బ్రాండ్‌ గార్డియన్‌షిప్‌ ఇండెక్స్‌..ముకేశ్‌ అంబానీ టాప్‌ | Mukesh Ambani tops Brand Guardianship Index 2024 | Sakshi
Sakshi News home page

బ్రాండ్‌ గార్డియన్‌షిప్‌ ఇండెక్స్‌..ముకేశ్‌ అంబానీ టాప్‌

Published Mon, Feb 5 2024 1:02 AM | Last Updated on Mon, Feb 5 2024 1:02 AM

Mukesh Ambani tops Brand Guardianship Index 2024 - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీకి బ్రాండ్‌ గార్డియన్‌షిప్‌ ఇండెక్స్‌లో వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్రాండ్‌ గార్డియన్‌షిప్‌ ఇండెక్స్‌ 2024 వివరాలు విడుదలయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, యాపిల్‌ టిమ్‌ కుక్, టెస్లా ఎలాన్‌ మస్‌్కను ముకేశ్‌ అంబానీ వెనక్కి నెట్టేశారు. టెన్సెంట్‌ హూతెంగ్‌మా తర్వాతి స్థానంలో ఉన్నారు.

ఇదే సూచీలో టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖర్‌ గతేడాది ఉన్న 8వ స్థానం నుంచి ఈ ఏడాది 5వ స్థానంలోకి వచ్చేశారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ సీఈవో అనీష్‌ షా 6వ స్థానం, ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ 16వ స్థానంలో నిలిచారు. 2023 ర్యాంకుల్లోనూ ముకేశ్‌ అంబానీ అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. డైవర్సిఫైడ్‌ దిగ్గజ కంపెనీల పరంగా చూస్తే అంతర్జాతీయంగా 2024 సంవత్సరానికి ముకేశ్‌ అంబానీ మొదటి స్థానంలోఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement