ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం | Chevireddy Bhaskar Reddy started distribution of Anandaiah Ayurvedic medicine | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం

Published Tue, Jun 8 2021 4:51 AM | Last Updated on Tue, Jun 8 2021 7:54 AM

Chevireddy Bhaskar Reddy started distribution of Anandaiah Ayurvedic medicine - Sakshi

చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ముక్కోటి ఆలయం పక్కన గల నారాయణి గార్డెన్‌లో మందు పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా దాదాపు 10 వేల కుటుంబాలకు మందు అందిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 1.6 లక్షల కుటుంబాలకు ఉచితంగా మందు పంపిణీ చేస్తామన్నారు.

నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ మందు అందిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కరోనా సమయంలో ప్రజలకు మాసు్కలు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement