సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రాములు బృందం ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించారు. ఈ మందుపై వివిధ కోణాల్లో ఆయుష్ కమిషనర్ రాములు బృందం అధ్యయనం చేస్తునున్నారు. అయితే మీడియాకు దూరంగా అజ్ఞాత ప్రదేశంలో ఇదంతా జరిగింది. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు.
24న కృష్ణపట్నంకు వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. అధ్యయన సంస్థల నివేదిక తర్వాత మందు పంపీణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కృష్ణపట్నంలో వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ బృందం పర్యటన పూర్తయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment