
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో టీడీపీ నేతలు అరాచకాలు ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన రెండు షెడ్లను కూల్చేశారు. అదే ప్రాంతంలో ఇంకా షెడ్లు, పక్కా భవనాలు ఉన్నప్పటికీ పచ్చబ్యాచ్.. వాటి జోలికి పోలేదు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ విలేకరిపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు. పోలీసులు చోద్యం
గురజాలలో రాళ్ల దాడి..
పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. గోగులపాడులో గ్రామం విడిచి ఎందుకు వెళ్లలేదంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో వెంకట చలమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
విశాఖలో వైఎస్సార్ ఫ్లెక్సీ చించివేత
విశాఖలో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరుగుపోతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా 43వ వార్డులో కార్పొరేటర్ ఉషశ్రీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ నేతలు చించివేశారు. ఫ్లెక్సీని చించవద్దంటూ స్థానికులు చెబుతున్న కానీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్సార్ ఫ్లెక్సీని ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment