ఖమ్మంవరద బాధితులకు నిజామాబాద్ జిల్లా యువకుల బాసట
77 కుటుంబాలకు సీలింగ్ ఫ్యాన్ల అందజేత
వైద్య విద్యార్థినికి ట్యాబ్, నగదు
ఖమ్మం మయూరిసెంటర్: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కె) గ్రామ యువకులను కది లించింది.
దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు.
వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా...
ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్ రూ.5 వేలు అందజేశారు. తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు.
సాక్షిలో చూసి చలించిపోయాను
రాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం.
– అర్గుల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment