దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్షకు.. | Inter student tragedy at ghatkesar | Sakshi
Sakshi News home page

దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్షకు..

Published Thu, Mar 1 2018 3:36 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Inter student tragedy at ghatkesar - Sakshi

తలకొరివి పట్టిన లావణ్య

ఘట్‌కేసర్‌టౌన్‌: ఓ పక్క ఇంటిలో తండ్రి శవం.. మరో పక్క పరీక్ష కేంద్రంలో కూతురు.. ఈ హృదయవిదారక దృశ్యం మండలంలోని యంనంపేట్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి ఆరముల్ల శ్రీనివాస్‌ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశాడు. శ్రీనివాస్‌ భార్య 12 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరి ఏకైక కుమార్తె లావణ్య.

తల్లి చనిపోవడంతో శ్రీనివాస్‌ అన్నీ తానై లావణ్యను పెంచుతున్నాడు. ఇప్పుడు తండ్రి మృతితో రెక్కలు తెగిన పక్షిలా అయింది లావణ్య. ఘట్‌కేసర్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న లావణ్య బుధవారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దుఃఖాన్ని దిగమింగుకొని బంధువుల సహకారంతో అన్నోజీగూడ నారాయణ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరైంది. అనంతరం తలకొరివి పట్టి తండ్రి చితికి నిప్పంటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement