నంద్యాల– ఎర్రగుంట్ల మార్గంలో రైళ్ల రాకపోకలు
Published Sat, Jul 23 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
– రెండు డెమో రైళ్లు మంజూరు
– మరో పదిరోజుల్లో పట్టాలెక్కే అవకాశం
నూనెపల్లె: నంద్యాల నుంచి ఎర్రగుంట్ల (కడప)కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు డెమో రైళ్లను వేశారు. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు (77401, 77403), ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు (77402, 77404) రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 28 నుంచి ప్రారంభించాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో మరో పదిరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 163 కిలోమీటర్ల దూరాన్ని 3.55 గంటల సమయం పడుతుందన్నారు. రైళ్లు నంద్యాల నుంచి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, యు. ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, గంగాయిపల్లె, కష్ణాపురం మీదుగా కడపకు చేరుకుంటాయి.
Advertisement
Advertisement