అమ్రాబాద్: నల్లమల అటవీ పరిధిలోని చెంచు పెంటల చెంతకు అధికార యంత్రాంగం తరలివచ్చింది. చెంచులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారింది.ఆరు నెలలుగా గిరిపోషణ ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి బాలింతల వరకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారి వెతలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తూ ‘అడవే చెంచులకు అమ్మ’ శీర్షికన బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ స్పందించారు. చెంచు పెంటలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
దీంతో ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓ వెంకటయ్య, పీఆర్ ఏఈ రుక్మాంగధ అమ్రాబాద్ మండలంలోని కొమ్మెనపెంట, కొల్లంపెంటను çసందర్శించారు. చెంచు కుటుంబాల బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓ వెంకటయ్య మాట్లాడుతూ చెంచు కుటుంబాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావాల్సిన వసతులు, వారి అవసరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు.
ప్రధాన మంత్రి జన్‌మన్ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే కొల్లంపెంట, కొమ్మెనపెంటలకు కనీస రవాణా సౌకర్యం కోసం 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మర మ్మతులు చేపడతామన్నారు. ఐటీ డీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చెప్పారు. వారి వెంట ఎంపీడీఓ రామ్మోహన్, కార్యదర్శి మల్లేష్, ఉపాధి హామీ పథకం ఈసీ రేణయ్య, టీఏ అంజనేయులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment