
చెన్నై: సినీ, బుల్లితెర తారల అవార్డుల వేడుక శనివారం స్థానిక వడపళణిలోని శిఖరం హాలులో ఘనంగా జరిగింది. మహా ఆర్ట్స్ అధినేత అనురాధ జయరాం, యునైటెడ్ ఆరి్టస్ట్ ఆఫ్ ఇండియా అధినేత నెల్‌లై సుందరరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఎస్.కె.కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో నటి జ్యోతి మీనా, ఎస్.ఎస్.ఆర్.ఆర్యన్, శృతిక, మౌనిక, గానా గాయకురాలు ఇసైవాణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment