Pudami Sakshiga
-
Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు
వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై సునీత పొత్తూరి ప్రత్యేక కథనం.. పచ్చని ప్రకృతికి బహుమతిగా మళ్లీ కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి 9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది. ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి. అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది. కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి. చలికాలం లో మా ముంగిట్లో ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు. ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా! పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్ లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది. ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్ ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది. కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..! ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది. జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు. గుంపుగా వచ్చి, తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి. అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్‌గా ఉండే ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం బాగుంటాయి. ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి, దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు. ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో. తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట. మిడతలను చంపడానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట. ఇదొక గుణపాఠం. అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది. రచయిత : సునీత పోతూరి ఫోటో : శ్యాం సుందర్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
ప్రకృతికి మించిన గురువు లేరు.. పిల్లల్లో అలాంటి సమస్యకు కారణమదే!
ప్రకృతి,వన్యప్రాణుల జీవనంపై చిన్ననాటి గుర్తులు ఏమైనా గుర్తు ఉన్నాయా? నేను పట్టణవాసిని అయినా ఒక కొండముచ్చు మా ఇంట్లోకి జొరబడి హడావుడి చేయటం, ఇంటి బాల్కని నుంచి చూసిన లకుముకి,గిజిగాడు పిట్టలు, రాత్రిపూట మిణుగురు పురుగులు పట్టుకొని అవి మెరుస్తుంటే చూసి ఆనందించిన క్షణాలు నాకింకా గుర్తు ఉన్నాయి. పిల్లలకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం,ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంటాయి. కానీ పట్టణవాసంవల్ల ప్రకృతితో అనుబంధం అనుకున్నంత ఉండటం లేదు. తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే, ప్రకృతితో పిల్లల అనుబంధం మరింత బలపడి వారి భౌతిక, మానసిక వికాసానికి దోహదకారి అవుతుంది. ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం పిల్లల సర్వతోభివృద్దికి ఎంతో అవసరమని ఎన్నో అధ్వయనాలు చెపుతున్నాయి. అవి వారి ఏకాగ్రత, పరిసీలనాశక్తిని, ప్రావీణ్యతసి, మానసికాభివృద్దికి తోడ్పడుతుంది అని అందరికి తెలిసిన విషయమే. కాని,పట్టణవాసం వల్ల ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం తగినంత లేకపోవటంతో మనలో చాలామంది Nature deficit Disorder తో బాధపడటం ఉండటం గమనార్హం. దీంతో చాలామంది పిల్లల్లో స్థూలకాయం, ఎకాగ్రతాలోపం, నిరాశ వంటి సమస్యలు తలెత్తడం గమనిస్తున్నాము. అయితే ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతితో మమేకమవటం ఎలా? ప్రకృతిలో ఒక భాగమయిన పక్షులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు కేవలం గ్రామాలు, అడవుల్లోనే ఉంటాయి అనుకోవటం పొరపాటు.ఇవి అన్నిచోట్లా మన పరిసరాలలో కనిపిస్తూనే ఉంటాయి.పిల్లలను తరచుగా మన దగ్గరలో ఉన్న పార్కులు, చెరువులు,స్కూల్ ఆటస్తలలో కనపడే పక్షులను, కీటకాలను మరియు ఇతర జంతువులను పరిసీలించటం నేర్పితే వారికి బయటకు వెళ్ళాలనే ఉత్స్యాహం కలిగించిన వారవుతారు. పక్షులు ప్రకృతిలోని ఒక ప్రధాన భాగస్వాములు. భూమిఫై మన మనుగడకు విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. అది పిల్లలలోని పరిశీలనాశక్తిని, ఊహాశక్తిని మేల్కొలిపి నూతన ఉత్శాహం కలిగిస్తాయి.పక్షులు తమ ఆహ్లదమయిన రంగులతో, ప్రత్యేకమయిన కూతలతో మన పరిశీలనాశక్తిని పెంపొందిస్తాయి. చాలా వలస పక్షులు వింత వింత విన్యాసాలతో అబ్బురపరచే క్రమశిక్షణతో గుంపులు గుంపులుగా వలస పోవటం గమనిస్తే రోజువారీ జీవితంలోని అలవాట్లు, అరుపులు గమనిస్తే మనకు ఎంతో ప్రేరణ, ఆనందం కలుగుతాయి.ప్రకృతిలో భాగమయిన పక్షులను వీక్షించి ఆనందించటం ప్రకృతితో మమేకం అవటానికి మీ జీవితాంతం దొరికే అపూర్వ అవకాశం. మీ పిల్లలు, విధ్యార్ధులకు ప్రకృతితో పరిచయయంకల్పించటానికి పక్షులను వీక్షించే కార్యక్రమంతోప్రారంభిచటం శ్రేయస్కరం. దీనికి మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదని అనుకోవద్దు. పక్షి శాస్త్రం గురించి విశేష పరిజ్ఞానం లేకపోయినా సరైన సహనం, ఆసక్తితో మీరు చూసిన పక్షులు,వాటి భౌతిక లక్షణాలు, ప్రత్యేకమయిన కూతల గురించిన సమాచారం విధ్యార్ధులతో పంచుకోవటంలో ఉండే ఆనందం, అనుభవం ఎంతో వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తాయి. రేపు లేదనే ఆలోచనతో జీవించు, కలకాలం ఉంటాననే భావంతో విజ్ఞానాన్ని సంపాదించు అని మహాత్మా గాంధీ ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఎన్నో కొత్త ప్రయోగాలకు నాంది పలికాడు. పక్షుల గురించి ఆయనకు ఉన్న ఆసక్తితో విద్యార్థుల కోసం ird Bingo అనే ఒక వినూత్న కార్యక్రమం రూపొందించటానికి దోహదం చేసింది. దీనికి నలుగురు విద్యార్దులను ఒక జట్టుగా ఏర్పరచి, వారికి ఒక బింగో షీట్, పెన్సిల్, పుస్తకం ఇచ్చి స్కూల్ ఆవరణలో వారు చూసిన విశేషాలను అన్నిటిని రాయమని చెప్పి తర్వాత వాళ్లను క్లాస్‌రూమ్‌లో సమావేశపరిచి వాళ్లు సేకరించిన సమాచారం ఇతర విద్యార్థులకు వివరించడం జరగుఉతుంది. తగిన తగిన బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రకృతిని పక్షులను గుర్తించటమే కాకుండా విద్యార్దుల పరిశీలనాశక్తిని , సమాచారాన్ని రాతపూర్వకంగా పదిలపరిచే నిపుణత, తమ చుట్టూ ఉన్న పకృతి విశేషాలను నిశితంగా పరిశీలించే అవకాశం తప్పకుండా కలుగుతుందని భావిస్తాము. ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్దులలో ప్రకృతిపట్ల అనురక్తిని కలిగించే విలువైన సాధనాలుగా భావించి ఎన్నో వినూత్న కార్యక్రమాలు Indian wild life society ద్వారా విద్యార్దుల ప్రయోజనంకోసం రూపొందించటం జరిగింది. ఈ క్రమంలో నదేశంలో సాధారణంగా కనిపించే పక్షుల గురించి రూపొందించిన ఒక ఫ్లాష్ కార్డు ఆట అయితే “ Shell Shoker” తాబేళ్ల గురించి ఆడే కార్డు ఆట మరియు Snake-O-Doo పాములు,నిచ్చనలు ఉండే పరమపదసోపాన పటం/ వైకుంఠ పాళీ ఆట. ఇవన్నీ మనకు online లో దొరుకుతాయి. మరికొన్ని ఆటలు ఆన్లైన్ వెబ్‌సైట్స్ ద్వారా డైన్లోడ్ ఉచితంగా చేసుకోవచ్చు. వివిధ కళాత్మక,సృజనాత్మక కార్యకలాపాలద్వారా పిల్లలలో ఎంతో సంతులనాత్మక అభివృద్దిని సాధించగలం. వివిధ కళాత్మక కార్యకలాపాలద్వారా పిల్లల పరిశీలన దృష్టిని గమనించి వారిని సంబంధిత పాత్రికెయులుగా, వివిధ కళాత్మక ప్రయోగాలు చేయగలిగేవారిగా తయారు చేయగలం. మన దేశంలో సాధారణంగా కనిపించే పక్షుల బాహ్యలక్షణాలు, వాటి చరిత్ర గురించి వేరు వేరు సంసృతులలో ప్రస్తావించిన విశేషాలఫై అవగాహన కలిగి ఉండటం వల్ల పక్షల గురించి కోత్తవారికి ఆసక్తికరంగా మరింత ఉత్సుకత కలిగే విధంగా వివరించే అవకాశం కలిగి ఉండి వారిలో ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించిన వారవుతారు. కాకి వంటి సాధారణ పక్షి తెలివితేటల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లలకు పంచతంత్ర కధలలోని ‘ నీటి కుండలోని నీరు గులకరాళ్ళువేసి పయికితెచ్చి దాహం తీర్చుకున్న తెలివయిన కాకి” కధ చెప్పి వారిని ఆనందింపచేయవచ్చు.మీ పరిసరాలలో కనపడే సాధారణ పక్షుల గురించిన సమాచారం ఎన్నో మాధ్యమాల ద్వారా పొందగలరు. ఇందులో ప్రముఖంగా మెర్లిన్అనే అప్ ద్వారా మీ పరిసరాలలో ఉన్న పక్షుల గురించిన సమాచారం పొందవచ్చు. Early bird అనే App నుంచి వివిధ రకాల పక్షుల ఫోటోలు తీసి వాటి లక్షణాలను, కూతలను కూడా వినే అవకాశం ఉంది. ఈ యాప్స్ అన్ని భారతీయ బాషలలో అందుబాటులో ఉంది. పిల్లలకు ప్రకృతితో అనుబంధం కల్పించడం చాలా అవసరం. పర్యావరణ అనిస్టితి కారణంగా పిల్లలలో ప్రకృతి పట్ల మరింత అవగాహన కల్పించటం వలన వారిలో మరింత ఆసక్తి, ప్రకృతి పట్ల స్నేహభావం,కలిగించి భూ వాతావరణంపట్ల మరింత జాగరూకతతో తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో శ్రీ డేవిడ్ సోరెల్ అన్నట్లు.. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు, బముముఖ సాధికారత పొందడానికి మొదట ఈ భూమిని ప్రేమించేలా చేయడం, తర్వాత దాని సంరక్షణ కోసం చర్యలు తీసుకునేలా చేసి ప్రకృతిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. Author - గరిమా భాటియా ఫోటోలు: సౌమిత్రా దేశ్‌ముఖ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Pudami Sakshiga : భూమ్మీద ఆక్సిజన్ శాశ్వతం కాదా? ఆ తర్వాత అంతమేనా?
ఆక్సిజన్..ప్రాణాలు నిలబెట్టే వాయువు. ఐ–కొలి లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మినహా భూమ్మీద సమస్త జీవజాలాల మనుగడకు ఈ ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువుకు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా అంటే వింతగా అన్పించినా వాస్తవం. కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది. ఆ తరువాత మరో వంద కోట్ల సంవత్సరాలకు భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. అప్పటికి ఇంకా భూమి మీద ఉన్న అనేక రకాల వాయువుల్లో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం మొదలయ్యింది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఓ మోస్తరు ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా అభివర్ణించారు. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోటాను కోట్ల జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది. నైట్రోజన్దే రాజ్యం భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి గాలిలో 99 శాతం ఉన్నాయన్నమాట. ఇక ఆగాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి. సౌర కుటుంబంలోని మిగతా గ్రహాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దాదాపుగా లేదు. ఒకవేళ ఉన్నా ఇతర వాయువుల సంయోగంలో మాత్రమే ఉంది. ఉదాహరణకు వీనస్ (శుక్రుడు), మార్స్ (అంగారకుడు) గ్రహాల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కలిసి 98 శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇతర గ్రహాలతో పాటు వీటిల్లోనూ జీవావిర్భావానికి అనుకూలమైన వాతావరణం లేదు. కిరణాలే జన్మదాతలు భూమ్మీద లభించే ఆక్సిజన్ దాదాపుగా కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) సృష్టించిందే. అయితే కేవలం భూమ్మీది వృక్ష జాతుల్లో జరిగే ఫొటోసింథసిస్ వల్లే మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందనుకుంటే పొరపాటే. సగం సముద్రంలో కూడా పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటి వృక్ష సంబంధమైనవి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఫొటోసిం«థసిస్ ద్వారా ఆక్సిజన్‌ను సృష్టిస్తోంది. అయితే సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో భూ వాతావరణంలో కలిసేది అత్యల్పమనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ చాలావరకు సముద్ర జీవజాలాల మనుగడకే సరిపోతుంది. కాబట్టి భూమ్మీద మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ దాదాపుగా వృక్ష జాతుల పుణ్యమే. ఎంత చెట్టుకు అంత.. ఎదిగిన చెట్టుకు ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు ఉంటాయి. అయితే చెట్టులో ఐదు శాతంగా ఉండే ఆకులు మాత్రమే ఆక్సిజన్‌ను తయారు చేస్తాయి. వేర్ల నుంచి వచ్చే నీరు, సూర్యరశ్మి, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆకులు గ్రహించి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా చెట్టు ఎదుగుదలకు కావలసిన గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదిలేస్తాయి. చెట్లు కూడా కొంత ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి కానీ విడుదల చేసే ఆక్సిజన్‌తో పోల్చుకుంటే అది అతిస్వల్పం. ఇలా వాతావరణంలో ఆక్సిజన్ చేరుతూ ఈ రోజు మొత్తం గాలిలో 21 శాతాన్ని ఆక్రమించింది. సమయం, కాలం ఇతర వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక చెట్టు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే చెట్టు లేదా మొక్క రకాన్ని బట్టి ఆక్సిజన్ ఉత్పత్తి పరిమాణం మారుతూ ఉంటుంది. చాలావరకు మొక్కలు, చెట్లు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. కొన్ని అరుదైన వృక్ష జాతులే 24 గంటలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు చాలామంది ఇంట్లో పెంచుకునే తులసి చెట్టు రోజులో 20 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాగే అరెకాపామ్గా పిలిచే పోకచెట్టు 24 గంటల పాటూ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతూనే ఉంటుంది. ఆరేడు చెట్లు = ఓ మనిషి మనుగడ ఒక అంచనా ప్రకారం ఒక ఆకు గంటకు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది. వంద అడుగుల భారీ వృక్షం ఏడాదికి 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్తత్తి చేయగలదు. చిన్నా పెద్ద చెట్లు సగటున 260 పౌండ్లు అంటే సుమారు 120 కిలోల ఆక్సిజన్ని ఏడాదికి సృష్టిస్తాయి. మనిషి సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటాడు. అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనిషి పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే దేహం ఉపయోగించుకుని మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు. అంటే సగటున ఆరు నుంచి ఏడు చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ఓ మనిషి మనుగడకు సరిపోతుందన్నమాట. భూమ్మీద శాశ్వతం కాదా? ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారి అభిప్రాయం. నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందనే అంచనాకు వచ్చారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగి, ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందనేది వారి అంచనా. 20 వేల టన్నుల సామర్థ్యం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక రోగులు పడిన అవస్థలు గుర్తుండే ఉంటాయి. భారతదేశం కోవిడ్ కాలానికి ముందు రోజుకి 6,900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. అందులో 1,000 టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు అందుబాటులో ఉండేది. మొదటి విడత కోవిడ్ సమయంలో దీని అవసరం 3,095 టన్నులకు, రెండో విడత అంటే 2021లో 5,500 టన్నులకు పెరిగిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ వైద్య పరంగా ఇప్పుడు మనకు సగటున రోజుకు 1,250 టన్నుల ఆక్సిజన్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ద్వారా 7,054 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక ఏఎఫ్‌ఏఏ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘కార్పొరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్‌ఏఏ చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం. ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. -
పుడమి ‘సాక్షి’కి అంతర్జాతీయ గౌరవం.. సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక AAFA అవార్డు
ముంబై/హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. IAA ఆధ్వర్యంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ AAFA.. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఎంపిక చేసి కార్పోరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్ సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల సమర్పణ కార్యక్రమంలో సాక్షి మీడియా తరుపున సాక్షి కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డికి AAFA చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. ► ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020-21లో ప్రారంభమై ఇప్పటికి మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్తు తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి ప్రధాన కారణం మనుష్యులే. ఈ భూమి మళ్లీ పునర్వైభవాన్ని దక్కించుకోవాలంటే .. ప్రతీ ఒక్కరు నిరంతరం చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ► ఏడాది పాటు ప్రతీ నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు అందరిని ఇందులో భాగస్వామ్యులను చేస్తోంది. దీంతో పాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటల పాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. ► పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు, తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ నాగరాజు, మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, సినీ నటుడు అలీ, CEO అనురాగ్ అగ్రవాల్, డైరెక్టర్ KRP రెడ్డి, బిజినెస్ కంట్రోల్ డైరెక్టర్ ALN రెడ్డి, కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ YEPరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డిజిటల్ శ్రీనాథ్ ఇక AAFA అవార్డు సందర్భాన్ని పురస్కరించుకుని సాక్షి మీడియా హౌస్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సినీనటుడు అలీ పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూపు సంకల్పాన్ని అలీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పుడమి సాక్షికి గౌరవం.. సెలబ్రేషన్స్ ఫొటోల కోసం క్లిక్ చేయండి -
Pudami Sakshiga: వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ
Pudami Sakshiga 2023: రెడ్యూస్.. రీయూస్.. రీసైకిల్! వాడకం తగ్గించుకోవడం... వాడేసినవే మళ్లీ వాడటం... పడేసిన వాటితో కొత్తవి తయారు చేసుకుని వాడుకోవడం..! ఏమిటీ కర్మ! అవును కర్మే. మనిషి వల్ల పుడమికి పట్టిన కర్మ! అవసరం ఉన్నవీ లేనివి కొని, అవసరం తీరీ తీరకుండానే పడేస్తున్నాం. కొత్తవి కొంటున్నాం. కుండెడన్నం కోసం బండెడన్నం వండేస్తున్నాం. ఫ్రిజ్‌ని రైతుబజార్‌ని చేస్తున్నాం. వార్డ్రోబ్ పొట్ట పగిలేలా బట్టల్ని కుక్కేస్తున్నాం. భారీ ఫర్నీచర్‌తో ఇంటినంతా నింపేస్తున్నాం. బకెట్ల కొద్దీ నీళ్ల ట్యాంకుల్ని ఖాళీ చేస్తున్నాం! ఇ.ఎం.ఐ.ల కొద్దీ మన దగ్గర డబ్బుంటే ఉండొచ్చు. పుడమి దగ్గర ఇప్పుడు.. దాదాపుగా నో స్టాక్! పంచభూతాల షార్టేజ్!! తక్షణం మన వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ! ఈ కఠోర వాస్తవంపై ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్తో గత మూడేళ్లుగా సమాజానికి అవగాహన కల్పిస్తూ వస్తున్న.. ‘సాక్షి మీడియా గ్రూప్’ ఈ ఏడాది ‘రెడ్యూస్..రీయూజ్.. రీసైకిల్..’ అనే థీమ్‌తో ఈవెంట్‌ని నిర్వహించింది. వాడకం తగ్గించి, వృథాను నివారించి, వ్యర్థాలను తగ్గిస్తేనే పుడమి తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందని ఈ టాకథాన్ ద్వారా పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, కళాకారులు, సినీ హీరోల చేత చెప్పించింది. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది. ∙∙ మూడో ఎడిషన్‌లో ధరిత్రిని కాపాడుకోవాలి, భూమిని కాలుష్య కాసారం కానీయకుండా భవిష్యత్తరాలకు అందించాలి అనే లక్ష్యంతో సాక్షి మీడియా గ్రూపు చేపట్టిన ప్రచారోద్యమమే ‘పుడమి సాక్షిగా..’ ఇప్పటివరకు రెండు ఎడిషన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మొదటి ఎడిషన్‌లో... ప్రమాదం అంచుకు ఎలా చేరాం? పుడమికి మనం ఏం తిరిగి ఇవ్వాలి? పర్యావరణానికి ఏం అవసరం? అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెండో ఎడిషన్‌లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సకల ప్రాణులకూ ఆవాసంగా నేల, తక్కువ కాలుష్యంతో విద్యుత్ ఉత్పాదన అనే అంశాలను ప్రధానంగా చర్చించింది. ఈ మూడో ఎడిషన్‌లో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ప్రముఖుల సూచనలను, సలహాలను స్వీకరించింది. సాక్షి ‘ఫన్ డే’ ద్వారా వాటిని పాఠకులకు అందించింది. సాక్షి టీవీ ద్వారా గురువారం వీక్షకులకు అందిస్తోంది. నాకు నచ్చిన ప్రోగ్రాం సామాజిక బాధ్యతను కర్తవ్యంగా తీసుకుని సాక్షి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్.. పుడమి సాక్షిగా. భగవంతుడు మనకిచ్చిన వరం పర్యావరణం. ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళి అందరిదీ. నేటి తరాలు బాధ్యతగా జీవిస్తేనే భావితరాలకూ ఈ వరం అందుతుంది. – రోజా, పర్యాటక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది సాక్షి తీసుకున్న ‘పుడమి సాక్షిగా..’ అనే ఈ గొప్ప ఇనీషియేటివ్‌లో అందరం భాగస్వాములం కావాలి. పుడమి అంటే తల్లి. తల్లిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిదీ. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే అమెరికన్ ఎన్జీవోతో ఎం.ఓ.యు. కుదుర్చుకుని విశాఖ బీచ్‌లో పోగయ్యే ప్లాస్టిక్‌ని రీయూజ్ చేయిస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికింది. పుడమి సంరక్షణకు ప్రజల్ని చైతన్యం చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ రైతు.. భూమి.. పుడమి సాక్షి మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది. వ్యవసాయం విషయానికి వస్తే.. ప్రకృతి సాగు విధానాల వల్ల పుడమి కి ఎంతో మేలు జరుగుతోంది. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సాధికార సంస్థల ఏర్పాటుతో రైతుకు, భూమికి, పుడమికి ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తున్నాం. – కాకాని గోవర్ధన్, వ్యవసాయశాఖ మంత్రి, ఏపీ గ్రీన్ వెజిటేషన్కు ప్రాధాన్యం సాక్షి చేపట్టిన ‘పుడమి సాక్షిగా..’ ఒక మంచి ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా నేడు కలవరం కలిగిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రత్యేకమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కోటీ యాభై ఎకరాల వ్యవసాయ భూమి సాగు అయ్యేలా నీటి అందించి, గ్రీన్ వెజిటేషన్ని సాధిస్తోంది. – నిరంజన్ రెడ్డి, సహకార శాఖ మంత్రి, తెలంగాణ పాఠశాల స్థాయి నుంచే కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. పాఠశాల నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇన్సెంటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఉదా.. క్లాస్ రూమ్‌ని శుభ్రంగా ఉంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి. ఇప్పుడు మనం ప్రకృతి పట్ల శ్రద్ధ వహిస్తేనే భవిష్యత్ తరాలు పచ్చగా ఉంటాయి. – అడివి శేష్, సినీ హీరో ఎకో–ఫ్రెండ్లీ స్కూల్ క్యాంపస్ ‘పుడమిసాక్షిగా..’ టాకథాన్కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వాతావరణ మార్పులు భూతాపానికి కారణం అవుతున్నాయనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున ఈజిప్ట్‌లో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరై అధ్యయన పత్రం సమర్పించాను. మా స్కూల్ క్యాంపస్ లో కూడా ఎన్విరాన్మెంట్ పిట్స్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించుకున్నాం. – అంకిత్ సుహాస్, కాప్–27 డెలిగేట్ వస్తు వినియమం బాగా తగ్గాలి గత దశాబ్దంగా మన దగ్గర ఉన్న గణాంకాలని బట్టి చూస్తే అర్బన్‌కి, రూరల్‌కు మధ్య వస్తు వినియోగ సంస్కృతిలో ఏ విధమైన తేడా కనిపించని పరిస్థితి. గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండిటినీ స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ హ్యాండిల్ చేస్తోంది. వీటిని కంపేర్ చేసినప్పుడు.. కొనే రాశిలో తేడా ఉందేమో కానీ, ఇంటింటి నుంచీ వచ్చే రోజువారీ వ్యర్థాలు దాదాపు ఒకే మొత్తంలో ఉంటున్నాయి. వ్యర్థాలు ఎక్కువైతే పుడమికి ముప్పు కనుక రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ మన తక్షణ అవసరం. – సంపత్ కుమార్, ఐ.ఎ.ఎస్. స్వచ్ఛాంధ్ర ఎండీ పిల్లలకు క్లీన్లీనెస్ నేర్పాలి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. ఇదే తెలుసు మనోళ్లకి. కానీ, రాబోయే తరానికి మనం ఏం ఇస్తున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగాలి. పుడమిసాక్షిగా.. నేను ప్రతి మనిషికీ చెప్పేది ఒకటే.. మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి విద్య. నేర్పాల్సింది క్లీన్లీనెస్. పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచితే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. మన దేశం శుభ్రంగా ఉంటుంది. మనం అందరికీ ఇన్సిపిరేషన్ అవుతాం. – అలీ, మీడియా అడ్వైజర్, ఏపీ మెటీరియలిజం వల్లే ఇదంతా..! మన జీవన విధానం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పుడమికి హితంగా మన అలవాట్లు మార్చుకోవాలి. ఆర్టీసీలో మేము రీయూజ్ అనే కాన్సెప్ట్‌ని అవలంబిస్తున్నాం. మెటీరియలిజంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం సాక్షి మీడియా గత మూడేళ్లుగా ‘పుడమి సాక్షిగా..’ అనే ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూ, టాకథా¯Œ ని నిర్వహించడం అభినందనీయం. – వి.సి.సజ్జనార్, ఐపీఎస్, టి.ఎస్.ఆర్టీసీ ఎండీ త్రిబుల్ ‘ఆర్’ ప్రస్తుతావసరం ఇటువంటి ముఖ్య అంశంపై డిబేట్ ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం గూంజ్ సంస్థ ప్రారంభమైంది. తిండి, బట్ట, నివాసం అనే కనీస అవసరాలలో మేము దుస్తులపై దృష్టి పెట్టాం. దుస్తులను విరాళంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు అందిస్తున్నాం. ఆ విధంగా సంపన్నుల దగ్గరి వేస్టేజ్‌ని రీయూజ్‌కు అందిస్తున్నాం. సంపన్నులను పరోక్షంగా రెడ్యూస్కు ప్రేరేపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ ఆర్‌తోనే పుడమిని సంరక్షించుకోగలం. – మీనాక్షీ గుప్తా, ‘గూంజ్’ సంస్థ చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
రీసైక్లింగ్‌కు దిక్సూచి.. టోక్యో ఒలింపిక్స్! ఈ విశేషాలు తెలుసా?
Pudami Sakshiga 2023: జపాన్ రాజధాని టోక్యోలో 2020లో జరిగిన ఒలింపిక్స్ రీసైక్లింగ్‌కే దిక్సూచిగా నిలిచిపోతాయి. ఒలింపిక్స్ నిర్వహణలో రీసైక్లింగ్‌తో జపాన్ చేసిన ఏర్పాట్లు పుడమి భవిష్యత్తునే నిలబెట్టాయి. ఒలింపిక్స్‌లో రీసైక్లింగ్ పోటీలు, పతకాలు ఉండకపోవచ్చు గాని, ప్రపంచాన్నే విస్మయపరచే రీసైక్లింగ్ ప్రాజెక్టులతో జపాన్ మహా విజేతగా నిలిచి, యావత్ ప్రపంచానికే పర్యావరణ సుస్థిర మార్గాన్ని చూపింది. టోక్యో ఒలింపిక్స్‌ను ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 300 కోట్ల మందికిపైగా జనాలు వీక్షించారు. వాళ్లు వీక్షించినది కేవలం క్రీడలను మాత్రమే కాదు, ఆ క్రీడల నిర్వహణలో ‘సూక్ష్మంలో మోక్షం’లా జపాన్ ప్రభుత్వం రీసైక్లింగ్‌తో చేసిన అద్భుతమైన ఏర్పాట్లను కూడా. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో పుడమికి హితవుగా ఉందో 2020 నాటి ఒలింపిక్స్ క్రీడల కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాయి. ఒలింపిక్స్ క్రీడా కార్యక్రమాల కోసం జపాన్ పూర్తిగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తయిన విద్యుత్తునే ఉపయోగించుకుంది. ఎక్కువగా సౌర విద్యుత్తును, బయోమాస్ నుంచి ఉత్పత్తయిన విద్యుత్తును ఈ క్రీడల కోసం ఉపయోగించుకోవడం విశేషం. కలపతో ఒలింపిక్స్ విలేజ్ అలాగే, ఒలింపిక్స్ విలేజ్‌ను స్థానిక అధికారులు విరాళంగా ఇచ్చిన కలపతో నిర్మించారు. ఇందులో వాడిన కలప తర్వాత రీసైక్లింగ్‌కు పనికొచ్చేదే! ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం నిర్మించిన వసతి భవనాలను, కార్యక్రమాలు మొత్తం ముగిశాక స్థానిక జనాభాకు నివాసాలుగా పనికొచ్చేలా నిర్మించారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో పోడియంలు మెడల్స్ ప్రదర్శన సమయంలో క్రీడాకారులు ఉపయోగించే పోడియంలను కూడా జపాన్ ప్లాస్టిక్ వ్యర్థాలతోనే తయారు చేసింది. ప్రతి పోడియంలోని చిన్న చిన్న ఘనాకారపు మాడ్యూల్స్ కూడా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారైనవే! ఒలింపిక్స్ పోడియంల తయారీకి జపాన్ 24.5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించింది. ఈ వ్యర్థాలను ప్రజల ఇళ్ల నుంచి సేకరించింది. ఒలింపిక్స్–2020 క్రీడోత్సవాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కగానే, జపాన్ దీనికోసం 2018 నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది. సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్‌కు పనికొచ్చేవే! ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ కొత్త జాతీయ స్టేడియం నిర్మాణానికి ఉపయోగించిన ప్లైవుడ్ ప్యానెల్స్ తయారీకి 87 శాతం కలపను ఆగ్నేయాసియా వర్షారణ్యాల నుంచి సేకరించారు. స్టేడియం పైకప్పుకు అమర్చిన సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్‌కు పనికొచ్చేవే! తక్కువ వనరులతో, తక్కువమంది మనుషులతో, తక్కువ గంటల్లో పుడమికి వీలైనంత తక్కువ హానిచేసే సాంకేతిక పరిజ్ఞానంతో ఒలింపిక్స్ వంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమేనని జపాన్ నిరూపించింది. రీసైక్లింగ్ టెక్నాలజీతో టోక్యో ఆవిష్కరించిన ప్రాజెక్టులన్నీ పుడమికి హితమైనవే! వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొన్నింటిని పరిశీలిద్దాం... అథ్లెట్ల కోసం కార్డ్బోర్డ్ మంచాలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల విశ్రాంతి కోసం జపాన్ వినూత్నమైన ఏర్పాట్లు చేసింది. అథ్లెట్లు నిద్రించేందుకు ప్రత్యేకంగా హైరెసిస్టెంట్ కార్డ్బోర్డ్ మంచాలను ఏర్పాటు చేసింది. మంచాల తయారీకి ఎన్నిసార్లయిన రీసైక్లింగ్‌కు పనికొచ్చే పాలిథిన్ ఫైబర్లతో ఈ మంచాల తయారీ జరిగింది. శరీరానికి ఎగువ, మధ్య, దిగువ భాగాల్లో హాయినిచ్చే విధంగా మూడు వేర్వేరు విభాగాలతో ఈ మంచాలను రూపొందించారు. అంతేకాదు, ప్రతి అథ్లెట్ శరీరాకృతికి అనుగుణంగా వారు మాత్రమే ఉపయోగించుకునేలా ఈ కార్డ్బోర్డ్ మంచాలను, వాటిపై పరుపులను తయారు చేశారు. ఒలింపిక్స్ క్రీడలు ముగిశాక కార్డ్‌బోర్డ్‌ను పేపర్ ఉత్పత్తులుగా, పరుపులను ప్లాస్టిక్ ఉత్పత్తులుగా రీసైకిల్ చేసే ఉద్దేశంతో జపాన్ ప్రభుత్వం వీటిని తయారు చేయించింది. పాత సెల్ఫోన్లతో పతకాలు! ఒలింపిక్స్ విజేతలకు పతకాలను ఆతిథ్య దేశమే ఇవ్వడం ఆనవాయితీ. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలు విజేతలకు ఇవ్వాల్సిన పతకాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తుంటాయి. వాటికి కావలసిన కంచు, వెండి, బంగారు లోహాలను సమకూర్చుకుంటుంటాయి. జపాన్ మాత్రం పతకాల తయారీకి ప్రత్యేకంగా ప్రయాస పడలేదు. పతకాల తయారీ కోసం ప్రజల నుంచి వాడిపడేసిన పాత సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విరాళంగా సేకరించింది. వాటి నుంచి వేరుచేసిన లోహాలతోనే విజేతలకు పతకాలను తయారు చేయించింది. ప్రజల నుంచి విరాళంగా వచ్చిన వాటిలో ఏకంగా 60.21 లక్షల పాత నోకియా ఫోన్లు ఉండటం విశేషం. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్ టార్చ్ రీసైక్లింగ్, రీయూజ్ సాంకేతికతకు జపాన్ అందించిన ఒలింపిక్స్ పతకాలు వినూత్న ఉదాహరణగా నిలుస్తాయి. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్ టార్చ్! ఒలింపిక్స్‌లో కీలకం ఒలింపిక్ టార్చ్. ఒలింపిక్స్ టార్చ్ తయారీకి జపాన్ అల్యూమినియం వ్యర్థాలను ఉపయోగించింది. జపాన్‌లో 2011లో భూకంపం, సునామీ సంభవించాక అప్పట్లో నిర్వాసితుల కోసం నిర్మించిన తాత్కాలిక గృహాల నుంచి సేకరించిన అల్యూమినియం వ్యర్థాలనే ఒలింపిక్ టార్చ్ తయారీకి వాడారు. జపాన్ జాతీయ పుష్పం సాకురా చెర్రీ పూవును పోలినట్లు ఐదువిభాగాలుగా ముడుచుకున్న ఒలింపిక్ టార్చ్‌ను తయారు చేశారు. స్థానిక రవాణాకు రీసైకిల్ వాహనాలు జపాన్‌కు చెందిన వాహనాల తయారీ సంస్థ టయోటా డ్రైవర్‌లేని వాహనాలను త్వరలోనే రోడ్ల మీదకు తెచ్చేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తోంది. రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలే అదే స్ఫూర్తితో ఒలింపిక్స్ క్రీడాకారులను వసతి ప్రదేశం నుంచి క్రీడా స్థలికి, క్రీడా మైదానం నుంచి వసతి ప్రదేశానికి, టోక్యో నగరంలో వారు స్థానికంగా తిరగడానికి వీలుగా జపాన్ పూర్తిగా రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించింది. పెద్ద తలుపులు, సులువుగా ఎక్కి దిగడానికి వీలుగా వీటి నిర్మాణం ఉండటంతో క్రీడాకారులు వీటిలో సౌకర్యవంతంగా ప్రయాణించగలిగారు. ఒలింపిక్స్ తర్వాత టోక్యోలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను 42 పెద్దస్థాయి క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లోనూ జపాన్ పూర్తిగా రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించింది. -నరసింహారావు -
ది అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీ.. తక్కువ ఖర్చుతో నీరు పునర్వినియోగం
నీటి కొరత పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా నీటి పునర్వినియోగం అవసరం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. వ్యర్థజలాలను శుద్ధిచేసి, పునర్వినియోగానికి అనువుగా మార్చే పద్ధతులు కొన్ని అందుబాటులోకి వచ్చినా, అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పెద్దపెద్ద పరిశ్రమలు మాత్రమే వాటిని భరించగలుగుతున్నాయి. ఇప్పుడు ఎంత చిన్న పరిశ్రమ అయినా సులువుగా భరించగలిగేలా, తక్కువ ఖర్చుతో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని అందిస్తోంది ‘టడాక్స్’ (ది అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీ). ఈ పద్ధతిని న్యూఢిల్లీకి చెందిన ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. కేవలం యూవీ–ఫొటో కాటాలిసిస్ సాంకేతికత ఉపయోగించి మునిసిపల్, మురుగునీరు, కలుషిత పారిశ్రామిక నీటి ప్రవాహాలను శుద్ధి చేసి, పునర్వినియోగానికి తగిన విధంగా మంచినీటిని అందిస్తుంది. అంతేకాదు, ఈ అధునాతన సాంకేతికత పారిశ్రామిక మురుగునీటి శుద్ధికి జరిగే మూలధన వ్యయాన్ని 25 నుంచి 30 శాతం, నిర్వాహణ వ్యయాన్ని 30 నుంచి 40 శాతం వరకు తగ్గిస్తుంది. ఎలా పనిచేస్తుంది? టడాక్స్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో యూవీ ఫొటో క్యాటాలిసిన్ పద్ధతి ఉపయోగించి కాంతిని రసాయనికశక్తిగా మారుస్తుంది. రెండో దశలో అధునాతన ఆక్సీకరణ ప్రక్రియ ఉంటుంది. ఇది ఆక్సీకరణ క్షీణత, కాలుష్య కారకాల ఖనిజీకరణ చేసి, బయో–డీగ్రేడబిలిటీని మెరుగుపరుస్తుంది, పొరల బయో ఫౌలింగ్ను నివారిస్తుంది. దీంతో నీటిలోని ఘన మలినాలను పీల్చుకుని వడగొట్టే ఆర్ఓ (రివర్స్ అస్మాసిస్)ల జీవితకాలం, సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మల్టిఫుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్లు, మెకానికల్ ఆవిరి రీకంప్రెషన్లపై భారాన్ని పెంచి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), వ్యాధికారకాలు, నిరంతర జీవ కాలుష్య కారకాలు, సూక్ష్మ కాలుష్య కారకాలను తగ్గిస్తుంది. తృతీయ దశలో నాణ్యత స్థాయిని గుర్తించి, పునర్వినియోగానికి అనువైన పరిశుభ్రమైన నీటిని అందిస్తుంది. త్వరలోనే అమలు.. టడాక్స్ను ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ ‘నమామి గంగే’ కార్యక్రమం కింద కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఇది 2021 ఏప్రిల్‌లోనే ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లు, టెక్నాలజీ అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఒప్పందం ద్వారా వాణిజ్యీకరణకు సిద్ధమైంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయి కార్యాచరణలోకి రావచ్చు. ∙దీపిక కొండి -
వ్యర్థం నుంచి అర్థం.. రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు?
2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేతలో వెలువడిన నిర్మాణ వ్యర్థాలు 1,46,000 మెట్రిక్ టన్నులు. వీటన్నింటినీ ఏం చేయాలి? పెద్ద సమస్య! హైదరాబాద్‌లోనే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఉండటంతో అక్కడకు తరలించారు. 2022లో నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసినప్పుడు వెలువడిన వ్యర్థాలు 30,000 మెట్రిక్‌టన్నులు. వాటినేం చేయాలి ? అక్కడ ఉన్న ప్లాంట్‌కు తరలిస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చివేస్తే, నోయిడాలో అక్రమ నిర్మాణం జరిపినందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చేశారు. ఇలా పెద్ద పెద్ద భవంతులే కాదు ఏ రకమైన నిర్మాణాలను కూల్చివేసినా, లేదా కొత్తగా నిర్మాణాలు చేపట్టినా నిర్మాణ ప్రక్రియలోను, కూల్చివేతల తర్వాత వ్యర్థాలు వెలువడటం తెలిసిందే. ప్లాస్టిక్ మాదిరిగానే వీటిని కూడా రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించేందుకు సీ అండ్ డీ వేస్ట్ (నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల) రీసైక్లింగ్ ప్లాంట్స్ ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సీ అండ్ డీ వేస్ట్ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను హైదరాబాద్ సీ అండ్ డీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్‌గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్‌పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్‌లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను సేకరిస్తోంది. రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు? శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్‌తో ‘వెట్‌ప్రాసెస్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్‌కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్‌లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. ఇసుక, మెటల్, కంకరలను యాడ్‌మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్‌బ్లాక్‌లు, కెర్బ్‌స్టోన్, టైల్స్, ప్రీకాస్ట్ వాల్స్ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్ ఫిల్లింగ్‌కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వాడవచ్చు. సిల్ట్‌ను ల్యాండ్‌ఫిల్లింగ్‌కు వాడవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు. దేశంలో రీసైక్లింగ్ ఒక్క శాతమే.. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ టన్నులు కాగా 1.80 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం సీ అండ్ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో రోజుకు 2200 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఒక్కోప్లాంట్ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. గత నవంబర్ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. జీహెచ్ఎంసీలో ఇలా.. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటా¯Œ చెరువు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్‌కు తరలిస్తారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ ఫో¯Œ నంబర్: 18001201159, వాట్సాప్ నంబర్: 9100927073. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్ సెంటర్‌కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్‌పేట దగ్గరి తూముకుంట సెంటర్‌కు తరలిస్తారు. టోల్‌ఫ్రీ నంబర్ 18002030033కు ఫోన్ చేసి, లేదా వాట్సాప్‌నంబర్ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. ఎంత ఫీజు.. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్‌కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్‌పేట:రూ.435, శంషాబాద్:రూ.405. ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ∙ సిహెచ్ వెంకటేశ్ నైపుణ్యంతో నాణ్యమైన ఉత్పత్తులు.. నైపుణ్యాలను పెంచుకుంటూ ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’ సీ అండ్ డీ వ్యర్థాలతో నాణ్యమైన, మన్నిక కలిగిన, విలువైన ఉత్పత్తుల్ని చేస్తోంది. మా కంపెనీకి చెందిన ఆరు కేంద్రాల ద్వారా ఏటా 3,10,985 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 92 శాతం రీసైక్లింగ్ సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మరో రెండు కేంద్రాలు పని ప్రారంభించనున్నాయి. ఈ రంగంలో గడించిన అనుభవంతో వేస్ట్‌ను ఆదాయ వనరుగా మారుస్తున్నాం. గత సంవత్సరం పేవర్బ్లాకులు, కెర్బ్స్టో¯Œ ్స, ఇటుకలతో సహా మొత్తం 1,83,561 యూనిట్లను ఉత్పత్తి చేశాం. నోయిడాలో సూపర్‌టెక్ ట్వి¯Œ టవర్స్ కూల్చివేతలో వెలువడిన 30వేల టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలను రీసైక్లింగ్‌తో నాణ్యమైన నిర్మాణ ఉత్పత్తులుగా మారుస్తున్నాం. రీసైక్లింగ్ ద్వారా మెరుగైన ఉత్పత్తులతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్‌ను అందజేస్తున్నాం. రోజురోజుకూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాం. – గౌతమ్‌రెడ్డి, ఎండీ, రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్. జాతికి మేలు జరగాలని.. మూడు దశాబ్దాలకుపైగా భవనాలు, బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణరంగంలో ఉన్న మా సంస్థ ద్వారా ప్రజలకు, పర్యావరణానికి మేలు చేయాలనే తలంపుతో ఈ రంగంలోకి ప్రవేశించాం. పునరుత్పత్తులపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఏమైనా చేయవచ్చుననే నమ్మకం ఉంది. వేల టన్నులతో గుట్టలుగా పేరుకుపోతున్న సీ అండ్ డీ వ్యర్థాలతో ఎన్నో అనర్థాలున్నాయి. చెరువుల్లో నింపుతున్నందున చెరువులు కనుమరుగవుతున్నాయి. సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్ ఎందుకు జరగడం లేదా అని ఎన్నో ఏళ్లనుంచి ఆలోచిస్తున్నాం. దేశంలోని వివిధ నగరాల్లో రెండు సంవత్సరాలు పరిశోధన చేశాం. ఆయా నగరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ల పనితీరు పరిశీలించాం. చేయగలమనే నమ్మకంతో ఈ రంగంలోకి దిగాం. ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలకు తగిన అవగాహన కలిగేలా విస్తతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పునరుత్పత్తులను ప్రోత్సహించాలి. భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలోనే అధికారులు ఈ ఉత్పత్తుల గురించి తెలియజేయాలి. – సోమ శ్రీనివాసరెడ్డి, ఫౌండర్, ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సీ అండ్ డీ వేస్ట్ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను హైదరాబాద్ సీ అండ్ డీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్‌గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్‌పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్‌లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను సేకరిస్తోంది. రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు? శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్‌తో ‘వెట్‌ప్రాసెస్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్‌కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్‌లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. ఇసుక, మెటల్, కంకరలను యాడ్‌మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్‌బ్లాక్‌లు, కెర్బ్‌స్టోన్, టైల్స్, ప్రీకాస్ట్ వాల్స్ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్ ఫిల్లింగ్‌కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వాడవచ్చు. సిల్ట్‌ను ల్యాండ్‌ఫిల్లింగ్‌కు వాడవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్ష¯Œ అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు. దేశంలో రీసైక్లింగ్ ఒక్క శాతమే.. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ టన్నులు కాగా 1.80 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం సీ అండ్ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో రోజుకు 2200 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఒక్కోప్లాంట్ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. గత నవంబర్ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. జీహెచ్ఎంసీలో ఇలా.. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటాన్ చెరువు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్‌కు తరలిస్తారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్: 18001201159, వాట్సాప్ నంబర్: 9100927073. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్ సెంటర్‌కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్‌పేట దగ్గరి తూముకుంట సెంటర్‌కు తరలిస్తారు. టోల్‌ఫ్రీ నంబర్ 18002030033కు ఫోన్ చేసి, లేదా వాట్సాప్‌నంబర్ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. ఎంత ఫీజు.. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్‌కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్‌పేట:రూ.435, శంషాబాద్:రూ.405. ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ∙ సిహెచ్ వెంకటేశ్ -
భాగ్యనగరానికి ఈ-వేస్ట్ బెడద
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ–వేస్ట్) అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఈ–వేస్ట్ సేకరణ మొదలుకొని దానిని భాగాలుగా విడదీయడం, రీ సైక్లింగ్ చేయడంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించక పోవడంతో పర్యావరణానికి భారీగా హాని కలుగుతోంది. మరోవైపు ఈ–వేస్ట్‌లో ఉండే విలువైన లోహాలు చెత్త రూపంలో భూమి పొరల్లోకి చేరుతుండటంతో ఆర్థికంగా కూడా నష్టం జరుగుతోంది. కొంత మొత్తంలో ఈ–వేస్ట్‌ను సేకరించినా అనియంత్రిత రంగంలో రీసైక్లింగ్ కావడం కూడా అనేక సమస్యలకు దారితీస్తోంది. నిత్య జీవితంలో సాంకేతికత ప్రాధాన్యంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా భారీగా పెరిగింది. సీపీయూతో పాటు ఇన్ పుట్, ఔట్పుట్ డివైజ్లతో కూడిన పీసీలు, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ప్రింటర్లు, కాట్రిడ్జ్‌లు, టెలివిజన్లు ఎల్ఈడీ, ఎల్సీడీ, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం నిత్య జీవనంలో పెనవేసుకుపోయింది. నిరుపయోగంగా మారిన ఈ ఉపకరణాలు, పరికరాలు తదితర ఈ–వేస్ట్‌ను ఎలా వదిలించుకోవాలో తెలియక పోవడం అనేక సమస్యలకు దారితీస్తోంది. వీటి డిస్మాంట్లింగ్, రీ సైక్లింగ్‌లను గుర్తింపు పొందిన సంస్థలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తాయి. అయితే ఈ–వేస్ట్‌లో ఎక్కువ భాగం అనియంత్రిత రంగంలో ఉన్న వారి చేతుల్లోకి పోతోంది. ఈ–వేస్ట్ లాభాలను కురిపించే రంగం కావడంతో శాస్త్రీయ రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్పై అవగాహన లేని స్క్రాప్ డీలర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వీరు ఈ–వేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టి అందులోని విలువైన లోహాలను సంగ్రహిస్తున్నారు. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాల్లో బంగారం, పల్లాడియం, రాగి, వెండి, అల్యూమినియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటితో పాటు మెర్క్యురీ, లెడ్, కాడ్మియం, బేరియం, లిథియం వంటి హానికారక భారలోహాలు, ఇతర రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయకపోవడంతో అవి భూమి పొరల్లోకే కాదు గాలి, నీటిలోకీ చేరుతున్నాయి. వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలోకి చేరి మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. దీంతో చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. ‘ఈ–వేస్ట్ పాలసీ’తో కొంత మెరుగు ఈ–వేస్ట్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ’ని రూపొందించింది. పాలసీ పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఈ– వేస్ట్ పాలసీకి అనుగుణంగా ప్రొడ్యూసర్లు పలు రీ సైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 9 రీ సైక్లింగ్ యూనిట్లు, 14 డిస్మాంట్లింగ్ యూనిట్లు, 35 మంది ఈ వేస్ట్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీటికి అవసరమైన ముడి సరుకు (ఈ–వేస్ట్) పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో అనేక రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు స్థాపించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ యూనిట్లు కేంద్రీకృతమై ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ రికవరీలో పేరొందిన ‘అటెరో ఇండియా’ తెలంగాణలో కొత్త యూనిట్ ఏర్పాటుకు గత ఏడాది అక్టోబర్‌లో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఈ యూనిట్‌తో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ∙కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్
ఎక్స్పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్‌గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్‌మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్‌ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్‌ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్‌ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్‌ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ! -
పాతటైర్లకు కొత్త రూపం.. ఐఐటీ విద్యార్థిని ఘనత
రోడ్ల మీద నడిచే ఎలాంటి వాహనాలకైనా టైర్లే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 60.80 లక్షల టైర్లు తయారవుతుంటే, ప్రతిరోజూ వాటిలో 42 లక్షలకు పైగా టైర్లు రిటైరవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తయారవుతున్న చెత్త పరిమాణం 212 కోట్ల టన్నులైతే, అందులో టైర్ల వాటా 3 కోట్ల టన్నులకు పైమాటే! టైర్లను రీసైకిల్ చేసే కర్మాగారాలు అక్కడక్కడా పనిచేస్తున్నాయి. కొందరు సృజనాత్మకమైన ఆలోచనలతో పాతబడిన టైర్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. టైర్ల రీసైక్లింగ్, రీయూజ్ వల్ల కొంతమేరకు కాలుష్యాన్ని నివారించగలుగుతున్నారు. పాతటైర్ల రీయూజ్‌కు పూజా రాయ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక మురికివాడ మీదుగా వెళుతుంటే కనిపించిన దృశ్యం ఆమెలోని సృజనను తట్టిలేపింది. మురికివాడలోని పిల్లలు పాత సైకిల్ టైర్లు, డ్రైనేజీ పైపులతో ఆడుకోవడం చూసిందామె. సమీపంలోని పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉన్నా, మురికివాడల పిల్లలకు అక్కడ ప్రవేశం లేకపోవడం గమనించి, వారికోసం తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రి తయారు చేయాలనుకుంది. అందుకోసం వాడిపడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రంచేసి, ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. ఐఐటీ అధ్యాపకులు ఆమె ఆలోచనను ప్రశంసించారు. ఆ ఉత్సాహంతోనే పూజా 2017లో ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని పలునగరాల్లో ఇప్పటివరకు 350 క్రీడా మైదానాలు తయారయ్యాయి. వీటిలోని ఆటవస్తువులన్నీ వాడేసిన టైర్లు, పైపులు, ఇనుపకడ్డీలతో తయారైనవే! పూజా రాయ్ కృషి ఫలితంగా వెలసిన ఈ క్రీడామైదానాలు పేదపిల్లలకు ఆటవిడుపు కేంద్రాలుగా ఉంటున్నాయి. -
మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా?
ఫొటోల్లో కనిపిస్తున్న భవంతిని చూడండి. ఇది పూర్తిగా మృణ్మయ భవనం. అంటే మట్టితో నిర్మించిన భవంతి. ఇదొక హోటల్. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మగళూరులో ఉంది. ఈ హోటల్ గదుల్లో ఏసీలు ఉండవు. ఇందులో ఇంకో విశేషమూ ఉంది. నిల్వచేసిన వాననీటినే అన్ని అవసరాలకూ ఉపయోగిస్తారు. చివరకు తాగడానికి కూడా ఆ నీరే విద్యుత్తు అవసరాల కోసం ఇందులో పూర్తిగా సౌరవిద్యుత్తునే వినియోగిస్తారు. పర్యావరణానికి ఏమాత్రం చేటుచేయని రీతిలో అధునాతనంగా రూపొందించిన ఈ హోటల్ రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ పద్ధతులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకుంటోంది. భారతదేశంలోని వాయుకాలుష్యంలో దాదాపు 30 శాతం భవన నిర్మాణాల కారణంగా సంభవిస్తున్నదే! నిర్మాణం కారణంగా కాలుష్యం వ్యాపించకుండా, పర్యావరణహితంగా ఉండేలా చిక్మగళూరులో ‘శూన్యత’ హోటల్ నిర్మాణం జరిగింది. ఈ హోటల్ ప్రాంగణం లోపలి నివాస గృహ సముదాయం కూడా పర్యావరణ అనుకూలమైనదే కావడం విశేషం. ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్‌ను రెండేళ్ల కిందట కొద్దిపాటి సిమెంటు, కాంక్రీటుతో తయారుచేసిన ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. విద్యుత్తు కోసం సౌరఫలకాలను అమర్చారు. నీటి సరఫరా కోసం వాననీటి సేకరణ వ్యవస్థను, ప్రాంగణాన్ని చల్లగా ఉంచేందుకు మట్టి సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ హోటల్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని చాలావరకు స్థానికంగానే సమకూర్చుకున్నారు. నిర్మాణ సమయంలో ఒక్క నీటిచుక్క కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా లోకేశ్ గుంజుగ్నూర్ అనే యువ పర్యావరణ ప్రేమికుడికి వచ్చిన ఆలోచన! ఈ హోటల్ యజమాని ఆయనే! కొ న్నేళ్ల కిందట లోకేశ్ తాను పుట్టిపెరిగిన చిక్మగళూరులో ఖాళీ భూమిని కొనుగోలు చేశారు. పట్టణం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ ఒక రిసార్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అదే ‘మడ్ హోటల్’గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. రిసార్ట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు లోకేశ్ తన హోటల్ ప్రత్యేకంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని భావించారు. నిర్మాణపరంగా కూడా పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలనే ఉపయోగించాలని అనుకున్నారు. భవిష్యత్తులో భవనాన్ని కూల్చేసినా, ఆ పదార్థాలు మళ్లీ భూమిలోనే కలిసిపోయేలా ఉండాలని భావించారు. అమెరికాలోని మయామీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన లోకేశ్‌కు ఇంత పచ్చని ఆలోచన రావడమే గొప్ప! ఆ ఆలోచనే ‘శూన్యత మడ్హోటల్’గా రూపుదాల్చింది. ఈ హోటల్ నిర్మాణం కోసం లోకేశ్ మొదట బెంగళూరులోని ‘డిజైన్ కచేరీ’ అనే ఆర్కిటెక్చర్ సంస్థను, పుదుచ్చేరి దగ్గరి ప్రకృతి ఆశ్రమం ‘ఆరోవిల్’లో శిక్షణ పొందిన పునీత్ అనే యువ సివిల్ ఇంజినీరును సంప్రదించారు. వారి సహకారంతో లోకేశ్ తన కలల కట్టడాన్ని సాకారం చేసుకోగలిగారు. హోటల్ నిర్మాణానికి రంగంలోకి దిగిన నిపుణుల బృందం మొదట ఇటుకల తయారీ ప్రారంభించింది. నేలను సమం చేయడానికి తొలగించిన మట్టితోనే ఇటుకలను తయారు చేశారు. చుట్టుపక్కల పదిహేను మైళ్ల వ్యాసార్ధంలోని ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి నిర్మాణానికి ఉపయోగించడంతో రవాణా ఖర్చులు, కాలుష్యం చాలావరకు తగ్గాయి. స్థానికంగా లభించే సున్నపు రాయిని, ఐదు శాతం కంటే తక్కువ మోతాదులో సిమెంటును కలిపి ఇటుకలను తయారు చేసుకున్నారు. ఈ పనులన్నీ నిర్మాణ స్థలంలోనే జరిగాయి. మిక్సింగ్ మెషిన్ నడిచేందుకు, ఇతర పరికరాలను నడిపేందుకు కావలసిన విద్యుత్తు కోసం అక్కడే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్మరశ్మి పుష్కలంగా ఉండే వేసవిలో ఈ పనులు జరిగాయి. నిర్మాణం ఎత్తు లేపడానికి, ఎత్తుకు తగినట్లుగా దన్నుగా అమర్చే ఉక్కు సామగ్రిని నివారించడానికి నిర్మాణ బృందం లోడ్‌బేరింగ్ నిర్మాణ పద్ధతిని అనుసరించింది. దీనివల్ల నిర్మాణం బరువు పైకప్పు నుంచి గోడలకు, పునాదులకు బదిలీ అవుతుంది. ఉక్కు ఉత్పాదన విస్తారంగా లేని కాలంలో పాత భవనాల నిర్మాణాల కోసం ఈ పద్ధతినే ఉపయోగించేవారు. ఇక సీలింగ్ కోసం కొబ్బరి చిప్పలు, పాట్ ఫిల్లర్లను ఎంచుకున్నారు. ఈ ఫిల్లర్లు పై అంతస్తుకు దృఢమైన ఫ్లోరింగ్‌గా పనిచేయడమే కాకుండా, గదులను కళాత్మకంగా, చల్లగా ఉంచుతాయి. ఇది హోటల్ కావడం వల్ల ఇక్కడకు వచ్చే అతిథులకు అన్నివిధాలా అనుకూలంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన అంశం. వేసవిలో చిక్‌మగళూరు వాతావరణం వెచ్చగా ఉంటుంది. పరిసరాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి గదులను చల్లగా ఉంచడానికి ఎయిర్‌కండిషన్ బదులు సహజ శీతలీకరణ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ విధానంలో భవనం కింద పది అడుగుల మేర పెద్ద పీవీసీ పైపును అమర్చారు. ఇది బయటి గాలికి శీతలీకరణ పైపుగా పనిచేస్తుంది. పైపుగుండా గాలి వెళుతున్నప్పుడు చల్లబడుతుంది. తర్వాత వివిధ మార్గాల ద్వారా ప్రాంగణంలోని పదకొండు గదుల్లోకి ప్రసరిస్తుంది. గదుల లోపల కూడా అక్కడి వెచ్చని గాలిని బయటకు పంపేందుకు పైకప్పులకు చిమ్నీలు ఉంటాయి. ఈ వ్యవస్థ కారణంగా బయటి వాతావరణం ఎలా ఉన్నా, గదుల్లోని ఉష్ణోగ్రత 18–25 డిగ్రీల మధ్యనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మంచినీటి కోసం వాననీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా 50వేల లీటర్ల ట్యాంకును నిర్మించుకున్నారు. దీని నిర్మాణం పైభాగంలో కాకుండా, భూగర్భంలో చేపట్టారు. ఈ నీటిని శుద్ధి చేసి, హోటల్‌కు వచ్చే అతిథులకు తాగునీరుగాను, ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు సరఫరా చేస్తున్నారు. వంటా వార్పులకు కూడా ఇదే నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ హోటల్లో ప్లాస్టిక్‌ను అసలు వాడరు. అతిథులకు స్టీల్ బాటిళ్లలోనే నీరు అందిస్తారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానంలో నిర్మించిన ఈ హోటల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ∙రాచకొండ శ్రీనివాస్ -
ప్లాస్టిక్ రహితానికి మేము సైతం..!
మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగమనేది విడదీయలేని భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడేవి కావడంతో వాటిపై పూర్తిగా ఆధారపడడం బాగా పెరిగిపోయింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వివిధ రూపాలు, రకాల్లో ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడంతో పలుచోట్ల కొత్త చిక్కులు మొదలయ్యాయి. దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగిస్తుండగా, కరోనా కాలంలో వీటి వినియోగం మరింతగా పెరిగింది. కోవిడ్ వ్యాప్తి భయాలు ప్రజల్లో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ కట్లరీ, కప్స్, కంటైనర్లు, లో–మైక్రాన్ కౌంట్ క్యారీ బ్యాగ్‌లు, గార్బేజ్ బ్యాగ్‌లు, మినరల్ వాటర్ బాటిళ్లు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న వస్తువుల ప్యాకేజింగ్ మెటీరియల్ వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటికే యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లు, వస్తువుల వినియోగంపై నిషేధం అమలుతో పాటు దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం లేదా ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్‌యూజ్ ప్లాస్టిక్స్ నియంత్రణకు కొంచెం నెమ్మదిగానైనా చర్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించుకునే దిశలో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే పద్ధతులు, విధానాల వ్యాప్తికి సామాజిక కార్యకర్తలు,సంస్థలు కృషిచేస్తున్నాయి. వారి అనుభవాలు, ప్లాస్టిక్ వినియోగం కట్టడికి వారు చేస్తున్న కృషి వివరాలు... ప్లాస్టిక్ నియంత్రణే ఆశయం మానసిక వికాసం సరిగా లేని ‘స్పెషల్ కిడ్స్’ కోసం హైదరాబాద్‌లోని మౌలాలిలో ఏర్పాటు చేసిన ‘ఆశయం’ స్కూల్ ద్వారా పర్యావరణ హితంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్నామ్నాయంగా కొన్ని పర్యావరణహిత వస్తువుల తయారీకి ‘ఆశయం’ సంస్థాపకురాలు లక్ష్మి కృషి చేస్తున్నారు. న్యూస్‌పేపర్, బ్రౌన్పేపర్ ఉపయోగించి పేపర్ బాగ్స్ తయారు చేస్తున్నారు. ఆయా సంస్థలు, వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లకు ప్రత్యామ్నాయంగా వివిధ సైజుల్లో బ్యాగులు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నారు. ఇక్కడి పిల్లలతోనే వీటిని తయారు చేయడం, బయటి నుంచి తీసుకొచ్చిన మట్టి దివ్వెలపై కలర్స్, పెయింటింగ్స్ వేయించడం, డెకరేట్ చేయించడం వంటివి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు బట్టల స్టోర్లు, ఫుట్‌వేర్ షాపులు, కూరగాయలు, కిరాణా దుకాణాల వారు వీరి నుంచి పేపర్ బ్యాగ్‌లు కొనుగోలు చేస్తూ తమ వంతు చేయూతను ఇస్తున్నారు. అలవాట్లలో మార్పులతోనే అరికట్టగలం రోజువారీ మన అలవాట్లలో చిన్న చిన్న మార్చులు చేసుకోగలిగితే తప్పకుండా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. గతం నుంచి మనది పర్యావరణహిత సమాజం. జీవనశైలిని మార్చుకుంటే చాలు గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చు. పాత రోజుల్లోలాగా బయటికి వెళ్లేపుడు చేతిసంచి వెంట తీసుకెళ్లడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. మేము నిర్వహించే చేనేత సంతల్లో పాత న్యూస్పేపర్లను రీసైకిల్ చేసి తయారు చేసిన పేపర్బ్యాగ్లనే వాడుతున్నాం. దాదాపు పదేళ్ల నుంచి టూత్‌పేస్ట్ మానేసి పళ్లపొడి ఉపయోగిస్తున్నాం. బయటికి వెళ్లేపుడు స్టీల్ వాటర్‌బాటిళ్లు తీసుకెళతాం. ప్లాస్టిక్ టూత్‌బ్రష్ బదులు ‘బాంబూ బ్రష్’ వాడుతున్నాము. ప్లాస్టిక్ నియంత్రణకు ప్యాకేజ్డ్ ఫుడ్ మానేయడం ఆరోగ్యానికి కూడా మంచిది. పెళ్ళిళ్లు ఫంక్షన్లు, ఒకసారి ఉపయోగించి పడవేసే వస్తువుల వినియోగానికి సంబంధించి అరటిబెరడుతో తయారు చేసిన ఆకుప్లేట్లు, విస్తరాకుల వాడకాన్ని అలవాటు చేయొచ్చు. – సరస్వతి కవుల, సామాజిక కార్యకర్త పర్యావరణహిత మార్గంలో... ఇంజనీరింగ్ పట్టభద్రుడైన స్వర్గం భరత్ కుమార్ మంచి ప్యాకేజీతో వచ్చిన ఐటీ, ఇతర ఉద్యోగాలను కాదనుకుని 2018 నుంచి ‘ఎకో మేట్’– డెస్టినేషన్ ఫర్ ఎసెన్షియల్ అల్టర్నేటివ్స్–డీల్– పేరిట ‘ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ బిజినెస్ స్టార్టప్’ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందసంస్థలో పనిచేసిన అనుభవంతో ప్లాస్టిక్స్ ప్రత్యామ్నాయాలపై విస్తృత అధ్యయనంతో పర్యావరణహిత వస్తువుల తయారీపై ఇష్టం పెంచుకున్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువులు, ప్రకృతి సహజమైన పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, సుస్థిర జీవనశైలి విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించారు. పేపర్‌తో, చెక్కతో తయారు చేసిన పెన్సిళ్లు, పెన్స్, స్టేషనరీ ఐటెమ్స్, బాంబూ టూత్‌బ్రష్‌లు, గిన్నెలు తోమేందుకు కొబ్బరి పీచు స్క్రబ్బర్లు , బాడీ స్క్రబ్బర్లు, గుళ్లల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసిన అగరువత్తులు, క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లు, ఆకుప్లేట్లు ఇలా ప్రతిదానికీ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇతరత్రా రూపాల్లో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెరుగుతోందని భరత్ చెబుతున్నారు. కార్పొరేట్, ఐటీ సెక్టర్ ఉద్యోగుల్లో కొంత అవగాహన ఏర్పడినా, మిగతా వర్గాల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని అంటున్నారు. వారి వారి సర్కిళ్లు, వాట్సాప్గ్రూప్ల ద్వారా ప్రచారంతో కొంతవరకు మార్పు వస్తోందని చెప్పారు. ఎకోఫ్రెండ్లీ లైఫ్‌స్టయిల్, సస్టయినబుల్ లివింగ్‌లో బెంగళూరు, పుణె నగరాలు దేశంలోనే ముందువరసలో ఉన్నాయన్నారు. ప్రకృతిసహజ వస్తువుల వ్యాప్తికి కృషి రోజువారీ ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వినియోగం తగ్గింపు విషయంలో ప్రజల్లో మార్పు చాలా నెమ్మదిగా వస్తోంది. ప్లాస్టిక్ రహితం చేయడం లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించడమనేది క్షేత్రస్థాయి నుంచే మొదలు కావాలి. గత రెండేళ్లలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా దీపావళి సందర్భంగా లక్ష దాకా మట్టిదివ్వెలను అమ్మగలిగాను. గణేష్‌చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను తయారు చేశాం. కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విద్యార్థులతో టూర్ల సందర్భంగా మార్పు కోసం ప్రయత్నించాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మేమే స్వయంగా స్వచ్ఛమైన దేశీ ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, భోగిదండలు, పిడకలు, నవధాన్యాలు, సేంద్రియ పసుపు, కుంకుమ, రంగోలీ రంగులు, సేంద్రియ నువ్వులు, బెల్లం లడ్డూలు వంటివి సరసమైన ధరలకే అందుబాటులోకి తెస్తున్నాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ప్లాస్టిక్, రసాయనాలతో కూడిన వస్తువులు ఉపయోగించకూడదని భావించాను. పళ్లు తోముకునే బ్రష్, పేస్ట్ స్థానంలో పళ్లపొడితో మొదలుపెట్టి సున్నిపిండి, ఇతర సహజ సేంద్రియ వస్తువులతో తయారుచేసిన సబ్బులు, పూజగదిలో రసాయనాలు లేని కుంకుమ, పసుపు, అగరవత్తులు వినియోగంలోకి తెచ్చాను. ఆర్గానిక్ పంటలు సొంతంగా పండించి వాటినే తింటున్నాం. గత ఐదేళ్లుగా గోరక్షకు ‘మురళీధర గోధామం గోశాల’ ఏర్పాటు చేసి ఆవులను కాపాడే ప్రయత్నంతో గో ఆధారిత వస్తువుల వినియోగం వ్యాప్తికి కృషి చేస్తున్నాం. – డా.సీహేచ్ పద్మ వనిత కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్, – కె.రాహుల్మురళీధర అనుసంథాన గో విజ్ఞానకేంద్రం -
ఆర్ఆర్ఆర్- రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. స్టార్టప్ వినూత్న ఆలోచన
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్‌లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి. పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్‌డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు. జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్... పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది. దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్లైన్లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్‌గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు. ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్‌ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. -కె.రాహుల్ చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం? -
ప్లాస్టిక్ కవర్లలో వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’! అలారం మోగుతోంది.. వినబడుతోందా?
ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు.. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? మార్కెట్‌కు వెళ్లి చికెన్ కొందామనుకున్నాం. కోడి కాస్తా చికెన్‌గా మారే ప్రక్రియలో 30% వేస్ట్‌గా మారుతుంది. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కోటికి పైగా జనాభా ఉండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో ఎన్ని టన్నుల చికెన్ వేస్టేజ్‌ను ఏం చేస్తున్నారు? వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో మనకు నీట్‌గా ప్లాస్టిక్ కవర్లలో చికెన్ ప్యాక్ చేసిస్తారు సరే, వేస్టేజ్ అంతా ఎక్కడికి పంపుతున్నారు? స్టేషన్ దగ్గర హోటల్ ఉంది. కర్రీ ప్యాకింగ్ కోసం వస్తున్నారు. అందరికీ వేడి కర్రీలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. అంతెందుకు గిన్నెలో మరిగే వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో కట్టిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కారదట. అది సరే, కవర్లలో అంత వేడి పదార్థాలను పోస్తుంటే దాన్నుంచి ఏమీ వెలువడవా? అందులోని పదార్థాలను తిన్నా, తాగినా ఏమీ కాదా? తెలిసిన వాళ్లలో బాగా ఉన్న వాళ్లొకరున్నారు. చాలాసార్లు పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను. ఆశ్చర్యం.. ఇల్లంతా ఏసీ. బాత్రూంలో కూడా చల్లదనమే. అడిగితే ఇదే మాకు అలవాటన్నారు. ఏడాదంతా వాళ్లు ఏసీలోనే ఉంటారు. ఎండ ఉన్నా, వేడి నీళ్లతోనే స్నానం మరో విషయం. ఎంత ఎండ ఉన్నా, వాళ్లు వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా వీళ్లు మారిపోయారా? చలికాలంలో వేడి నీళ్లు సరే, ఎండాకాలంలో కూడా చన్నీళ్లను భరించలేని స్థితికి మారిపోయారా? ప్రతిరోజూ సీల్ విప్పిన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను మాత్రమే ఎందుకు తాగుతారు? స్టేటస్ సింబల్ సరే, ఇలాంటి వాళ్లు చేసే పని వల్ల పుడమిపై ఎంత భారం పడుతుంది? కడుపులో కుక్కేయాలా? మా ఊరి నుంచి పెద్దాయన కబురు పెట్టాడు. సిటీలోనే ఆయన కూతురు పెళ్లి. తప్పదు కాబట్టి వెళ్లాం. పేద్ద కన్వెన్షన్ హాల్. వేలల్లో అతిథులు ఉంటారు. భోజనాల దగ్గర జాతరలా ఉంది. తిన్నా, తినకపోయినా ప్లేట్ల నిండా అక్కరకు మించి మాంసం ముక్కలు వేసేసుకుంటున్నారు. అందులో సగం కూడా తినట్లేదు. అడ్డంగా పారేస్తున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ పారేస్తున్నారు. ఇలా చెత్తబుట్టల్లో వేసిన విలువైన ఆహారం సంగతేంటీ? భూమిలో వేస్తారా? లేక ఇంకేమైనా చేస్తారా? మనది కాదు కాబట్టి.. మళ్లీ మళ్లీ దొరకదు కాబట్టి కడుపులో కుక్కేయాలా? మిగిలిపోతోంది చిన్న కుటుంబం. సగటు జీవితం. అయినా తేడా కొడుతోంది. నిజానికి మంచి శాలరీనే వస్తోంది. అయినా సరిపోవట్లేదు, పైగా అప్పులు. నలుగురి కోసం లెక్క వేసుకుంటున్నాం కానీ.. భోజనం పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు తినాల్సినంత మిగిలిపోతోంది. తెల్లవారికల్లా చద్దన్నం. ఆకలి తగ్గిందా? లేదు లేదు మరింత పెరిగింది. అందుకే ఆర్డర్ల మీద ఆర్డర్లు. యాప్ నొక్కగానే వస్తున్నాయి. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి జంక్‌ఫుడ్ కమ్మగా ఉంటే ఇంట్లో వండింది ఎందుకు తింటాం? ఎందుకు బయటి తిండే రుచికరంగా అనిపిస్తోంది? అవును.. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి. తెలియకుండానే దుస్తులు టైట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు వంద. మనిషి ఆలోచనల్లో ఎక్కడో తేడా కొడుతుంది. బతికే పద్ధతి పక్కదారి పడుతోంది. నేను బతకాలి నుంచి నేనే బతకాలి అన్నంత వరకు వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి దొరికినంత తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్న ఒక్క జీవితం అనుభవించడానికేనా? దొరికిందంతా మనమే అనుభవిస్తే.. వచ్చే తరానికి మిగిలేదేంటీ? అప్పటి నుంచి విప్లవం మన సైన్స్ లెక్కల ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల కింద పుట్టింది. సకల ప్రాణుల్లో ఒకరిగా మనిషి అనే రూపం కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపం– అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, 2 లక్షల ఏళ్ల కింద అవతరించింది. 6 వేల ఏళ్ల నుంచి నాగరికత మొదలయింది. ఎప్పుడయితే మనిషి నిప్పును కనుగొన్నాడో అప్పటి నుంచి విప్లవం వచ్చింది. 200 ఏళ్ల కింద పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ వచ్చింది. అంటే 450 కోట్ల పుడమిని అంతకు ముందెన్నడూ లేని రీతిలో 200 ఏళ్లలో మనిషి దెబ్బతీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ధాటికి సర్వం కాలుష్యం. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది.. ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వస్తువులను పుడమి నుంచి తయారు చేసుకుని వాటిని వ్యర్థాలుగా మార్చి మళ్లీ భూమిలో కలిపేస్తున్నారు. ఇంకెన్నాళ్లో ఉండదు ఒక్క భూమి మాత్రమేనా? ఇప్పటికే సముద్రాలన్నింటిలో చెత్త, రసాయనాలు నింపేసి విషపూరితంగా మార్చేస్తున్నాడు. పైగా అహంకారం ఒకటి. ఇంకొకడు వాడింది నేను ముట్టుకోనంతే అంటాడు. ఏంటో మరి. నాకన్నీ కొత్తవి, బ్రాండ్ న్యూ వస్తువులు కావాలంటున్నారు. ఇలా ఎవరికి వాళ్లు నచ్చినవన్నీ వాడేసుకుంటూ పోతే.. వ్యర్థాలన్నీ నింపుకుంటూ వెళ్తే.. ఈ భూమి ఇంకెన్నాళ్లో ఉండదు. అందుకే రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ చేయాలి? చెత్త కుప్పలు కాదు కొండలు లేని దేశంగా, పుడమిగా మారాలి. పర్యావరణాన్ని తద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవ్వాళ మీరు తీసుకునే జాగ్రత్తలు, వేసే చిన్న చిన్న అడుగులే అందమైన భవిష్యత్తుకు దారిస్తాయి, పుడమిని కాపాడతాయి. -శ్రీనాథ్ గొల్లపల్లి చదవండి: Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే? -
ప్లాస్టిక్ నిజాలు
ప్రపంచంలో తొలిసారిగా 1907లో ప్లాస్టిక్‌ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే, భారీ స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి 1952 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పర్యావరణానికి బెడదగా మారింది. ఇటీవలి కాలంలో ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 80 లక్షల టన్నులు. ఇవే పరిస్థితులు కొనసాగితే, 2040 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు 2.90 కోట్ల టన్నులకు చేరుకోగలవని శాస్త్రవేత్తల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. 1952 నాటితో పోల్చుకుంటే, ప్లాస్టిక్ వినియోగం రెండువందల రెట్లు పెరిగింది. సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తిదారు. అమెరికా ఏటా 4,2 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తోంది. చైనా, యూరోపియన్ దేశాల్లో ఏటా జరిగే ప్లాస్టిక్ ఉత్పత్తి కంటే, అమెరికా చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువవ. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోలు. ప్లాస్టిక్ నేలలోను, నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పోగుపడి కాలుష్యానికి కారణమవుతోంది. ప్లాస్టిక్ నేరుగా మన పొట్టల్లోకే చేరేటంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి మనిషి పొట్టలోకి వారానికి సగటున ఐదు గ్రాముల ప్లాస్టిక్ చేరుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్ ఎక్స్పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్‌గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్‌మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్‌ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్‌ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్‌ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్‌ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ! -
ప్లాస్టిక్ భవంతి
ప్లాస్టిక్ చెత్త ప్రపంచవ్యాప్త సమస్య. పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తలో రీసైక్లింగ్ జరుగుతున్నది చాలా తక్కువే! రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించు కుంటున్న సందర్భాలు మరింత అరుదు.రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించుకున్న తీరుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనమే ఉదాహరణ. ఇది తైవాన్ రాజధాని తైపీ నగరంలో ఉంది. ‘ఎకో ఆర్క్’ పేరిట నిర్మించిన ఈ భవంతి ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేపట్టడం విశేషం. ఏకంగా పదిహేను లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ నిర్మాణం చేపట్టారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను నేరుగా వాడకుండా, వాటిని కరిగించి, మళ్లీ బాటిల్స్‌గా తయారు చేసి ముందుభాగం నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని ఒకేరకమైన ఆకృతిలో, ఒకే పరిమాణంలో తయారు చేశారు. దీనివల్ల వీటిని సులువుగా ఉక్కుఫ్రేమ్లో ఒకదానినొకటి జోడించి, చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి, పటిష్ఠంగా భవంతిని నిర్మించారు. భవనంలోని మిగిలిన భాగాలను రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించారు.ఈ భవంతికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో రాత్రివేళ వెలిగే 40వేల ఎల్ఈడీ బల్బులకు కావలసిన మొత్తం విద్యుత్తును సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగటివేళలో వెలుతురు కోసం విద్యుత్ బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాబట్టి దీనివల్ల వాతావరణంలోని కర్బన ఉద్గారాల సమస్య కూడా పెద్దగా ఉండదు.కాంక్రీట్ భవంతితో పోల్చుకుంటే, దీని బరువు సగాని కంటే తక్కువగానే ఉంటుంది. అలాగని దీని దారుఢ్యాన్నేమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటారా? తుపానులు చెలరేగినప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులనైనా ఈ భవంతి ఇట్టే తట్టుకోగలదు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం, నిప్పు తగులుకోకుండా దీనికి ప్రత్యేకమైన రసాయన కోటింగ్ కూడా పూశారు. కాబట్టి, తుపానులు, అగ్నిప్రమాదాల వల్ల ఈ భవంతికి వచ్చే ముప్పేమీ ఉండదు.తైపీలో ఏడేళ్ల కిందట జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన కోసం అర్థర్ హువాంగ్ అనే డిజైనర్ ఈ భవంతిని ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. తైవాన్‌లో ఏటా చెత్తలోకి చేరుకుంటున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతో, పట్టుదలతో ఈ భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణం కోసం 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చయింది. ఇస్మాయిల్ -
15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
ప్లాస్టిక్‌తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయ్‌లాండ్‌లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్‌హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే! ‘మిలియన్ బాటిల్ టెంపుల్’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఎందుకు నిర్మించారంటే..? పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్‌లాండ్ బీచ్‌లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్ బీచ్‌లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. - దినేష్ రెడ్డి -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్‌ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్‌ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్‌లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్‌బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్‌లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్‌వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్‌లు మొదలుకొని, ఎయిర్‌పాడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్‌లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్‌పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్‌లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్‌ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్‌డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్‌ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్‌ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్‌ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్‌వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్‌ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్‌కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్‌కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
