Reliance Industries chairman
-
బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్..ముకేశ్ అంబానీ టాప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్‌లో వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 వివరాలు విడుదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ టిమ్ కుక్, టెస్లా ఎలాన్ మస్‌్కను ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. టెన్సెంట్ హూతెంగ్మా తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇదే సూచీలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గతేడాది ఉన్న 8వ స్థానం నుంచి ఈ ఏడాది 5వ స్థానంలోకి వచ్చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా 6వ స్థానం, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 16వ స్థానంలో నిలిచారు. 2023 ర్యాంకుల్లోనూ ముకేశ్ అంబానీ అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. డైవర్సిఫైడ్ దిగ్గజ కంపెనీల పరంగా చూస్తే అంతర్జాతీయంగా 2024 సంవత్సరానికి ముకేశ్ అంబానీ మొదటి స్థానంలోఉన్నారు. -
ఆర్థిక సంస్కరణలతో ప్రజలకు మేలు: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో పౌరులు అసమానమైన ప్రయోజనలు పొందుతున్నారని ఇప్పుడు ‘ఇండియన్ మోడల్’ దిశలో సంపద సృష్టించడంపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి అమెరికా, చైనా దేశాలతో సమానంగా ఇండియా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల ఆర్థిక సరళీకరణ సందర్భంగా ఆయన అరుదైన కాలమ్ రాస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా సంపద సృష్టి మీద మాత్రమే దృష్టి సారించామని.. అందరికీ విద్య, అందరకీ ఆరోగ్యం, అందరికీ ఉపాధి, అందరికీ హౌసింగ్ సాధించడంలోనే నిజమైన సంపద దాగుందనే సత్యాన్ని విస్మరించామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో కంపెనీల విస్తరణ సమయంలో ప్రజల శ్రేయస్సు, సంరక్షణ అంశాలను పట్టించుకోవటం లేదని ఈ అంశాల్లో భారత్ ప్రారంభ దశలో ఉందన్నారు. -
ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే... ► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే. ► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. ► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. ► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. ► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి. ► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు. ► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. వృద్ధిలో వీరి పాత్ర కీలకం... ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం. –అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్ వేగం పుంజుకుంటున్న భారత్ భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది. – యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది. గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి -
ముకేశ్ అంబానీకి అవార్డ్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి రసాయన పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన అవార్డ్, అధ్మర్ గోల్డ్ మెడల్ లభించింది. చమురు, గ్యాస్ పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ద కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఇచ్చింది. -
ముకేశ్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార రంగానికి అందించిన సేవలకు గానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముకేశ్ అంబానీకి ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ముకేశ్ అంబానీ ఐసీటీలోనే 1979లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తిచేశారు. ఈయనకు ముందు ఈ డాక్టరేట్‌ను భారతరత్న అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త డా.సీఎన్ఆర్ రావు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఎంఎం శర్మతో పాటు మరొక వ్యక్తి పొందారు. -
మళ్లీ ముఖేష్దేమొదటి స్థానం
వాషింగ్టన్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత్‌లో అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 23.6 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ముఖేశ్ ఆస్తి గత ఏడాది కంటే 2.6 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్‌లో అత్యధిక సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని కొనసాగించారని పేర్కొంది. భారత్‌లో 100 అత్యధిక సంపన్నుల తాజా జాబితాను గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి వంద మంది భారతీయులేని బిలయనీర్లేనని తెలిపింది. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కిందని అభిప్రాయపడింది. అలాగే రెండవ స్థానాన్ని ప్రముఖ ఔషధ కంపెనీ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సింఘ్వీ అక్రమించారని చెప్పింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్నారై వ్యాపారీ, ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ను ఐదో స్థానానికి నెట్టి మరీ దిలీప్ రెండవ స్థానాన్ని అందుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత ఎనిమిది స్థానాలు వరుసగా 16.4 బిలియన్ డాలర్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, 15.9 బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్ అధినేత పల్లొంజి మిస్త్రీ, 15.8 బిలియన్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్, 13.3 బిలియన్లతో హిందూజా బ్రదర్స్, రూ. 12.5 బిలియన్లతో శివ నాడర్, 11.6 బిలియన్లతో గోద్రెజ్ ఫ్యామిలీ, 9.2 బిలియన్లతో కుమార్ బిర్లా, రూ.7.8 బిలియన్లతో సునీల్ మిట్టల్ ఉన్నారని పోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.