బీజింగ్: అధిక జనాభాతో మన దేశం జనభారత్‌గా దూసుకుపోతుంటే పొరుగుదేశం చైనా జనాభా క్షీణతను చవిచూస్తోంది. వరసగా రెండో ఏడాదీ అక్కడ జనాభా క్షీణత నమోదైంది. గత ఏడాదితో చూస్తే 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8 లక్షలు తగ్గి 140.97 కోట్లకు పడిపోయింది. వార్షిక గణాంకాలను బుధవారం చైనా విడుదలచేయడంతో ఈ విషయం వెల్లడైంది.
జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అమలుచేయడంతో చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎరుగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జని్మస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడమూ ఇందుకు ఒక కారణం. కోవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గత ఏడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment