ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఓ సెలబ్రిటీ. ఆమె శీతాకాలంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చ్యవన్రప్రాశ తీసుకుంటోంది. చరక సంహిత, భావప్రకాశ, రస రత్న సముచ్చయ వంటి ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన ఔషధం ఇది. దీనిలోని ఆరోగ్యకారకాలను వివరించాలంటే ఒక్కమాటలో ఆల్‌ఇన్‌వన్ అని చెప్పవచ్చు. చ్యవన ముని కనుక్కున్న ఫార్ములా ఇది. ఈ ఔషధం ఎనర్జీ బూస్టర్, ఇమ్యూనిటీని పెంచుతుంది. శక్తినిస్తుంది, జీవనకాలాన్ని పెంచుతుంది. మూలికల సూక్ష్మమైన ΄ోషకాల సమ్మిళితం ఇది. తన కంటిచూపు తగ్గినప్పుడు ఈ ఔషధాన్ని వాడడం ద్వారా తిరిగి మునుపటి చూపును పొందినట్లు రాశాడు చ్యవనుడు. అయితే చ్యవన ప్రాశను ఇంట్లో సులువుగా తయారు చేసుకునే విధానాన్ని సెలబ్రిటీ షెఫ్ అనన్యా బెనర్జీ ఇలా వివరించారు.
కావలసినవి: ఉసిరి కాయలు– అర కేజీ; బెల్లం లేదా తేనె– 300 గ్రాములు; నెయ్యి– 100 గ్రాములు; నువ్వుల నూనె – టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్; యాలకుల పొడి– టీ స్పూన్; లవంగాల పొడి– అర టీ స్పూన్; జాజికాయ పొడి– అర టీ స్పూన్; అశ్వగంధ పొడి– టీ స్పూన్; శతావరి పొడి– టీ స్పూన్; డ్రై ఫ్రూట్స్ : కిస్‌మిస్, డేట్స్, ఫిగ్స్ – 50 గ్రాములు (అన్నీ కలిపి).
తయారీ: డ్రైఫ్రూట్స్‌ను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆవిరి మీద కానీ నేరుగా నీటిలో కానీ ఉడికించాలి. చల్లారిన తర్వాత కాయలను కొద్దిగా చిదిమి గింజలు తొలగించి గుజ్జు అంతటినీ ఒక పాత్రలో వేసుకోవాలి ∙మందపాటి పాత్రను వేడి చేసి అందులో నెయ్యి, నువ్వుల నూనె వేయాలి. అవి వేడెక్కిన తర్వాత ఉసిరికాయల గుజ్జు వేసి గరిటెతో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు మగ్గనివాలి. మిశ్రమం చిక్కబడి, దగ్గరగా అయిన తర్వాత అందులో బెల్లం పొడి లేదా తేనె కలిపి చిన్న మంట మీద ఉంచాలి. మిశ్రమం అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ తీపి... ఉసిరితో సమంగా కలిసిన తర్వాత యాలకుల పొడి, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి, అశ్వగంధ, శతావరి, కిస్‌మిస్‌తో పాటు మిగిలిన డ్రైఫ్రూట్స్ పలుకులను వేసి సమంగా కలిసేవరకు గరిటెతో కలియబెట్టి దించేయాలి. దించిన తర్వాత కూడా పాత్ర వేడికి అడుగున ఉన్న మిశ్రమం మాడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దించిన తర్వాత చల్లారేలోపు రెండు –మూడు సార్లు గరిటెతో కలపాలి.
చల్లారిన తరవాత తేమ లేని బాటిల్‌లోకి తీసుకుని గాలి దూర కుండా గట్టిగా మూత పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని శీతాకాలమంతా వాడుకోవచ్చు దించిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని తీపి సరిపోలేదంటే మరికొంత తేనె కలుపుకోవచ్చు ఉసిరికాయలు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి, అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, నెయ్యితోపాటు ఇతర సుగంధద్రవ్యాలు జఠరాగ్నిని పెంచి పోషకాలను దేహం సమర్థంగా శోషించుకోవడానికి దోహదం చేస్తాయి.
రోజుకు పెద్దవాళ్లు రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ తినాలి (15–20 గ్రాములు). పిల్లలకైతే టీ స్పూన్ (5–10 గ్రాములు) చాలు. చ్యవన్ర΄ాశ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత కఫం సమస్యలు కనిపిస్తే మోతాదు తగ్గించాలి లేదా చ్యవన ప్రాశను వేడినీటిలో కలిపి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment