టాప్-20 గ్లోబల్ బ్రాండ్స్ లోకి ఆ టెక్ దిగ్గజం
టాప్-20 గ్లోబల్ బ్రాండ్స్ లోకి ఆ టెక్ దిగ్గజం
Published Mon, May 15 2017 1:44 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
బెంగళూరు : దేశీయ ఐటీ సంస్థ టెక్ మహింద్రా టాప్-20 గ్లోబల్ టెక్ సర్వీసుల బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. వాల్యుయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదించిన 2017 రిపోర్టులో టెక్ మహింద్రాకు 14వ స్థానం దక్కినట్టు తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 21 శాతం బలమైన వృద్ధితో టెక్ మహింద్రా 14వ స్థానాన్ని దక్కించుకున్నట్టు టెక్ మహింద్రా, బ్రాండ్ ఫైనాన్స్ రెండూ సంయుక్తంగా ఓ రిపోర్టు నివేదించాయి.
'' టెక్ మహింద్రా 21 శాతం వృద్ధితో అమోఘమైన బ్రాండ్ విలువల వృద్ధిని నమోదుచేసింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్లేయర్ నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పార్టనర్ గా రూపాంతరం చెందడం నిజంగా గొప్ప పురోగతి'' బ్రాండ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డేవిడ్ హై తెలిపారు.
కనెక్టెడ్ వరల్డ్, కనెక్టెడ్ ఎక్స్ పీరియన్స్, రైట్ బ్రాండు ఇన్వెస్టమెంట్స్ అనే కొత్త బ్రాండు వాగ్దానంతో, 2020లోపు టాప్-5 లోకి రావడమే ధ్యేయంగా టెక్ మహింద్రా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనేక మీడియా గ్రూపులు, స్థానిక ప్రభుత్వాలు, ట్రేడ్ కౌన్సిలల్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి, పెద్ద మొత్తంలో బ్రాండ్ బిల్డింగ్ క్యాంపెయిన్ ను గ్లోబల్ గా నిర్వహిస్తున్నామని టెక్ మహింద్రా చెప్పింది.
Advertisement
Advertisement