వెలుగుదారులు.. అసామాన్యులు
సోలార్ పవర్.. సౌరశక్తి. ఎంత కావాలంటే అంత. పూర్తిగా ఉచితం. చిన్న పెట్టుబడితో పర్యావరణానికి మేలు చేసే ఎంతో శక్తిని ఉచితంగా పొందవచ్చు. దీనికంతటికీ మూలం సౌర వ్యవస్థ. సూర్యుడి బాహ్య వాతావరణ పొరలో 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంది. అంటే భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటా వాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. ఇలా ప్రకృతి ఉచితంగా అందించే సౌర శక్తిని ఫొటో వోల్టాయిక్ ఘటాల ద్వారా విద్యుత్తుగా మార్చుతారు. చాలా కాలం క్రితమే సోలార్ విద్యుత్‌ను గుర్తించినా.. అమల్లో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. సులభంగా దొరుకుతుంది కదా.. అని బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడ్డాం. హైడ్రో పవర్ అంటే జలవిద్యుత్ ఉన్నా.. దానిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. అందుకే సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టింది లోకం. అందుకే ఇప్పుడు కొత్త నినాదం ఊపందుకుంది. ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే గ్రిడ్. అంటే వీలైనంత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని దేశాల విద్యుత్ వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే.. పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతాం. ఎండకాసే దేశాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్.. చీకట్లు నిండిన చోట వెలుగులు నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఇండియా డాటా పోర్టల్ ప్రకారం గత ఏడున్నరేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 2.6 గిగా వాట్ల నుంచి 46 గిగావాట్ల సామర్థ్యం స్థాయికి చేరింది. ఇక పవన విద్యుత్ ఉత్పత్తి 5.5 గిగా వాట్లకు చేరింది. ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ఏకంగా 26 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. రైతుల సాగు కోసం వినియోగించే సోలార్ పంప్‌లు 20 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లలో మూడు మన దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ప్లాంట్, మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో భాడ్లా అనే గ్రామంలో నిర్మించిన ప్లాంట్. దీన్ని 2,700 మెగావాట్ల సామర్థ్యంతో 14 వేల ఎకరాలలో నిర్మించారు. ఇక కర్ణాటకలో 13 వేల ఎకరాలలో 2,050 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలోని అనంతపురం జిల్లా నంబులపులకుంటలోనూ భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇటీవల స్మార్ట్ సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి రావడంతో తిరుపతి కార్పొరేషన్ కు భారీగా బిల్లు తగ్గింది. ఏకంగా రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండడంతో మరిన్ని సోలార్ ప్లాంట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సూర్యశక్తిని ఒడిసి పట్టుకుంటున్నది ప్రభుత్వాలే కాదు.. సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రిన్స్ విలియం ఈ ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితాలో మన దేశానికి చెందిన వాళ్లు ఇద్దరున్నారు. అందులో ఒకరు తిరువణ్ణామళైలోని 9వ తరగతి విద్యార్థిని వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి. ఈ రెండింటి కలబోతగానే సోలార్ ఐరన్ కార్ట్‌ను తయారు చేసిందీ టాలెంటెడ్ గర్ల్. ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఇంటి దగ్గర ఇస్త్రీ బండి వ్యాపారిని చూసింది వినీష. బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పద్ధతిని గమనించింది. ఇంటికొచ్చాక బొగ్గు మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్లో వెతికింది. బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరకాలి. కట్టెలను కాల్చాలి. ఆ పొగతోపాటు కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాక.. వినీషలో కొత్త ఆలోచన మొదలయింది. ఆ తపన నుంచి వచ్చిన ఆవిష్కరణే ‘సోలార్ ఐరన్ కార్ట్’. ఈ మొబైల్ ఇస్త్రీ బండి సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకుని పని చేస్తుంది. ఈ ప్రయత్నానికి ఎర్త్ షాట్ ప్రైజ్ దిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 750 ఎంట్రీల్లో తుది అంచెకు చేరుకున్న 15లో మరొకటి ఢిల్లీకి చెందిన ‘విద్యుత్ మోహన్’ ప్రాజెక్టు. విద్యుత్ మోహన్ .. గత కొన్నాళ్లుగా దేశ రాజధాని ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని గమనిస్తున్నాడు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఓ వైపు ఉత్తరాది పొలాల్లోని మంటల నుంచి వచ్చే పొగ.. దానికి ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. అన్నీ కలగలసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. టకా అంటే డబ్బు, చార్ అంటే బొగ్గు లేదా కార్బన్ .. కాలుష్యం నుంచి డబ్బు అన్న కాన్సెప్ట్‌లో టకాచార్ అనే ఓ సంస్థను ప్రారంభించాడు మోహన్ . దీని ప్రధాన ఉద్దేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టును నడుపుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తయ్యే చెత్త, చెదారం, పంట కోసిన తర్వాత ఉండే మొదళ్లు, ఇతర వ్యర్థాలను సాధారణంగా చాలా మంది రైతులు తగులబెడతారు. అలా తగులబెట్టే బదులు ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ ఓ యంత్రంలో వేయడం ద్వారా బయోచార్గా మారుతాయి. బయోచార్ను భూసారాన్ని పెంచే ఎరువుగా రైతులు తిరిగి వాడుకోవచ్చు. తద్వారా పంట వ్యర్థాలు మళ్లీ భూమిలోకి చేరడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. (క్లిక్: రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?) ముంబైకి చెందిన మధురిత గుప్తాది మరో విజయగాథ. ముంబైలో వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తా ఓ వైల్డ్ లైఫ్ సంస్థలో వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌ను తగులబెట్టడం లేదా భూమిలో పారేయడాన్ని గమనించారు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించాలన్న ఆలోచన కలిగింది. శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతోంది. ఐఐటీలో చదివి ఇంజినీర్‌గా పని చేస్తోన్న తన తమ్ముడు రూపన్ తో కలిసి సోలార్ లజ్జా అనే యంత్రాన్ని రూపొందించారు మధురిత. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్‌ను ఈ మెషీన్ లో వేయడం వల్ల క్షణాల్లో వాటిని బూడిదగా మార్చవచ్చు. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్ . సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్ పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్ ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపోన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. ప్రకృతికి మంచి చేసే మెషిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్ లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ లో ‘ఇన్ స్ప్రెన్యూర్ 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ విమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హరియాణా, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చారు. ఇప్పుడు జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. (క్లిక్: ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!) గుజరాత్ వడోదర జిల్లాకు చెందిన నీల్ షా వయస్సులో చిన్నోడయినా.. సమాజానికి పెద్ద పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు. ఇంటర్ చదువుతున్న నీల్‌ది ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. అయితే మాత్రం ఆవిష్కరణలపై ఆసక్తి తగ్గించుకోలేదు నీల్‌షా. ఓ సారి స్కూల్లో ప్రాజెక్ట్ కింద అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా సోలార్ సైకిల్ రూపొందించాడు. రూ. 300లతో పాత సైకిల్ కొనుగోలు చేసిన నీల్‌షా.. దానికి రెండు సోలార్ ప్యానెళ్లను అమర్చాడు. ఒక సారి చార్జింగ్ చేస్తే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ సైకిల్. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ సైకిల్.. పల్లెల్లో పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరం. తమిళనాడులోని మధురైకి చెందిన ధనుష్ కూడా ఇలాంటి సైకిల్‌నే తయారు చేశాడు, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదివిన ధనుష్.. తాను తయారు చేసిన సైకిల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చూపించాడు. కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రుపాయి కన్నా తక్కువే. కేరళ పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. రోడ్లపై గంటల కొద్దీ నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు సోలార్ గొడుగులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గొడుగు రెండు రకాలుగా పని చేస్తుంది. మండుటెండల్లో డ్యూటీ చేసే పోలీసులకు నీడ ఇస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేలా అందులోనే ఫ్యాన్ ఉంటుంది. అంటే గొడుగుపైన సోలార్ ప్యానెల్, గొడుగు కింద బ్యాటరీ. ఇదే టెంట్లో కింద లైటింగ్ సౌకర్యం కూడా ఉంది. రాత్రి పూట కూడా పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. ఎర్నాకుళం జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్టును మరిన్ని జిల్లాలకు విస్తరించారు కేరళ పోలీసులు. (క్లిక్: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!) ఇప్పుడంటే ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అయిదేళ్ల కిందటే సోలార్ కార్‌ను తయారు చేశారు కర్ణాటకలోకి మణిపాల్ యూనివర్సిటీ విద్యార్థులు. పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ప్రోటో టైప్ సోలార్ ఎలక్ట్రిక్ కార్‌ను రూపొందించారు. సోలార్ మొబిల్ పేరిట రూపొందించిన ఈ కారుకు టాటా పవర్ తమ వంతుగా సహకారం అందించింది. అనుదీప్ రెడ్డి, జీత్ బెనర్జీ, వరుణ్ గుప్తా, శివభూషణ్ రెడ్డి, సులేఖ్ శర్మలు కలిసి రూపొందించిన ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి చార్జింగ్ పూర్తయితే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో చార్జింగ్ చేసుకోగలదు. సూర్యరశ్మితో నడిచే కార్లను అభివృద్ధి చేసేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు ఈ పోటీ జరుగుతుంది. (చదవండి: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?) ఇవే కాదు.. సౌరశక్తితో మరెన్నో వినూత్న ఆవిష్కరణలు మన చుట్టున్నవాళ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో మనకెన్నో పర్యావరణ అనుకూల పరిష్కారాలు చూపించనున్నారు. - శ్రీనాథ్ గొల్లపల్లి సీనియర్ అవుట్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ g.srinath@sakshi.com -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"