demo
-
‘దిశ యాప్’ లైవ్ డెమో
-
సీఎం జగన్ సమక్షంలో ‘దిశ యాప్’ లైవ్ డెమో
సాక్షి, తాడేపల్లి: విజయవాడ గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్ లైవ్ డెమో చేసి చూపించారు. యాప్ నుంచి మెసేజ్ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చింది అన్నారు. జగనన్న లాంటి ముఖ్యమంత్రిని తాము ఎక్కడా చూడలేదని తెలిపారు. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించడం గొప్ప చర్య అన్నారు వాలంటీర్లు. ఇక ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ దిశ యాప్ డౌన్లోడ్ ఇలా.. -
ఆనందయ్య మందు శాస్త్రీయతపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రాములు బృందం ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించారు. ఈ మందుపై వివిధ కోణాల్లో ఆయుష్ కమిషనర్ రాములు బృందం అధ్యయనం చేస్తునున్నారు. అయితే మీడియాకు దూరంగా అజ్ఞాత ప్రదేశంలో ఇదంతా జరిగింది. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. 24న కృష్ణపట్నంకు వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. అధ్యయన సంస్థల నివేదిక తర్వాత మందు పంపీణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కృష్ణపట్నంలో వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ బృందం పర్యటన పూర్తయ్యింది. చదవండి: కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం -
డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు
‘‘డీ సినిమాను అందరూ ప్రోత్సహించాలి. నిర్మాతల కష్టాన్ని పైరసీ ద్వారా వృథా చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ‘డీ’ సినిమా సేవలు రానున్నాయి. బసిరెడ్డిగారు ఈ టెక్నాలజీ తీసుకురావడం సంతోషం’’ అన్నారు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్. పైరసీని అరికట్టడానికి ‘డీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్’ డెమోను ఏఎంబీ సినిమాస్‌లో ప్రారంభించారు. ‘డిజిక్వెస్ట్’ ఇండియా లిమిటెడ్ సీఎండీ బసిరెడ్డి మాట్లాడుతూ– ‘‘పైరసీ నిర్మూలన కోసం రెండేళ్లు ట్రై చేశాం. కొత్త టెక్నాలజీలో పైరసీ ప్రొటక్షన్ ఇమిడి ఉండటం విశేషం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కామర్స్, డిజిక్విస్ట్ ఇండియా సమాన భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకెళతారు’’ అన్నారు.తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ పి.రామ్మోహన్ రావ్ మాట్లాడుతూ– ‘‘పైరసీని అరికట్టడానికి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. డిజిటల్ డెలివరీ రేట్స్ నిర్మాతలందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇండస్ట్రీలోని వారందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె.మురళీ మోహన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ వడ్లపట్ల, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ మూర్తి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, దర్శకుడు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
డెమో రైలును కర్నూలు వరకూ పొడిగించండి
సాక్షి కడప : కర్నూలు నగరంలో డిసెంబరు నెల 8 నుంచి 10వ తేదీ వరకు ముస్లిం సోదరుల ఆలమి దీని ఇజ్‌తెమ (ఆ«ధ్యాత్మిక సమ్మేళనం) కార్యక్రమం జరగనుందని...అందుకు సంబంధించి కడపతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ముస్లిం సోదరులకు అనువుగా ఉండేలా ప్రస్తుతం నడుస్తున్న డెమో రైలును కర్నూలు వరకు పొడిగించాలని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులోని రైల్వే నిలయంలో సౌత్ సెంటల్ర్ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌తో మాజీ ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 నుంచి 25 లక్షల మంది ఆలమి దీని ఇజ్‌తెమకు వస్తారని...ఈ నేపథ్యంలో కడప–నంద్యాల, నంద్యాల–కడప మధ్య నడుస్తున్న డెమో రైలును కర్నూలు వరకు పొడిగించడం ద్వారా ముస్లిం సోదరులు వెళ్లడానికి, రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా వెళుతున్న రైలులో నంద్యాల వరకు వెళుతున్న వారికి కర్నూలు వరకు అవకాశం కల్పించడం ద్వారా మూడు రోజులు ముస్లిం సోదరులకు వెసులుబాటు కల్పించినట్లుంటుందని ఆయన తెలియజేశారు. డిసెంబరు 7వ తేది నుంచే పొడిగింపునకు చర్యలు చేపట్టాలని కోరారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల నుంచి వేలల్లో ముస్లిం సోదరులు ఈ రైలు ద్వారా ప్రయాణం చేసేందుకు అనువుగా ఉంటుందని ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే బోర్డు మీటింగ్‌లో చర్చించి పొడిగింపుకు తగిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి హామి ఇచ్చారు. -
ఇళ్ల నిర్మాణంపై వినూత్న ఆందోళన
ప్రొద్దుటూరు టౌన్ : ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ఏ విధంగా మోసం చేస్తోందో ప్రజలకు తెలియజేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వినూత్న రీతిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో తొగటవీరక్షత్రీయ కల్యాణ మండపం పక్కన డెమో ఇల్లు ఏర్పాటు చేశారు. అందులో బుధవారం నుంచి ఎమ్మెల్యేతోపాటు కుటుంబ సభ్యులు నివాసం ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం పేరుతో జీ ప్లస్ త్రీ ఇంటి నిర్మాణాన్ని చేపడుతోంది. మొదటి రకం ఇంటిని 300 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల సబ్సిడీ, మరో రూ.3.40 లక్షలను బ్యాంకు ద్వారా రుణం ఇప్పించనున్నారు. ముక్కాలు సెంటు లోపు నిర్మించే ఇంటిలో వంట గది, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూంతోపాటు హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఏ కొలతలతో వీటిని నిర్మిస్తోందో.. అదే విధంగా ఎమ్మెల్యే డెమో ఇంటిని ఏర్పాటు చేశారు. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.. ఆ ఇంటిలో ఏ విధంగా ఉండేందుకు సౌకర్యాలు ఉన్నాయో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించనున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఇల్లు నిర్మించి.. 30 ఏళ్ల పాటు బ్యాంకుకు తనఖా పెట్టి ప్రతి నెలా రుణానికి అసలు, వడ్డీతో కలిపి 30 ఏళ్లకు రూ.18 లక్షలు ఎలా వసూలు చేస్తుందో.. ప్రజలకు వివరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డెమో ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాచమల్లు మంగళవారం రాత్రి డెమో ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణం పేరుతో పేదలను ఏ విధంగా మోసం చేస్తోంది, ప్రజలు ఆ ఇంటిలో నివాసం ఉండేందుకు ఏ మేరకు అనుకూలమనే విషయాన్ని అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులకు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రశ్నించే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నాయకులు పోసా భాస్కర్, వరికూటి ఓబుళరెడ్డి, చిన్నరాజా తదితరులు పాల్గొన్నారు. -
‘డెమో’కు బ్రేక్
– నంద్యాల– ఎర్రగుంట్ల మార్గం ప్రారంభంలో జాప్యం – భారీ ఏర్పాట్ల పేరుతో ఆలస్యం – రైల్వేస్టేషన్లలో పూర్తికాని సిగ్నల్ పనులు కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో డెమో రైలు ప్రారంభానికి బ్రేక్ పడింది. ఆగస్టు 2వ తేదీ నుంచి డెమో రైలు తిరగాల్సి ఉండగా రైలు మార్గం ప్రారంభోత్సవం పేరుతో జాప్యం కానుండటంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఈ మార్గంలో రైలు కూత కోసం మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. కడప జిల్లా యర్రగుంట్ల నుంచి నంద్యాల సమీపంలోని 20 కి.మీ. వరకు 123కిలో మీటర్లు ఉన్న ఈ లైన్లో ఐదేళ్ల క్రితమే మొదటి విడతలో ఎర్రగుంట్ల నుంచి సంజామల మండలం నొస్సం వరకు రైల్వే ట్రాక్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన రెండు విడతల్లో సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మద్దూరు వరకు ట్రాక్, ఆయా ప్రాంతాల్లో స్టేష్టన్లు, క్రాసింగ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఫేస్–1లో సంజామల మండలంలోని నొస్సం వరకు, ఫేస్ –2లో అక్కడి నుంచి పాణ్యం మండలం మద్దూరు వరకు ట్రయల్ రన్, ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు రైల్వే సేఫ్టీ కమిషనర్ డీకే సింగ్ ట్రాక్ నాణ్యతను పరిశీలించి రైళ్ల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గత నెలలో ఈ మార్గాన్ని గుంటూరు– గుంతకల్లు రైల్వే లైన్లతో అనుసంధానం చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి నంద్యాల– ప్రొద్దుటూరు మధ్య వారంలో రెండు పర్యాయాలు డెమో రైలు తిరగేలా టైంబుల్ రూపొందించారు. డెమో రైలు తర్వాత ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు కొనసాగాల్సి ఉంది. అయితే వివిధ కారణాల దష్ట్యా డెమో రైలు తిప్పడం రద్దు అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రూ. 950 కోట్లతో రైల్వేలైన్ ఏర్పాటు చేయడంతో రైల్వేలైన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న ఉద్ధేశంతో డెమోరైలు ప్రారంభానికి మరింత ఆలస్యం చేస్తున్నటు సమాచారం. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ సమస్యల కారణంగా డెమో రైలు తిరగకపోవడంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు నిరాశ చెందుతున్నారు. -
నంద్యాల– ఎర్రగుంట్ల మార్గంలో రైళ్ల రాకపోకలు
– రెండు డెమో రైళ్లు మంజూరు – మరో పదిరోజుల్లో పట్టాలెక్కే అవకాశం నూనెపల్లె: నంద్యాల నుంచి ఎర్రగుంట్ల (కడప)కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు డెమో రైళ్లను వేశారు. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు (77401, 77403), ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు (77402, 77404) రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రారంభించాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో మరో పదిరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 163 కిలోమీటర్ల దూరాన్ని 3.55 గంటల సమయం పడుతుందన్నారు. రైళ్లు నంద్యాల నుంచి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, యు. ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, గంగాయిపల్లె, కష్ణాపురం మీదుగా కడపకు చేరుకుంటాయి.