వెంకటేశ్వరరావు, మారుతి, గోపాలకృష్ణ
‘‘ఎన్టీ రామారావుగారు ముందుగా పరిచయమైనా హీరోగా మా ఫస్ట్ సినిమా శోభన్‌బాబుగారికే రాశాం. ఆ తర్వాత ఆయనతో 13 సినిమాలకు కలసి పనిచేశాం. శోభన్‌బాబుగారు సినిమాలు మానేసే దశలో మా డైరెక్షన్‌లో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి–నిర్దోషి’ అనే చిత్రం రాశాం. రెండూ మంచి హిట్టయ్యాయి. అప్పుడు శోభన్‌బాబుగారు ఫోన్ చేసి.. ‘నేను గౌరవంగా రిటైర్ అయ్యేలా హిట్లు ఇచ్చారు.. ఫ్రీగా ఓ సినిమా చేసుకోమన్నారు. కానీ మేము చేయలేదు.
మేము సినిమా చేసినా, చేయకున్నా మా మనసుల్లోనే కాదు అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు కూడా’’ అని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. దివంగత శోభన్‌బాబు పేరిట ‘అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి’ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. 2017కి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు.
ఈ అవార్డుల కార్యక్రమం పోస్టర్‌ని రచయితలు పరుచూరి బ్రదర్స్ రిలీజ్ చేయగా, దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. ఓ సందర్భంలో ‘నేను మీకు పెద్దన్నయ్యను’ అన్నారు శోభన్‌బాబుగారు. అంత ప్రేమాభిమానాలు మాపై వర్షింపజేసిన ఆయన కోసం వారి అభిమానులతో కలసి ఎన్ని సంవత్సరాలైనా ఈ పరుచూరి బ్రదర్స్ అడుగేస్తారు’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. అఖిల భారత శోభన్‌బాబు సేవాసమితి సభ్యులు వీరప్రసాద్, నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు (మాజీ ఎమ్మెల్యే) జె.రామాంజనేయులు, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment