ఏప్రిల్ 19 రిలయన్స్‌అధినేత ముఖేష్ అంబానీ పుట్టిన రోజు
ఈ సందర్భంగా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్ వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం.
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!)
కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్‌ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్)
బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా..
అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్‌లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే.
కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment