
ధనుష్(Dhanush) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఇడ్లీ కడై’ (Idly Kadai)(తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం). నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, సముద్ర ఖని, రాజ్ కిరణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్‌తో కలిసి ధనుష్ నిర్మిస్తున్న మూవీ ఇది. కాగా ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే ప్రచారం జరిగింది.
అయితే ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10నే రిలీజ్ చేస్తామన్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అనుకున్నట్లే ‘ఇడ్లీ కడై’ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్లుగా స్పష్టమైపోయింది. ఇక ధనుష్ దర్శకత్వంలోని మరో మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. పవీష్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ తెలుగులో ‘జాబిలమ్మా నీకు అంత కోపమా...’ అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment