సాక్షి, అమరావతి: ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం.. హైకోర్టుకు తెలిపింది. ల్యాబ్‌ల నుంచి ఈనెల 29న రిపోర్టులు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని.. వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు పేర్కొంది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని తేలితే సెంట్రల్ ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం తెలిపిందని, ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి? మందుపై అభిప్రాయం ఏంటో? కోర్టుకు తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.
చదవండి: ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ
అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు..
Comments
Please login to add a commentAdd a comment