ముంబై: దేశీ దిగ్గజ ఐటీ సర్వీసెస్ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) తాజాగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2018లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా టీసీఎస్ అవతరించింది. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. దీని ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ వార్షిక ప్రాతిపదికన 1.309 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 9.081 బిలియన్ డాలర్ల నుంచి 10.391 బిలియన్ డాలర్లకు ఎగసింది.
బ్రాండ్ విలువలో 14.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఐటీ పరిశ్రమలోని ఏ ఇతర సంస్థ బ్రాండ్ విలువలోనూ ఈ స్థాయి వృద్ధి నమోదు కాలేదు. దీంతో గ్లోబల్ ఐటీ సర్వీసెస్ రంగంలో టాప్–3 అత్యంత విలువైన బ్రాండ్స్ సరసన టీసీఎస్ చోటు దక్కించుకుంది. తొలి రెండు స్థానాల్లో ఐబీఎం, యాక్సెంచర్ ఉన్నాయి. టాటా బ్రాండ్ విలువ (14.236 బిలియన్ డాలర్లు)లో టీసీఎస్ వాటా 73 శాతానికిపైగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment