ప్రకృతికి మించిన గురువు లేరు.. పిల్లల్లో అలాంటి సమస్యకు కారణమదే! | Pudami Sakshiga: The Influence Of Nature On Child Development | Sakshi
Sakshi News home page

Pudami Sakshiga: ప్రకృతికి మించిన గురువు లేరు.. పిల్లల్లో అలాంటి సమస్యకు కారణమదే!

Published Tue, Sep 26 2023 10:39 AM | Last Updated on Tue, Sep 26 2023 12:54 PM

Pudami Sakshiga: The Influence Of Nature On Child Development

ప్రకృతి,వన్యప్రాణుల జీవనంపై చిన్ననాటి గుర్తులు ఏమైనా గుర్తు ఉన్నాయా? నేను పట్టణవాసిని అయినా ఒక కొండముచ్చు మా ఇంట్లోకి జొరబడి హడావుడి చేయటం, ఇంటి బాల్కని నుంచి చూసిన లకుముకి,గిజిగాడు పిట్టలు, రాత్రిపూట మిణుగురు పురుగులు పట్టుకొని అవి మెరుస్తుంటే చూసి ఆనందించిన క్షణాలు నాకింకా గుర్తు ఉన్నాయి. పిల్లలకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం,ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంటాయి. కానీ పట్టణవాసంవల్ల ప్రకృతితో అనుబంధం అనుకున్నంత  ఉండటం లేదు. తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే, ప్రకృతితో పిల్లల అనుబంధం మరింత బలపడి వారి భౌతిక, మానసిక వికాసానికి దోహదకారి అవుతుంది. ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం పిల్లల సర్వతోభివృద్దికి ఎంతో అవసరమని ఎన్నో అధ్వయనాలు చెపుతున్నాయి.

అవి వారి ఏకాగ్రత, పరిసీలనాశక్తిని, ప్రావీణ్యతసి, మానసికాభివృద్దికి తోడ్పడుతుంది అని అందరికి తెలిసిన విషయమే. కాని,పట్టణవాసం వల్ల ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం తగినంత లేకపోవటంతో మనలో చాలామంది Nature deficit Disorder తో బాధపడటం ఉండటం గమనార్హం. దీంతో చాలామంది పిల్లల్లో స్థూలకాయం, ఎకాగ్రతాలోపం, నిరాశ వంటి సమస్యలు తలెత్తడం గమనిస్తున్నాము.  అయితే ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతితో మమేకమవటం ఎలా? ప్రకృతిలో ఒక భాగమయిన పక్షులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు కేవలం గ్రామాలు, అడవుల్లోనే ఉంటాయి అనుకోవటం పొరపాటు.ఇవి అన్నిచోట్లా మన పరిసరాలలో కనిపిస్తూనే ఉంటాయి.పిల్లలను తరచుగా మన దగ్గరలో ఉన్న పార్కులు, చెరువులు,స్కూల్ ఆటస్తలలో కనపడే పక్షులను, కీటకాలను మరియు ఇతర జంతువులను పరిసీలించటం నేర్పితే వారికి బయటకు వెళ్ళాలనే ఉత్స్యాహం కలిగించిన వారవుతారు.

పక్షులు ప్రకృతిలోని ఒక ప్రధాన భాగస్వాములు. భూమిఫై మన మనుగడకు విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. అది పిల్లలలోని పరిశీలనాశక్తిని, ఊహాశక్తిని మేల్కొలిపి నూతన ఉత్శాహం కలిగిస్తాయి.పక్షులు తమ ఆహ్లదమయిన రంగులతో, ప్రత్యేకమయిన కూతలతో మన పరిశీలనాశక్తిని పెంపొందిస్తాయి. చాలా వలస పక్షులు వింత వింత విన్యాసాలతో అబ్బురపరచే క్రమశిక్షణతో గుంపులు గుంపులుగా వలస పోవటం గమనిస్తే రోజువారీ జీవితంలోని అలవాట్లు, అరుపులు గమనిస్తే మనకు ఎంతో ప్రేరణ, ఆనందం కలుగుతాయి.ప్రకృతిలో భాగమయిన పక్షులను వీక్షించి ఆనందించటం ప్రకృతితో మమేకం అవటానికి మీ జీవితాంతం దొరికే అపూర్వ అవకాశం. మీ పిల్లలు, విధ్యార్ధులకు ప్రకృతితో పరిచయయంకల్పించటానికి పక్షులను వీక్షించే కార్యక్రమంతోప్రారంభిచటం శ్రేయస్కరం. దీనికి మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదని అనుకోవద్దు.

పక్షి శాస్త్రం గురించి విశేష పరిజ్ఞానం లేకపోయినా సరైన సహనం, ఆసక్తితో మీరు చూసిన పక్షులు,వాటి భౌతిక లక్షణాలు, ప్రత్యేకమయిన కూతల గురించిన సమాచారం విధ్యార్ధులతో పంచుకోవటంలో ఉండే ఆనందం, అనుభవం ఎంతో వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తాయి. రేపు లేదనే ఆలోచనతో జీవించు, కలకాలం ఉంటాననే భావంతో విజ్ఞానాన్ని సంపాదించు అని మహాత్మా గాంధీ ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఎన్నో కొత్త ప్రయోగాలకు నాంది పలికాడు. పక్షుల గురించి ఆయనకు ఉన్న ఆసక్తితో విద్యార్థుల కోసం ird Bingo అనే ఒక వినూత్న కార్యక్రమం రూపొందించటానికి దోహదం చేసింది. దీనికి నలుగురు విద్యార్దులను ఒక జట్టుగా ఏర్పరచి, వారికి ఒక బింగో షీట్, పెన్సిల్, పుస్తకం ఇచ్చి స్కూల్ ఆవరణలో వారు చూసిన విశేషాలను అన్నిటిని రాయమని చెప్పి తర్వాత వాళ్లను క్లాస్‌రూమ్‌లో సమావేశపరిచి వాళ్లు సేకరించిన సమాచారం ఇతర విద్యార్థులకు వివరించడం జరగుఉతుంది. తగిన తగిన బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది.

ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రకృతిని పక్షులను గుర్తించటమే కాకుండా విద్యార్దుల పరిశీలనాశక్తిని , సమాచారాన్ని రాతపూర్వకంగా పదిలపరిచే నిపుణత, తమ చుట్టూ ఉన్న పకృతి విశేషాలను నిశితంగా పరిశీలించే అవకాశం తప్పకుండా కలుగుతుందని భావిస్తాము.  ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్దులలో ప్రకృతిపట్ల అనురక్తిని కలిగించే విలువైన సాధనాలుగా భావించి ఎన్నో వినూత్న కార్యక్రమాలు Indian wild life society ద్వారా విద్యార్దుల ప్రయోజనంకోసం రూపొందించటం జరిగింది. ఈ క్రమంలో నదేశంలో సాధారణంగా కనిపించే పక్షుల గురించి రూపొందించిన ఒక ఫ్లాష్ కార్డు ఆట అయితే “ Shell Shoker” తాబేళ్ల గురించి ఆడే కార్డు ఆట మరియు Snake-O-Doo పాములు,నిచ్చనలు ఉండే పరమపదసోపాన పటం/ వైకుంఠ పాళీ ఆట. ఇవన్నీ మనకు online లో దొరుకుతాయి. మరికొన్ని ఆటలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా డైన్‌లోడ్‌ ఉచితంగా చేసుకోవచ్చు.

వివిధ కళాత్మక,సృజనాత్మక కార్యకలాపాలద్వారా పిల్లలలో ఎంతో సంతులనాత్మక అభివృద్దిని సాధించగలం. వివిధ కళాత్మక కార్యకలాపాలద్వారా పిల్లల పరిశీలన దృష్టిని గమనించి వారిని సంబంధిత పాత్రికెయులుగా, వివిధ కళాత్మక ప్రయోగాలు చేయగలిగేవారిగా తయారు చేయగలం. మన దేశంలో సాధారణంగా కనిపించే పక్షుల బాహ్యలక్షణాలు, వాటి చరిత్ర గురించి వేరు వేరు సంసృతులలో ప్రస్తావించిన విశేషాలఫై అవగాహన కలిగి ఉండటం వల్ల పక్షల గురించి కోత్తవారికి ఆసక్తికరంగా మరింత ఉత్సుకత కలిగే విధంగా వివరించే అవకాశం కలిగి ఉండి వారిలో ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించిన వారవుతారు. కాకి వంటి సాధారణ పక్షి తెలివితేటల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు  పిల్లలకు పంచతంత్ర కధలలోని ‘ నీటి కుండలోని నీరు గులకరాళ్ళువేసి పయికితెచ్చి దాహం తీర్చుకున్న తెలివయిన కాకి” కధ చెప్పి వారిని ఆనందింపచేయవచ్చు.మీ పరిసరాలలో కనపడే సాధారణ పక్షుల గురించిన సమాచారం ఎన్నో మాధ్యమాల ద్వారా పొందగలరు.

ఇందులో ప్రముఖంగా మెర్లిన్అనే అప్ ద్వారా మీ పరిసరాలలో ఉన్న పక్షుల గురించిన సమాచారం పొందవచ్చు. Early bird అనే App నుంచి వివిధ రకాల పక్షుల ఫోటోలు తీసి వాటి లక్షణాలను, కూతలను కూడా వినే అవకాశం ఉంది. ఈ యాప్స్‌ అన్ని భారతీయ బాషలలో అందుబాటులో ఉంది. పిల్లలకు ప్రకృతితో అనుబంధం కల్పించడం చాలా అవసరం. పర్యావరణ అనిస్టితి కారణంగా పిల్లలలో ప్రకృతి పట్ల మరింత అవగాహన కల్పించటం వలన వారిలో మరింత ఆసక్తి, ప్రకృతి పట్ల స్నేహభావం,కలిగించి భూ వాతావరణంపట్ల మరింత జాగరూకతతో తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో శ్రీ డేవిడ్ సోరెల్ అన్నట్లు.. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు, బముముఖ సాధికారత పొందడానికి మొదట ఈ భూమిని ప్రేమించేలా చేయడం, తర్వాత దాని సంరక్షణ కోసం చర్యలు తీసుకునేలా చేసి ప్రకృతిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. 

Author - గరిమా భాటియా
ఫోటోలు: సౌమిత్రా దేశ్‌ముఖ్‌

తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement