సాక్షి, నెల్లూరు : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్ది భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందును పంపిణీ చేశామని ఆనందయ్య తెలిపారు. తయారు చేసిన మందు అయిపోవడంతో పంపిణీ నిలిపివేశామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, పదార్ధాలు సేకరించడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుకే మందు పంపిణీ ప్రారభించాం: ఎమ్మెల్యే కాకాని
‘‘ఆనందయ్య వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ నివారణకు కూడా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. భౌతిక దూరం పాటించని అంశాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది. కరోనాతో ఆక్సిజెన్ లెవల్స్ తగ్గిన వారికి కంట్లో డ్రాప్స్ వేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. అందుకే మందు పంపిణీ ప్రారభించడం జరిగింది.
రద్దీ కారణంగా పంపిణీ సవ్యంగా సాగలేదు. సీఎం జగన్ కూడా దీనిపై సమీక్ష చేశారు. ఆయుష్ అధికారుల రిపోర్ట్ కూడా ఇవాళ వస్తుంది. ఐసీఎంఆర్ బృందం కూడా నెల్లూరు రానుంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం. ఇతర రాష్ర్టాల నుంచి ఎవరూ రావద్దు. ఆన్‌లైన్‌లో సర్వీస్ కూడా చేపట్టాలని అనుకుంటున్నా౦’’.
Comments
Please login to add a commentAdd a comment