పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక AAFA అవార్డు | Prestigious AAFA Awards 2023 for Sakshi Pudami Sakshi Campaign | Sakshi
Sakshi News home page

పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక AAFA అవార్డు

Published Tue, Apr 11 2023 8:03 PM | Last Updated on Wed, Apr 12 2023 7:44 AM

Prestigious AAFA Awards 2023 for Sakshi Pudami Sakshi Campaign

ముంబైలో AAFA చైర్మన్‌ శ్రీనివాసన్ స్వామి, IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్‌ చైర్మన్‌ జనక్ సర్థా చేతుల మీదుగా అవార్డు అందుకుంటోన్న సాక్షి డైరెక్టర్ రాణి రెడ్డి

ముంబై/హైదరాబాద్‌:  పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్‌ చేస్తోన్న పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. IAA ఆధ్వర్యంలో ఏషియన్ ఫెడరేషన్‌ ఆఫ్‌  అడ్వర్టైజింగ్ అసోసియేషన్ AAFA.. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఎంపిక చేసి కార్పోరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్‌ సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల సమర్పణ కార్యక్రమంలో సాక్షి మీడియా తరుపున సాక్షి కార్పోరేట్ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్ రాణి రెడ్డికి AAFA చైర్మన్‌ శ్రీనివాసన్ స్వామి, IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్‌ చైర్మన్‌ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు.


ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం  2020-21లో ప్రారంభమై ఇప్పటికి మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్తు తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి ప్రధాన కారణం మనుష్యులే. ఈ భూమి మళ్లీ పునర్వైభవాన్ని దక్కించుకోవాలంటే .. ప్రతీ ఒక్కరు నిరంతరం చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది.

► ఏడాది పాటు ప్రతీ నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు అందరిని ఇందులో భాగస్వామ్యులను చేస్తోంది. దీంతో పాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటల పాటు మెగా టాకథాన్‌ రూపంలో ప్రసారం చేస్తోంది.

► పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు, తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్‌ సైట్‌లో చూడవచ్చు. 

సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ నాగరాజు, మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, సినీ నటుడు అలీ, CEO అనురాగ్ అగ్రవాల్, డైరెక్టర్  KRP రెడ్డి,  బిజినెస్ కంట్రోల్ డైరెక్టర్ ALN రెడ్డి, కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ YEPరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డిజిటల్ శ్రీనాథ్

ఇక AAFA అవార్డు సందర్భాన్ని పురస్కరించుకుని సాక్షి మీడియా హౌస్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సినీనటుడు అలీ పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూపు సంకల్పాన్ని అలీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

పుడమి సాక్షికి గౌరవం.. సెలబ్రేషన్స్‌ ఫొటోల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement