12 కోట్ల వీక్షకులతో జియోసినిమా కొత్త రికార్డు | Jio Cinema says it has created a new record with 12 crore unique viewers | Sakshi
Sakshi News home page

12 కోట్ల వీక్షకులతో జియోసినిమా కొత్త రికార్డు

Published Fri, Jun 2 2023 4:17 AM | Last Updated on Fri, Jun 2 2023 4:17 AM

Jio Cinema says it has created a new record with 12 crore unique viewers - Sakshi

న్యూఢిల్లీ: టాటా ఐపీఎల్‌ మ్యాచ్‌ల స్ట్రీమింగ్‌ హక్కులు దక్కించుకున్న జియోసినిమా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను 12 కోట్ల మంది విశిష్ట వీక్షకులు వీక్షించినట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు ’పీక్‌ కాన్‌కరెన్సీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం 3.2 కోట్ల వీక్షకులతో మరో రికార్డు సృష్టించినట్లు వివరించింది. తద్వారా స్పోర్ట్స్‌ వీక్షణలో గ్లోబల్‌ రికార్డులను బద్దలు కొట్టినట్లు జియోసినిమా తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో మ్యాచ్‌లను ప్రసారం చేసిన నేపథ్యంలో సగటున ప్రతి మ్యాచ్‌ వీక్షణ సమయం 60 నిమిషాల పైగా నమోదైనట్లు వివరించింది. వీడియోల రూపంలో చూసే మొత్తం వీక్షకులను విశిష్ట వీక్షకులుగా వ్యవహరిస్తారు. ఏ క్షణంలోనైనా ఏకకాలంలో అత్యధిక లాగిన్‌లు నమోదైన సమయాన్ని పీక్‌ కాన్‌కరెన్సీగా పరిగణిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement