ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారానికి నీతి ఆయోగ్‌ చెక్‌ | NITI Aayog check for misinformation on Land Titling Act | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారానికి నీతి ఆయోగ్‌ చెక్‌

Published Fri, May 17 2024 5:15 AM | Last Updated on Fri, May 17 2024 7:45 AM

NITI Aayog check for misinformation on Land Titling Act

ఈ చట్టంతోనే భూ యాజమాన్య నిర్వహణ పటిష్ఠమని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: పచ్చమీడియా విషప్రచారాన్ని అండగా చేసుకుని చెలరేగిపోయి, రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించాలని చూసిన చంద్రబాబు నాయు­డికి  దిమ్మదిరిగే షాక్‌ నీతి ఆయోగ్‌ రూపంలో తగిలింది. ఎన్నికల ప్రచారంలో దూషణలు, పనికిమాలిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించాలని చూసిన ఈ పచ్చపార్టీ అధినేతకు ఇది శరాఘాతమే.. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై  ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు గణం చేసిన దుష్ప్రచారానికి నీతి ఆయోగ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈ చట్టానికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని... భూ పరిపాలన మరింత సులువవుతుందని పేర్కొంది. భూములపై రైతులకు సర్వహక్కులూ లభిస్తాయని... ఈ చట్టంతో పటిష్ఠమైన భూ యాజమాన్య నిర్వహ­ణ సాధ్యమవుతుందని  వెల్లడించింది.

సమాచార హక్కు చట్టం కింద  సాక్షి టీవీ డిప్యూటీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ నాగిళ్ల వెంకటేష్‌ అడిగిన ప్రశ్నలకు నీతి ఆయో­గ్‌లోని జల, భూవనరుల శాఖ ఈ విషయమై స్పష్టతను ఇచ్చింది. ఆ శాఖ అండర్‌ సెక్రటరీ రవీందర్‌ కౌర్‌ గురువారం ఒక లేఖ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు సంబంధించిన ముసాయిదాను కేంద్ర భూవనరుల శాఖతో పా­టు అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పంపించామని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement