
- ఎన్నో సేవా కార్యక్రమాలను కాశీనాయన చేశారు
- వందేళ్ల పాటు జీవించి అందరికీ ఆధ్యాత్మికతను బోధించారు
- అలాంటి కాశీనాయన క్షేత్రం మీద అటవీ శాఖ దాడులు, కూల్చివేతలు జరిగాయి
- వైఎస్సార్ సీపీ ఆందోళనకు దిగాక మళ్ళీ నిర్మాణాలు చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు
- వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజం
తాడేపల్లి : కాశీనాయన జ్యోతి క్షేత్రం పరమ పవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చే ప్రాంతమని అలాంటి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడం నిజంగా దారుణమన్నారు.
శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మల్లాడి విష్ణు మాట్లాడుతూ.. కాశీనాయనక్షేత్రం మీద జరిగిన దాడి.. హైందవ ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. ‘ పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీ శాఖ ఈ దారుణానికి పాల్పడింది* అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడి
రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడతాననే పవన్ కళ్యాణ్.. మరి ఈ విషయంలో మిన్నుకుండి పోవడానికి కారణం ఏమిటి?, పవన్ కళ్యాణ్ కి తెలిసే ఇది జరిగింది. కూటమి నేతల అనుమతితోనే ఈ కూల్చివేతలు జరిగాయి. హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా భావించే వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఎన్నో సేవా కార్యక్రమాలను కాశినాయన చేశారు. వందేళ్ల పాటు జీవించి అందరికీ ఆధ్యాత్మికతను బోధించారు. అలాంటి కాశీనాయన క్షేత్రం మీద అటవీ శాఖ దాడులు, కూల్చివేతలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగాక మళ్ళీ నిర్మాణాలు చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది..?
హిందూ ధర్మం మీద జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, తిరుమల లడ్డూ విషయంలో జనాన్ని తప్పదారి పట్టించారు. భక్తులు క్యూలో చనిపోతే క్షమించమని ప్రాధేయపడ్డారు. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ భక్తులు ఎందుకు క్షమించాలి? , ముందు జాగ్రత్తగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ 13 హెక్టార్లను మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారు.

పవన్ కళ్యాణ్ ఏమైపోయావ్..?
ఈ ప్రభుత్వం ఆ రికార్డులను కూడా పరిశీలించదా?, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. విజయవాడలో ఆలయాలు కూల్చారు. తిరుపతి లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు. సతావర్తి సత్రం భూముల కుంభకోణం చేశారు. పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. సంబంధం లేకపోయినా తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పారు?, ఇప్పుడు కాశినాయన క్షేత్రం వద్ద కూల్చివేతలు చేస్తే ఆయన ఎందుకు పట్టించుకోలేదు?, లోకేష్ క్షమాపణలు చెప్పడం ఎందుకు?,
మా హయాంలో ఏం జరిగినా వెంటనే స్పందించాం. అంతర్వేదిలో రధం తగులపడితే నూతన టెక్నాలజీతో కొత్త రధాన్ని నిర్మించాం. చంద్రబాబు హయాంలోనే హిందూ ఆలయాలపై నిర్లక్ష్యం జరుగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment