అన్నకు బదులుగా ఇంటర్ పరీక్ష రాస్తూ.. | Younger brother writes inter exam Instead of his elder brother | Sakshi
Sakshi News home page

అన్నకు బదులుగా ఇంటర్ పరీక్ష రాస్తూ..

Published Wed, Mar 19 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

Younger brother writes inter exam Instead of his elder brother

తల్లాడ, న్యూస్‌లైన్: అన్నకు బదులు ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో తమ్ముడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని రెడ్డిగూడెంకు చెందిన శీలం వెంకటరమణారెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పరీక్షకు స్థానిక సూర్యజూనియర్ కళాశాలలో ఫీజు కట్టాడు. అనంతరం ఏపీసీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై  ఐదు నెలల క్రితం శిక్షణ కోసం కేరళకు వెళ్లాడు. కాగా, డిగ్రీ చదువుతున్న అతని తమ్ముడు సురేందర్‌రెడ్డి అన్న పేరుమీద క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలోకి వెళ్లాడు. పరీక్ష రాస్తుండగా అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ హాల్‌టికెట్‌ను పరీక్షించగా ఫొటో మార్పు ఉన్నట్లు గుర్తించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై మాల్ ప్రాక్టీస్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా, సురేందర్‌రెడ్డి బుధవారం బీఎస్సీ సెకండ్ ఇయర్ పరీక్ష రాయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement