Brand Finance
-
నంబర్ వన్ బ్రాండ్ సంరక్షకుడిగా అంబానీ ..
న్యూఢిల్లీ: బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2023 జాబితాలోని భారతీయు ల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మొత్తం లిస్టులో రెండో స్థానంలో నిల్చారు. కంపెనీ బ్రాండ్‌కు సంరక్షకుడిగా వ్యవహరించడంలోను, దీర్ఘకాలికంగా వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలోను సీఈవోల సామర్థ్యాల ఆధారంగా దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ రూ పొందించింది. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ 1వ స్థానంలో ఉన్నారు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 3వ స్థానంలోనూ, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్ 4వ స్థానంలో , గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 5వ ర్యాంకులో ఉన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 8వ స్థానం, డీబీఎస్ సీఈవో పియుష్ గుప్తా 9వ ర్యాంకులో ఉన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,000 మంది మార్కెట్ అనలిస్టులు, జర్నలిస్టుల అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. -
టీసీఎస్ సంచలనం.. ప్రపంచంలోనే 2వ స్థానంలో..!
TCS, Infosys among world’s most valuable brands: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ అత్యంత విలువైన బలమైన ఐటీ సేవల అందిస్తున్న బ్రాండ్‌గా కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ గత సంవత్సరం నుంచి 52 శాతం వృద్ధి చెందింది. $12.8 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి సేవల బ్రాండ్‌గా అవతరించింది. 16.8 బిలియన్ డాలర్ల విలువైన టీసీఎస్ వ్యాపార పనితీరు, మెరుగైన భాగస్వామ్యాల ఒప్పందాల ద్వారా రెండు ర్యాంకింగ్ స్థాయికి చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ గత 12 నెలల్లో $1.844 బిలియన్(12.5 శాతం) పెరిగి $16.786 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడుదారులు, ఉద్యోగులు, కస్టమర్ ఈక్విటీ & బలమైన ఆర్థిక పనితీరు కారణమని పేర్కొంది. బ్రాండ్ విలువ వృద్ధి పరంగా భారతీయ ఐటీ సేవల కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్న పోటీని అధిగమించాయి. కోవిడ్-19 మహమ్మారి ద్వారా డిజిటల్ సేవలు అందించే కంపెనీలు భారీగా వృద్ది చెందాయని ఈ కొత్త నివేదిక తెలిపింది. 2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వృద్ధి 51 శాతం పెరిగితే, యుఎస్ బ్రాండ్ల వృద్ది సగటున 7 శాతం తగ్గింది. కరోనా మహమ్మారి వల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటి సేవలు & సాంకేతిక రంగానికి చెందిన దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కి అనుగుణంగా ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండటం ద్వారా కంపెనీలు దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. (చదవండి: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..!) -
వాహ్.. తాజ్..!
న్యూఢిల్లీ: టాటాలకు చెందిన ‘తాజ్’ ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ‘హోటల్స్ 50 2021’ పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కానీ ‘తాజ్’ హోటళ్లు బలంగా నిలబడినట్టు నివేదిక అభిప్రాయపడింది. టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) కింద తాజ్ హోటళ్లు నడుస్తుండడం గమనార్హం. 2016లో తాజ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తొలిసారి ఈ జాబితాలోకి ప్రవేశించడమే కాకుండా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘ఈ అంశాల ఆధారంగా చూస్తే తాజ్ బ్రాండ్ విలువ 296 మిలియన్ డాలర్లతో (రూ.2,200 కోట్లు) ప్రపంచంలో బలమైన హోటళ్ల బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్‌లో 100కు గాను 89.3 స్కోర్‌ను సంపాదించుకుంది. ఇది ఏఏఏ బ్రాండ్ రేటింగ్‌కు సమానం’’ అని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. తాజ్ తర్వాత ప్రీమియన్ ఇన్ రెండో స్థానంలో, మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ మూడో స్థానంలో, ఎన్‌హెచ్ హోటల్ గ్రూప్, షాంగ్రి లా హోటల్స్ తర్వాతి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి. -
LIC of India: గ్లోబల్‌గా ఎల్ఐసీ ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) బలమైన ఇన్సూరెన్స్ సంస్థగా అవతరించింది. అలాగే ప్రపంచంలోనే పదవ అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన నివేదిక ప్రకారం. కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, తక్కవ వడ్డీరేట్ల కారణంగా బీమా రంగం మందగించిందని, అయితే మహమ్మారిని ఎదుర్కొని మరీ ప్రపంచంలోని అగ్ర బీమా సంస్థలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డెక్లాన్ అహెర్న్ చెప్పారు. టాప్ 10 లో ఎక్కువగా చైనా బీమా కంపెనీలు ఆధిపత్యంలో ఉండగా, యుఎస్‌కు రెండు కంపెనీలు ఉండగా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా ఒక్కొక్క కంపెనీ ఉన్నాయి. కాగా ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా బీమా కంపెనీలుకుదలేన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రభావంతో బీమా రంగం దెబ్బతిన్నది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం. ఎల్ఐసీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 6.8 శాతం పెరిగి రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో44 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో చైనాకు చెందిన పింగ్అన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. అలాగే, చైనాకే చెందిన మరో సంస్థ చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 22 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జర్మనీ అలియాంజ్, ఫ్రాన్స్ నుంచి ఆక్సా సంస్థలు ఉన్నాయి. ఈ నివేదిక బలమైన బీమా బ్రాండ్లను కూడా పరిశీలిస్తుంది. ఇదే నివేదిక ప్రపంచంలోనే బలమైన బీమా సంస్థల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఎల్ఐసీ మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇటలీకి చెందిన పోస్టే ఇటాలియన్, స్పెయిన్ మ్యాప్ఫ్రే, తొలి రెండు స్థానాల్లోనూ, చైనా పింగ్ఆన్ ఇన్సూరెన్స్, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటలీకి చెందిన యునిపోల్ సాయి, యుఎస్ 'అఫ్లాక్, యుకె (బెర్ముడా) హిస్కాక్స్, దక్షిణాఫ్రికా ఓల్డ్ మ్యూచువల్ , అమెరికా ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి. Most valuable insurance #brands revealed! -Top 100 drop 6% due to #COVID19 -@pingan_group most valuable, US$44.8bn -@ChinaLifeBRK overtakes @Allianz to 2nd place -Chinese brands account for 30% total value; US brands up 14% -@PosteNews strongest REPORT: https://t.co/r4RdoHXClG pic.twitter.com/ZdHUVenOyp — Brand Finance (@BrandFinance) April 28, 2021 చదవండి : అదరగొట్టిన రిలయన్స్ వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్ -
'రిలయెన్స్ జియో' మరో రికార్డ్
ముంబయి: భారత టెలికాం రంగంలో అనేక రికార్డులను సృష్టించిన రిలయెన్స్ జియో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన ఫెరారీ, కోకాకోలా వంటి కంపెనీల సరసన రిలయన్స్ జియో నిలచింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన(స్ట్రాంగెస్ట్) బ్రాండ్స్‌లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ఘనత దక్కింది. మొదటి స్థానంలో వీచాట్(చైనా) ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన ఎస్ బిఈఆర్ బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఇండియాకు చెందిన రిలయెన్స్ జియో ఉండటం విశేషం.(చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త!) 2016లో స్థాపించిన జియో అతి తక్కువ కాలంలోనే జియో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా నిలిచింది. అలాగే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా ఉంది. ప్రస్తుతం జియోకు దాదాపు 40 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. మార్కెటింగ్ పెట్టుబడి, వాటాదారుల ఈక్విటీ, వ్యాపార పనితీరు వంటి కొలమానాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ మార్కెట్ రీసెర్చ్ ర్యాంకింగ్ ఇచ్చిందని తెలిపింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే వీటిలో జియో అత్యధికంగా స్కోర్ చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది. అలాగే బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్ టాప్ 25లో మన దేశానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు 25వ స్థానంలో ఉండటం విశేషం. -
ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో ఉన్న భారత దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్‌లో మూడవ స్థానం చేజిక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని బ్రాండ్ ఫైనాన్స్–2021 నివేదిక తెలిపింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్–10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్.రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన ప్రతిభ.. ఐటీ కంపెనీలన్నిటి మొత్తం బ్రాండ్ విలువ 3 శాతం తగ్గితే.. టీసీఎస్ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్ డాలర్ల డీల్స్‌ను చేజిక్కించుకోవడంతో బలమైన ఆదాయం నమోదు చేసింది. ఐటీ రంగంలో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం గరిష్ట స్థాయిని తాకింది. బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలో ఈ రంగంలో రెండవ స్థానానికి చేరువలో టీసీఎస్ ఉందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హైగ్ తెలిపారు. రికవరీ మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు యూఎస్, యూరప్‌లో ఫైనాన్షియల్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడం కారణంగా రాబోయే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని నివేదిక వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 4,69,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తొలి స్థానంలో యాక్సెంచర్.. ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక కాగ్నిజెంట్‌ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్ ఎగబాకింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. మహమ్మారికి ముందే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సర్వీసెస్‌పై దృష్టిసారించాలన్న ప్రాముఖ్యతను గుర్తించింది. కన్సల్టింగ్, డేటా మేనేజ్మెంట్, క్లౌడ్ సర్వీసెస్ విభాగాల్లో భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగ్నిజెంట్ బ్రాండ్ విలువ 6 శాతం తగ్గి 8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్–7, విప్రో–9, టెక్ మహీంద్రా–15వ స్థానానికి వచ్చి చేరాయి. -
టీసీఎస్ బ్రాండ్... 10 బిలియన్ డాలర్లపైనే!!
ముంబై: దేశీ దిగ్గజ ఐటీ సర్వీసెస్ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) తాజాగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2018లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా టీసీఎస్ అవతరించింది. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. దీని ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ వార్షిక ప్రాతిపదికన 1.309 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 9.081 బిలియన్ డాలర్ల నుంచి 10.391 బిలియన్ డాలర్లకు ఎగసింది. బ్రాండ్ విలువలో 14.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఐటీ పరిశ్రమలోని ఏ ఇతర సంస్థ బ్రాండ్ విలువలోనూ ఈ స్థాయి వృద్ధి నమోదు కాలేదు. దీంతో గ్లోబల్ ఐటీ సర్వీసెస్ రంగంలో టాప్–3 అత్యంత విలువైన బ్రాండ్స్ సరసన టీసీఎస్ చోటు దక్కించుకుంది. తొలి రెండు స్థానాల్లో ఐబీఎం, యాక్సెంచర్ ఉన్నాయి. టాటా బ్రాండ్ విలువ (14.236 బిలియన్ డాలర్లు)లో టీసీఎస్ వాటా 73 శాతానికిపైగా ఉండటం గమనార్హం. -
టాప్-20 గ్లోబల్ బ్రాండ్స్ లోకి ఆ టెక్ దిగ్గజం
బెంగళూరు : దేశీయ ఐటీ సంస్థ టెక్ మహింద్రా టాప్-20 గ్లోబల్ టెక్ సర్వీసుల బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. వాల్యుయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదించిన 2017 రిపోర్టులో టెక్ మహింద్రాకు 14వ స్థానం దక్కినట్టు తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 21 శాతం బలమైన వృద్ధితో టెక్ మహింద్రా 14వ స్థానాన్ని దక్కించుకున్నట్టు టెక్ మహింద్రా, బ్రాండ్ ఫైనాన్స్ రెండూ సంయుక్తంగా ఓ రిపోర్టు నివేదించాయి. '' టెక్ మహింద్రా 21 శాతం వృద్ధితో అమోఘమైన బ్రాండ్ విలువల వృద్ధిని నమోదుచేసింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్లేయర్ నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పార్టనర్ గా రూపాంతరం చెందడం నిజంగా గొప్ప పురోగతి'' బ్రాండ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డేవిడ్ హై తెలిపారు. కనెక్టెడ్ వరల్డ్, కనెక్టెడ్ ఎక్స్ పీరియన్స్, రైట్ బ్రాండు ఇన్వెస్టమెంట్స్ అనే కొత్త బ్రాండు వాగ్దానంతో, 2020లోపు టాప్-5 లోకి రావడమే ధ్యేయంగా టెక్ మహింద్రా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనేక మీడియా గ్రూపులు, స్థానిక ప్రభుత్వాలు, ట్రేడ్ కౌన్సిలల్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి, పెద్ద మొత్తంలో బ్రాండ్ బిల్డింగ్ క్యాంపెయిన్ ను గ్లోబల్ గా నిర్వహిస్తున్నామని టెక్ మహింద్రా చెప్పింది. -
అత్యంత శక్తివంతమైన ఐటీ బ్రాండ్ టీసీఎస్
♦ ఎంపిక చేసిన బ్రాండ్ ఫైనాన్స్ ♦ ఉద్యోగుల వల్లే ఈ ఘనత: టీసీఎస్ సీఈఓ లండన్: ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)నిలిచింది. అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ వేల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన 2016 వార్షిక జాబితాలో తమకు ఈ ఘనత దక్కిందని టీసీఎస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది. నిబద్ధత, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్ పేరు, ప్రఖ్యాతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో 78.3 పాయింట్ల స్కోర్‌తో, ఏఏప్లస్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచామని టీసీఎస్ పేర్కొంది. అన్నిరంగాల పరంగా చూస్తే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా డిస్ని, అత్యంత విలువైన బ్రాండ్‌గా ఆపిల్ నిలిచాయని తెలిపారు. గత ఆరేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా కూడా టీసీఎస్ నిలిచింది. 2010లో 234 కోట్ల డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ ఏడాది 940 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక తమ కంపెనీలోని 3,44,000 మంది ఉద్యోగుల కృషి ఫలితంగానే అగ్రస్థాయి ఐటీ కంపెనీగా ఎదిగామని టీసీఎస్ సీఈఓ, ఎండీ, ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. -
అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా
న్యూఢిల్లీ: భారత అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. 2,100 కోట్ల డాలర్ల విలువతో తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్ ఈ ఏడాది కూడా నిలుపుకుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక వెల్లడించింది. భారత టాప్ 100 బ్రాండ్ల విలువ మొత్తం 9,260 కోట్ల డాలర్లని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం వెల్లడించిన మరికొన్ని వివరాలు... ఏడాదికాలంలో టాటా బ్రాండ్ విలువ 300 కోట్ల డాలర్లు పెరిగింది. టాటా గ్రూప్ అంతర్జాతీయ వివిధీకరణ వ్యూహం, గ్రూప్ ప్రధాన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. టాప్ 50 బ్రాండ్ల విలువ గత ఏడాది విలువతో పోల్చితే 10 శాతం పెరిగింది. టాటా, గోద్రేజ్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ ల బ్రాండ్ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రాండ్ విలువ 51 శాతం పెరిగింది. బలహీనమైన రుణ నియంత్రణ నిబంధనలు, నిర్వహణ తీరు సరిగ్గా లేనందున ప్రభుత్వ బ్యాంక్‌ల బ్రాండ్ విలువ తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ విలువ 190 కోట్ల డాలర్లు తగ్గింది. ఆదాయ అంచనాలు బాగా లేకపోవడం, మొండి బకాయిలు బ్రాండ్ విలువ తగ్గడంలో ప్రభావం చూపాయి. భారత అగ్రశ్రేణి 100 బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ విలువ, వ్యాపార విలువకు ఉన్న నిష్పత్తి సగటున 12%గా ఉంది. కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిష్పత్తి 3 శాతంగా ఉంది.