Jio customers
-
12 కోట్ల వీక్షకులతో జియోసినిమా కొత్త రికార్డు
న్యూఢిల్లీ: టాటా ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న జియోసినిమా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది విశిష్ట వీక్షకులు వీక్షించినట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు ’పీక్ కాన్కరెన్సీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం 3.2 కోట్ల వీక్షకులతో మరో రికార్డు సృష్టించినట్లు వివరించింది. తద్వారా స్పోర్ట్స్ వీక్షణలో గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టినట్లు జియోసినిమా తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో మ్యాచ్‌లను ప్రసారం చేసిన నేపథ్యంలో సగటున ప్రతి మ్యాచ్ వీక్షణ సమయం 60 నిమిషాల పైగా నమోదైనట్లు వివరించింది. వీడియోల రూపంలో చూసే మొత్తం వీక్షకులను విశిష్ట వీక్షకులుగా వ్యవహరిస్తారు. ఏ క్షణంలోనైనా ఏకకాలంలో అత్యధిక లాగిన్లు నమోదైన సమయాన్ని పీక్ కాన్‌కరెన్సీగా పరిగణిస్తారు. -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్‌లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్‌సెట్‌ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్‌సెట్‌ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్‌సెట్‌ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్‌ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్‌ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్‌ను మూసివేయండి హెడ్‌సెట్‌ను పెట్టకుని స్ట్రాప్స్‌ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్‌ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
జియో కస్టమర్లకు శుభవార్త
ముంబయి : రిలయన్స్ జియో కస్టమర్లకు మరో శుభవార్త. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో బుధవారం ప్రకటించింది. దీనికి అధనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. భారతదేశంలో ఉన్న ఏ వైఫై నెట్‌వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేయనుంది. ప్రసుత్తం 150 రకాల స్మార్ట్ ఫోన్లలో వైఫై ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్ సౌలభ్యం దేశ వ్యాప్తంగా జనవరి 7 నుంచి 16 మధ్యలో అందుబాటులోకి రానుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు jio.com వెబ్సైట్లో చూసుకోవచ్చు. జియో వైఫై కాలింగ్ ఉపయోగించాలంటే స్మార్ట్ఫోన్లలో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు భారతీ ఎయిర్టెల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ' ఎయిర్టెల్ వైఫై కాలింగ్' పేరుతో సదుపాయాన్ని కల్పించింది. తాజాగా జియో మాత్రం ఉచిత వైఫై కాలింగ్ సదుపాయాన్ని పాన్ ఇండిలో కల్పించనుంది. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్
రిలయన్స్ జియో ప్రైమ్ సభ్యత్వం తుది గడువు రేపటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత జియో ప్రైమ్ మెంబర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. అదనంగా ఏడాది పాటు కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందియనున్నట్టు జియో ప్రకటించింది. ఇంకా ఒక్క రోజుల్లో తన ప్రైమ్ మెంబర్షిప్ గడువు ముగియనున్న నేపథ్యంలో జియో ఈ గుడ్‌న్యూస్ చెప్పింది. మైజియో యాప్‌లోకి లాగిన్ అయి జియో మెంబర్లు కాంప్లిమెంటరీ జియో మెంబర్‌షిప్‌ను ఎంచుకుంటే, మరో ఏడాది పాటు కాంప్లిమెంటరీ ఫ్రీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. కాగ, గతేడాది జియో 99 రూపాయలతో ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త జియో యూజర్లకు కూడా ప్రైమ్ మెంబర్షిప్ ధర అదేవిధంగా ఉంటుందని జియో తెలిపింది. అంటే కొత్త యూజర్లు రూ.99 చెల్లించి ప్రస్తుతం ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది. పాత యూజర్లకు మాత్రానికి ఉచితంగా మరో ఏడాది పాటు ఈ సర్వీసులను పొడిగించుకోవచ్చు. గతేడాది తీసుకొచ్చిన జియో ప్రైమ్, రిలయన్స్ జియో కస్టమర్లకు ఏడాది సభ్యత్వం లాంటిది. దీనిలో ఎవరైతే రూ.309 లేదా ఆపై మొత్తాల రీఛార్జ్‌తో పాటు వన్-టైమ్ వార్షిక ఫీజు కింద 99 రూపాయలు చెల్లించారో వారికి ఈ సభ్యత్వం కల్పించింది. ఈ ఎన్‌రోల్‌మెంట్‌తో పలు ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. కేవలం 399 రూపాయల ఛార్జ్‌తోనే ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్‌ను, ఎస్ఎంఎస్లను, 4జీ డేటాను యూజర్లు 70 రోజుల పాటు పొందవచ్చు. జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా ఉన్నాయి. అంతేకాక ఏడాది పాటు వెయ్యి రూపాయల విలువైన జియో ప్రీమియం కంటెంట్‌ను పొందవచ్చు. ఎప్పటికప్పుడు జియో ప్రైమ్ యూజర్లకు ఆఫర్లను, డీల్స్‌ను జియో ప్రకటిస్తూ వచ్చింది. అంతేకాక జియో యాప్స్ అన్ని ఉచితంగా లభించాయి. ఈ యాప్స్‌తో మూవీస్, వీడియో లాంటి మ్యూజిక్, కంటెంట్‌ను యూజర్లు ఉచితంగా పొందుతున్నారు. -
జియోకు లభించే ఆదరణ ఏ రేంజ్ లో ఉందంటే...
న్యూఢిల్లీ : ఉచిత ఆఫర్లతో ఇన్ని రోజులు వినియోగదారులను మైమరిపించిన రిలయన్స్ జియో ఛార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది. 2017 ఏప్రిల్ నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలు చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. అయితే ఛార్జీల వసూల తర్వాత నుంచి చాలామంది జియో సిమ్ సబ్‌స్క్రైబింగ్ ను ఆపివేస్తారంటూ పలు రూమర్లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదెంత నిజమో తెలుసుకోవడం కోసం బ్రోకరేజ్ సంస్థ బెర్న్ స్టెయిన్ ఓ రీసెర్చ్ నిర్వహించింది. ఈ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైంది. కస్టమర్ మన్ననలను పొందడంలో రిలయన్స్ జియో అత్యధిక స్కోర్ నమోదుచేసిందని, ఇంక్యుబెంట్లను మించి కస్టమర్ సర్వీసు, అనుకూలత, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ లో ఇది మంచి పేరును సంపాదించుకుంటుందని వెల్లడైంది. జియో ఉచిత ఆఫర్లను చాలామంది మెచ్చుకుంటారని కానీ వాయిస్ క్వాలిటీ, ఛార్జీల బాదుడు విషయంతో చాలామంది తమ ప్రైమరీ ఆపరేటర్ కు వెళ్తారని చెప్తారేమో అనుకున్నామని బెర్న్ స్టెయిన్ తెలిపింది. కానీ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైనట్టు పేర్కొంది. వాయిస్ క్వాలిటీ, వాయిస్ కవరేజ్ లో వొడాఫోన్, ఐడియాలను మించి జియో మంచి ప్రదర్శనను కనబర్చిందని రీసెర్చ్ వెల్లడించింది. నెలకు రూ.303 ఛార్జీ వసూల చేయడం ప్రారంభించిన తర్వాత కూడా 67 శాతం మంది యూజర్లు తాము కలిగిన ఉన్న జియో సెకండరీ సిమ్ ను అలాగే వాడుతామని పేర్కొన్నారు. వారిలో 63శాతం మంది కొత్త ప్రైమరీ ఆపరేటర్ గా తమ జియోను మార్చుకోవాలనేది ప్లాన్ అని చెప్పారు. మిగతా 28 శాతం మంది సెకండ్ సిమ్ గానే జియోను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కేవలం 2 శాతం మంది జియో యూజర్లు మాత్రమే తమ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అది కూడా జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తే వాటిని వాడతామని చెప్పారు. జియో ఛార్జీల వసూల బాదుడు తర్వాత ఎంత మంది ఆ సిమ్ ను వాడతారనే దానిపైనే ఈ రీసెర్చ్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ రీసెర్చ్ లో కూడా ఉచిత ఆఫర్లను ఇవ్వకపోయినా కస్టమర్ల మన్ననలను జియోకు అలాగే ఉంటాయని వెల్లడైంది. మొత్తం వెయ్యిమంది శాంపుల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ ఈ రీసెర్చ్ ను చేపట్టింది. రీసెర్చ్ లో పాల్గొన్న వారిలో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన వారు కాగ, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు.