guardianship
-
బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్..ముకేశ్ అంబానీ టాప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్‌లో వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 వివరాలు విడుదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ టిమ్ కుక్, టెస్లా ఎలాన్ మస్‌్కను ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. టెన్సెంట్ హూతెంగ్మా తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇదే సూచీలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గతేడాది ఉన్న 8వ స్థానం నుంచి ఈ ఏడాది 5వ స్థానంలోకి వచ్చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా 6వ స్థానం, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 16వ స్థానంలో నిలిచారు. 2023 ర్యాంకుల్లోనూ ముకేశ్ అంబానీ అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. డైవర్సిఫైడ్ దిగ్గజ కంపెనీల పరంగా చూస్తే అంతర్జాతీయంగా 2024 సంవత్సరానికి ముకేశ్ అంబానీ మొదటి స్థానంలోఉన్నారు. -
నంబర్ వన్ బ్రాండ్ సంరక్షకుడిగా అంబానీ ..
న్యూఢిల్లీ: బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2023 జాబితాలోని భారతీయు ల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మొత్తం లిస్టులో రెండో స్థానంలో నిల్చారు. కంపెనీ బ్రాండ్‌కు సంరక్షకుడిగా వ్యవహరించడంలోను, దీర్ఘకాలికంగా వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలోను సీఈవోల సామర్థ్యాల ఆధారంగా దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ రూ పొందించింది. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ 1వ స్థానంలో ఉన్నారు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 3వ స్థానంలోనూ, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్ 4వ స్థానంలో , గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 5వ ర్యాంకులో ఉన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 8వ స్థానం, డీబీఎస్ సీఈవో పియుష్ గుప్తా 9వ ర్యాంకులో ఉన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,000 మంది మార్కెట్ అనలిస్టులు, జర్నలిస్టుల అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. -
వెల్లువలా మద్దతు: బ్రిట్నీ స్పియర్స్‌కు భారీ ఊరట
Britney Spears తండ్రిని సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని చేస్తున్న న్యాయ పోరాటంలో పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ‘సగం గెలుపు’ సాధించింది. తండ్రి జేమీ స్పియర్స్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాయర్(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది. సుమారు మూడువారాల తర్వాత బుధవారం(జులై14న) జరిగిన వాదనల టైంలో లాస్ ఏంజెల్స్ కోర్టుకు ఫోన్ కాల్ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీ.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది’ అని కన్నీరు పెట్టుకుంది. గార్డియన్షిప్ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ఆయన వ్యవహారశైలి క్రూరంగా ఉందని, కనీసం ఈ వ్యవహారంలో వాదనల కోసమైన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి స్పందించిన జడ్జి బ్రెండా పెన్నీ.. స్పియర్స్ తరుపున ఇంతకు ముందు అటార్నీ రాజీనామాను ఆమోదిస్తూనే, కొత్త అటార్నీ మాథ్యూ రోసెన్గార్ట్ను నియమించుకునే హక్కును బ్రిట్నీకి కల్పిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. జేమీ స్పియర్‌ను బ్రిట్నీ సంరక్షణ నుంచి తప్పించాలన్న పిటిషన్‌పై ఇక నుంచి వాదనలు వినిపించబోతున్నారు రోసెన్‌గార్ట్. గతంలో స్టీవెన్ స్పీల్బర్గ్, సీన్ పెన్ లాంటి ప్రముఖుల తరపున వాదించారు. Coming along, folks ... coming along 🖕🏻!!!!! New with real representation today ... I feel GRATITUDE and BLESSED !!!! Thank you to my fans who are supporting me ... You have no idea what it means to me be supported by such awesome fans !!!! God bless you all !!!!! pic.twitter.com/27yexZ5O8J — Britney Spears (@britneyspears) July 15, 2021 ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ఫ్రీబిట్నీ ‘#FreeBritney’ సైన్ పిటిషన్‌ను రన్ చేస్తున్నారు. లక్షల మంది సంతకాలు చేపడుతున్నారు. అయితే ఆమె మానసిక స్థితి దృష్ట్యా తండ్రిని తప్పించలేమని కోర్టు గత వాదనల టైంలో స్పష్టం చేసింది. అయితే తదనంతర పరిణామాలు ఆమెకు పూర్తి వ్యతిరేకంగా మారాయి. స్పియర్స్‌కు చాలాకాలంగా మేనేజర్‌గా వ్యవహరించిన లారీ రుడోల్ఫ్తో పాటు ఆమె అటార్నీ సామ్యుయెల్ ఇన్గ్హమ్ కూడా తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మేనేజర్ లారీ తప్పుకోవడంతో 39 ఏళ్ల బ్రిట్నీ.. తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతోందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి కూడా. -
నా జీవితం నాక్కావాలి: కన్నతండ్రిపై సింగర్ సంచలన ఆరోపణలు
‘‘నా జీవితం సంతోషంగా ఉందన్నది పచ్చి అబద్ధం. ఇప్పుడు నిజం చెబుతున్నా.. గత 13 ఏళ్లులో ఏరోజూ సంతోషంగా లేను. రోజూ ఏడుస్తూనే ఉన్నా. కోపం, బాధ అన్నీ కలగలిసి వస్తున్నాయి. ఆయన చెర నుంచి నన్ను విడిపించండి సర్’’ అంటూ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ దీనంగా జడ్జిని వేడుకోవడం పలువురిని కంటతడి పెట్టిచ్చింది. సాక్రామెంటో: పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ తన సొంత తండ్రిపైనే సంచలన ఆరోపణలకు దిగింది. తన తండ్రి జేమీ స్పియర్స్ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. తన సంరక్షకుడి హోదా నుంచి తండ్రి జేమీని తప్పించాలంటూ బ్రిట్నీ, కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ మీద వాదనలు జరగ్గా.. 20 నిమిషాలపాటు ఏకధాటిన బ్రిట్నీ, జడ్జి ముందు కన్నీళ్లతో తన గొడును వెల్లబోసుకుంది. బలవంతంగా ఆయన్ని తన సంరక్షకుడిగా నియమించారని, కానీ, ఆ తర్వాతే తన జీవితం నాశనం అయ్యిందని బ్రిట్నీ వాపోయింది. ‘‘ఆయన వల్ల రోజూ నరకం అనుభవించా. ఇష్టం లేకున్నా గంటల తరబడి పని చేశా. డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడు. నా సంపాదన ఒకటో వంతును కూడా నా ఖర్చులకు ఇవ్వలేదు. నా ఫోన్ దగ్గరి నుంచి విలువైన కార్డుల దాకా అన్నీ ఆయన కంట్రోల్లో ఉండిపోయాయి. రోజూ నాకు లిథియం డ్రగ్ ఎక్కించేవాడు. నా పిల్లలకు నన్ను దూరం చేశాడు. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనే నా ఆశలకు అడ్డుపడ్డాడు. ఆయన సంరక్షణ నాకు మంచి కంటే చెడు ఎక్కువగా చేసింది. ఒకరకంగా ఇది ‘సెక్స్ ట్రాఫికింగ్’కి సమానం. ఇకనైనా నా జీవితం నాకు ఇప్పించండి’’ అంటూ కన్నీళ్లతో బ్రిట్నీ జడ్జిని వేడుకుంది. నా కూతురే కదా! ఇక బ్రిట్నీకి మొదటి నుంచి ఈ కేసులో ఫ్యాన్స్ మద్ధతు ఇస్తూనే వస్తున్నారు. బుధవారం కోర్టు బయట ఫ్రీ బ్రిట్నీ మూమెంట్లో భాగంగా ర్యాలీ కూడా నిర్వహించారు. వాదనలు జరుగుతున్నంత సేపు బయట బ్రిట్నీ అనుకూల నినాదాలు చేశారు. అయితే కూతురి పిటిషన్‌పై జేమీ స్పియర్ తేలికగా స్పందించారు. ఆమెకు తానేం బలవంతపు గార్డియన్‌గా లేనని, స్వచ్ఛందంగానే ఉన్నానని, ఆమె ఆరోపణలను అబద్ధమని, అయినా తాను తన కూతురిపై మమకారం ఉందని చెబుతూ జేమీ తరపున ఆయన లాయర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. పాప్ సెన్సేషన్ 39 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్.. 2004లో జేసన్ అనే వ్యక్తిని పెళ్లాడి.. నెలలు తిరగ్గకముందే విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత అమెరికన్ ర్యాపర్ కెవిన్ ఫెడెర్‌లైన్‌ను పెళ్లాడి.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తండ్రి సంరక్షణలో ఉంటున్న బ్రిట్నీ.. మానసిక సమస్యలతో బాగా కుంగిపోయింది. ఒకానొక టైంలో గుండు చేయించుకుని అభిమానులకు షాక్ ఇచ్చిందామె. చదవండి: రోజుకు ఆరుసార్లు! -
అవివాహిత తల్లికి ‘సుప్రీం’ బాసట
తండ్రి హక్కుల కన్నా బిడ్డ సంక్షేమం ముఖ్యమని స్పష్టీకరణ న్యూఢిల్లీ: తన బిడ్డ తండ్రి పేరు వెల్లడించకుండా.. తనను ఆ బిడ్డ సంరక్షకురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేస్తున్న ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో తండ్రికి నోటీసులు జారీ చేయకుండా, అతడి వాదనలు వినకుండా.. ఏకపక్షంగా తల్లిని సంరక్షుకురాలిగా గుర్తించటం సాధ్యం కాదన్న విచారణ కోర్టును.. ఆమె వినతిపై పునఃనిర్ణయించాలని నిర్దేశించింది. తన బిడ్డకు తనను ఏకైక సంరక్షకురాలిగా.. తన లావాదేవీలన్నిటికీ తన బిడ్డను నామినీగా గుర్తించాలని ఒక అవివాహిత తల్లి చేసిన విజ్ఞప్తిని విచారణ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు తిరస్కరించగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారించిన జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ అభయ్‌మనోహర్ సాప్రేలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. అవివాహిత తల్లులు, ఒంటరి తల్లుల బిడ్డల విషయంలో.. ఆ బిడ్డకు సంబంధించి బాధ్యతలను విస్మరించిన తండ్రుల చట్టబద్ధమైన హక్కులకన్నా.. ఆ బిడ్డ సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. తన కడుపున బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కోసం అవివాహిత లేదా ఒంటరి తల్లులు దరఖాస్తు చేసుకున్నపుడు.. ఆ ధ్రువీకరణ పత్రాలు జారీచేయటానికి ఆయా తల్లుల ప్రమాణపత్రం(అఫిడవిట్) సరిపోతుందని సంబంధిత అధికారులకు ఆదేశించింది.