ఇన్నేళ్లకు కల నిజమైంది: రష్మికా మందన్నా | Rashmika Mandanna in Japan for Crunchy Roll Anime Awards | Sakshi
Sakshi News home page

ఇన్నేళ్లకు కల నిజమైంది: రష్మికా మందన్నా

Published Mon, Mar 4 2024 12:33 AM | Last Updated on Mon, Mar 4 2024 6:34 AM

Rashmika Mandanna in Japan for Crunchy Roll Anime Awards - Sakshi

రష్మిక

చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఎనిమిదో ఎడిషన్‌ ‘క్రంచీ రోల్‌ అనిమే’ అవార్డ్స్‌ ఫంక్షన్‌కు అతిథిగా వెళ్లారు రష్మిక. విజేతలకు అవార్డులను అందజేశారు. జపాన్‌కు వెళ్లడం పట్ల రష్మికా మందన్నా ఈ విధంగా స్పందించారు.‘‘నా చిన్నతనంలో జపాన్‌కు వెళ్లాలనే కల ఉండేది. అయితే అది అసాధ్యం అనుకున్నాను. కానీ ఇన్నేళ్లుగా జపాన్‌కు వెళ్లాలనే కల మాత్రం అలానే ఉంది.

ఇప్పుడు అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉంది. కొన్నేళ్ల నా కల నిజమైంది. జపాన్‌లోని ఆహారం, వాతావరణం, ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ, ఆదరణ నాకు ఆనందాన్నిచ్చాయి. జపాన్‌ నాకు ఇప్పుడు చాలా స్పెషల్‌’’ అని ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’, ధనుష్‌ ‘డీఎన్‌ఎస్‌’ (వర్కింగ్‌ టైటిల్‌), హిందీ ‘ఛావా’లో హీరోయిన్‌గా నటిస్తున్నారామె.  అలాగే ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’, ‘రెయిన్‌ బో’ అనే ఉమెన్‌సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ కూడా చేస్తున్నారు రష్మికా మందన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement