ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ తన అందచందాలతో కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ లో పెర్రీ తళుక్కున మెరిసింది. ఈ కార్యక్రమానికి ఆసీస్ మెన్స్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి ఎల్లీస్ పెర్రీపైనే నెలకొంది. అందుకు కారణం ఆమె వేసుకొచ్చిన దుస్తులు.
రెడ్ కలర్ డ్రెస్‌లో బ్లూ కార్పెట్‌పై క్లీవేజ్ షో చేస్తూ దగదగ మెరిసిపోయిన ఎల్లీస్ పెర్రీ అవార్డు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రౌండ్‌లో తన ఆటతో అభిమానులను మంత్రముగ్దులను చేసిన ఎలీస్ పెర్రీ.. తాజాగా అవార్డు కార్యక్రమంలో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్.. 2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131 టీ20 మ్యాచ్ లు ఆడింది. టెస్టులలో 752 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం. బౌలర్ గా 37 వికెట్లు పడగొట్టింది. వన్డేలలో పెర్రీ.. 3,369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక టీ20లలో 1,418 రన్స్ చేసి 117 వికెట్లు సాధించింది.
ఇక అవార్డుల విషయానికి వస్తే..
►స్టీవ్ స్మిత్ ఉత్తమ ఆస్ట్రేలియా క్రికెటర్(అలెన్ బోర్డర్ మెడల్) అవార్డు సొంతం చేసుకోగా.. ఉత్తమ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌గా బెత్‌మూనీ(బెలిండా క్లార్క్) అవార్డు గెలుచుకుంది.
►మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా
►ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- బెత్ మూనీ
►మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- డేవిడ్ వార్నర్
►వుమెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- తాహిలా మెక్‌గ్రాత్
►మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మార్కస్ స్టోయినిస్
►వుమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-అన్నాబెల్ సదర్‌లాంఢ్
►మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మైకెల్ నాసర్
►బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- లాన్స్ మోరిస్
►కమ్యూనిటి ఇంపాక్ట్ అవార్డు- ఉస్మాన్ ఖవాజా
Comments
Please login to add a commentAdd a comment