
డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తున్న మూడో రోజు డ్రా విజేత దుర్గాబాబు
ఎస్‌వీఎన్‌కాలనీ (గుంటూరు) : నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో ‘సాక్షి’ పండుగ సంబరాలు కొనుగోలుదారులకు లక్షలాది రూపాయల కాసుల వర్షం కురిపిస్తోంది. ఆహ్లాదభరిత వాతావరణంలో పెద్ద సంఖ్యలో కస్టమర్‌ల సందడి నడుమ నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డులో ఉన్న విజయ్ డిజిటల్స్ షోరూంలో గురువారం ‘సాక్షి’ పండుగ సంబరాలు నాల్గవ రోజు లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. మూడో రోజు డ్రాలో రూ.లక్ష నగదు గెలుపొందిన విజేత కల్వకొల్లు దుర్గాబాబు నాల్గవ రోజు నాటి లక్కీ విజేతను డ్రా తీసి ఎంపిక చేశాడు. ఈ డ్రాలో సరిపూడి సుజికి కస్టమర్ వి.నరేష్‌సాయి విజేతగా నిలిచి రూ.లక్ష నగదు బహుమతిని గెలుపొందారు. విజయ్ డిజిటల్స్ చైర్మన్ జవ్వాది గంగాధర్, సంస్థ డైరెక్టర్ రాహుల్, మేనేజర్ దొప్పలపూడి దుర్గాప్రసాద్, పలువురు కస్టమర్‌లు డ్రా తీసి ఐదు కన్సొలేషన్ బహుమతులకు విజేతలను ఎంపిక చేశారు. ఎంతో పారదర్శకంగా, ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్న ఈ డ్రాపై కస్టమర్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కస్టమర్‌ల నుంచి అనూహ్య స్పందన
గుంటూరులో మొదటిసారిగా చేపట్టిన ‘సాక్షి’ పండుగ సం బరాలకు కస్టమర్‌ల నుంచి అనూహ్య స్పందన వస్తోందని విజయ్ డిజిటల్స్ ఇన్నర్ రింగు రోడ్డు షోరూం మేనేజర్ దొప్పలపూడి దుర్గాప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సాక్షి’ మీ డియా గ్రూప్ గుంటూరులో తొలిసారిగా చేపట్టిన సాక్షి పండుగ సంబరాలు కొనుగోలుదారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోందన్నారు. విజేత ఎంపికకు విచ్చేసిన దుర్గాబాబు మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలకు ‘సాక్షి’ లక్కీ డిప్ ఒక వరమని చెప్పారు. సెల్‌ఫోన్ కొనుగోలుతో లక్కీ డిప్ ద్వారా లక్షాధికారి అయ్యే అవకాశం రావడం తన జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ యాడ్స్ రీజినల్ మేనేజర్ వెంకటరెడ్డి, యాడ్స్ మేనేజర్ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 24న ప్రారంభమైన ‘సాక్షి’ పండుగ సంబ రాలు జనవరి 7వ తేదీ వరకు కొనసాగుతాయని ఈ సందర్భంగా ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ వెంకటరెడ్డి వెల్లడించారు. పండుగ సంబరాలకు టీవీ పార్టనర్‌గా ‘సాక్షి’ టీవీ, రేడియో పార్టనర్‌గా రెడ్ ఎఫ్‌ఎం వారు వ్యవహరిస్తున్నారు.
నాలుగో రోజు డ్రా విజేతలు వీరే..
సరిపూడి సుజుకి కస్టమర్ వి.నరేష్‌సాయి బంపర్ బహుమతి రూ.లక్ష నగదును గెలుపొందారు. మొదటి కన్సొలేషన్ బహుమతిని అశోక్ (రాయల్ సెల్యూలర్), రెండో కన్సొలేషన్ టి.కల్పన (విజయ్ డిజిటల్స్), మూడో కన్సొలేషన్ కె.పార్ధసారథి (విజేత సూపర్ మార్కెట్), నాలుగో కన్సొలేషన్ డేవిడ్ (విజయ్ డిజిటల్స్), ఐదో కన్సొలేషన్ ఆయేషా (కార్పొరేట్ వెంచర్స్) గెలుపొందారు.
జీవితంలో మర్చిపోలేని రోజు
నేను వ్యవసాయం చేస్తుంటాను. నా సెల్‌ఫోన్ చోరీకి గురవడంతో కొత్తది కొనేందుకు ఆప్షన్స్ మొబైల్స్‌కు వెళ్లాను. నచ్చిన మోడల్ కొన్నాక సిబ్బంది ‘సాక్షి’ పండుగ సంబరాలు కూపన్లు మూడు ఇచ్చారు. వాటిని పూర్తి చేసి డ్రాప్ బాక్స్‌లో వేశాను. బుధవారం షోరూం నుంచి ‘సాక్షి’ డీజీఎం రంగనాథ్ ఫోన్ చేసి రూ.లక్ష నగదు బహుమతి గెలుపొందారని చెప్పారు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాను. జీవితంలో మర్చిపోలేని రోజు. వ్యవసాయంలో నష్టం చవిచూస్తున్న నాకు ఈ నగదు ఎంతో ఉపయోగపడుతుంది. – కల్వకొల్లు దుర్గాబాబు, జొన్నలగడ్డ, మూడో రోజు రూ.లక్ష విజేత
కస్టమర్ల నుంచి విశేష ఆదరణ
మొదటిసారిగా గుంటూరులో ప్రవేశపెట్టిన ‘సాక్షి’ పండుగ సంబరాల్లో మేమూ భాగస్వాములం కావడం కొత్త అనుభూతిని ఇస్తోంది. షోరూంలో నిర్వహించిన డ్రా ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. మా స్టోర్‌లో ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించి ఆధునిక టెక్నాలజీ ఎలక్ట్రానిక్ గృహోపకరాలు అందుబాటులో ఉంటున్నాయి. కస్టమర్‌లు కూప న్‌ను తీసుకుని ఆసక్తిగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో వారిలో ఆసక్తిని పెంచడంతోపాటు సేల్స్ పెరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. – దొప్పలపూడి దుర్గాప్రసాద్, మేనేజర్, విజయ్ డిజిటల్స్
Comments
Please login to add a commentAdd a comment