా ఉండటం, జీవితానికి ఒక ఉద్దేశ్యం, ఇతరుల పట్ల గౌరవాన్ని చూపడం మరియు మంచి నడవడిక, సమాజానికి తిరిగి ఏదైనా చేయడం’ అని గురువారం పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ని చాలా మంది అంగీకరిస్తూ, వారి అభిప్రాయాలను, ఆలోచనలను కామెంట్ సెక్షన్‌లో తెలిపారు. దీంతో లైక్స్, రీ ట్వీట్స్‌తో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Some cool habits:
— Harsh Goenka (@hvgoenka) December 10, 2020
1. Always be punctual
2. Say ‘thank you’
3. Apologize when you’ve made a mistake
4. Listen well
5. Be nice to strangers
6. Be a mentor
7. Have a purpose in life
8. Show respect and good manners
9. Give back to society#ThursdayThoughts
Comments
Please login to add a commentAdd a comment