దుబాయ్ వెళ్లనున్న కండలవీరుడు! | salman khan to go dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్ వెళ్లనున్న కండలవీరుడు!

Published Thu, Feb 25 2016 9:01 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

దుబాయ్ వెళ్లనున్న కండలవీరుడు!

దుబాయ్ వెళ్లనున్న కండలవీరుడు!

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దుబాయ్ వెళ్లనున్నాడు. వచ్చే నెల 18న దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరగనున్న టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డుల (టీఓఐఎఫ్‌ఎ) వేడుకకు ఆయన హాజరవనున్నాడు. ఈ వేడుకలో సల్మాన్ తన డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఈ అవార్డుల వేడుకలో సల్మాన్‌ తన ‘భజరంగి భాయిజాన్’ చిత్రంతో ఉత్తమ నటుడి రేసులో ఉన్నాడు. టీఓఐఎఫ్‌ఎ నిర్వహిస్తున్న ఈ అవార్డుల ప్రధానోత్సవం రెండో ఎడిషన్ ఇది. మొదటి ఎడిషన్ 2013లో  కొలంబియా వేదికగా జరిగింది. ఈ సారి జరగనున్న కార్యక్రమంలో బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, పాప్ స్టార్ హనీ సింగ్ త దితర ప్రముఖులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement