ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే హెడ్‌సెట్‌.. | Jio launches JioDive VR headset for IPL fans | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే హెడ్‌సెట్‌.. నేరుగా స్టేడియంలో మ్యాచ్‌ చూసినట్లే ఉంటుంది!

Published Mon, May 1 2023 10:07 PM | Last Updated on Mon, May 1 2023 10:08 PM

Jio launches JioDive VR headset for IPL fans - Sakshi

ఐపీఎల్‌ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న అనుభూతిని ‍కలిగించే జియో డైవ్‌ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్‌) హెడ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది.

ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్‌! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్‌ 

జియో సినిమా (JioCinema) యాప్‌లో ఐపీల్‌ మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్‌ హెడ్‌సెట్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్‌ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్‌సెట్‌ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. 

ఈ జియోడైవ్ హెడ్‌సెట్‌ ధర రూ. 1,299. జియో మార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. పేటీఎం ‍వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్‌ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్‌ హెడ్‌సెట్‌ను రిటర్న్‌ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది.

జియోడైవ్‌ వీఆర్‌ హెడ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 

  • 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ
  • 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్‌ ఉన్న ఆండ్రాయిడ్‌, iOS ఫోన్‌లకు సపోర్ట్‌
  • లెన్స్ ఫోకస్‌, ఫైన్‌ ట్యూన్ అడ్జెస్ట్‌మెంట్‌ కోసం ఏర్పాటు.
  • హెడ్‌సెట్‌ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్‌
  • Android 9+, iOS 15+కి సపోర్ట్‌ 

ఉపయోగించడం ఎలా?

  • బాక్స్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్‌ (JioImmerse) యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి
  • సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిఉండాలి.
  • జియోడైవ్‌ (JioDive) ఆప్షన్‌ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్‌ చేయండి
  • హెడ్‌సెట్‌లో ఫ్రంట్‌ కవర్‌ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను పెట్టిన తర్వాత ఫ్రంట్‌ కవర్‌ను మూసివేయండి
  • హెడ్‌సెట్‌ను పెట్టకుని స్ట్రాప్స్‌ను సరిచేసుకోండి
  • ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్‌  క్వాలిటీని అడ్జస్ట్‌మెంట్‌ వీల్స్‌ను సరిచేయండి

ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement