
న్యూఢిల్లీ: బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2023 జాబితాలోని భారతీయు ల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మొత్తం లిస్టులో రెండో స్థానంలో నిల్చారు. కంపెనీ బ్రాండ్‌కు సంరక్షకుడిగా వ్యవహరించడంలోను, దీర్ఘకాలికంగా వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలోను సీఈవోల సామర్థ్యాల ఆధారంగా దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ రూ పొందించింది. ఎన్‌విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ 1వ స్థానంలో ఉన్నారు.
గతేడాది అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 3వ స్థానంలోనూ, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్ 4వ స్థానంలో , గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 5వ ర్యాంకులో ఉన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 8వ స్థానం, డీబీఎస్ సీఈవో పియుష్ గుప్తా 9వ ర్యాంకులో ఉన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,000 మంది మార్కెట్ అనలిస్టులు, జర్నలిస్టుల అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment