
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందును ఇంత వరకు ప్రభుత్వం అనుమతించలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు గురువారం స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకకుండా, సోకిన వారికి తగ్గేలా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని కొందరు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒమిక్రాన్‌ను నివారించే ఆయుర్వేద మందు ఉచిత సరఫరా, అమ్మకానికి అనుమతి కోరుతూ ఆయుష్ శాఖను ఇంత వరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కరోనా నిరోధక ఆయుర్వేద మందు ఆయుష్–64, ఆర్సెనిక్ ఆల్బమ్–30 వంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే ప్రజలు తీసుకోవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment