సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం, మున్నేరు వద్ద నీటిమట్టం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి హెచ్చరికలు జారీచేశారు. 24 అడుగులు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. మరో 24 గంటల పాటు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు ఖాళీ చేసి పునరావస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు, వర్షాలతో ప్రకాష్ నగర్ బ్రిడ్జి డ్యామేజ్ అవ్వడంతో పూర్తిగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు..రోడ్డు మధ్యలో గోడ నిర్మించారు. మరమ్మత్తులు పూర్తయ్యేంతవరకు రాకపోకలు స్తంభించనున్నాయి. ఖమ్మం- కోదాడ , విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మున్నేరు ముప్పు.. గ్రామాలకు అలెర్ట్
మున్నేరులో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు.. వరద ప్రభావిత గ్రామాలైన కంచల, ఐతవరం, దామూలూరుతో పాటు పలు గ్రామాల ప్రజలను అలెర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు 65,000 క్యూసెక్కుల వరద చేరింది. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నీరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment