new world record
-
EC: ఓటర్లకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు. జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ ‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్‌యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు. మా గురించి మాట్లాడుకోరు ‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్‌చేశాం. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు. దమ్ముంటే నిరూపించండి ‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్‌కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు. ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం ‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్‌లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్‌లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు. -
కమి రిటా షెర్పా రికార్డు
కఠ్మాండు: నేపాలీ పర్వతారోహకుడు కమి రిటా షెర్పా(53) సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8 వేల మీటర్లకంటే మించి ఎత్తయిన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమి రిటా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనస్లును మంగళవారం ఉదయం కమి రిటా షెర్పా అధిరోహించారని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని కమి రిటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు ఎక్కారు. -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్‌కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్‌లో విజయ్‌వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్‌లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్‌వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్‌వీర్, అనీశ్ -
12 కోట్ల వీక్షకులతో జియోసినిమా కొత్త రికార్డు
న్యూఢిల్లీ: టాటా ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న జియోసినిమా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది విశిష్ట వీక్షకులు వీక్షించినట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు ’పీక్ కాన్కరెన్సీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం 3.2 కోట్ల వీక్షకులతో మరో రికార్డు సృష్టించినట్లు వివరించింది. తద్వారా స్పోర్ట్స్ వీక్షణలో గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టినట్లు జియోసినిమా తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో మ్యాచ్‌లను ప్రసారం చేసిన నేపథ్యంలో సగటున ప్రతి మ్యాచ్ వీక్షణ సమయం 60 నిమిషాల పైగా నమోదైనట్లు వివరించింది. వీడియోల రూపంలో చూసే మొత్తం వీక్షకులను విశిష్ట వీక్షకులుగా వ్యవహరిస్తారు. ఏ క్షణంలోనైనా ఏకకాలంలో అత్యధిక లాగిన్లు నమోదైన సమయాన్ని పీక్ కాన్‌కరెన్సీగా పరిగణిస్తారు. -
200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో కొత్త ప్రపంచ రికార్డు
టోక్యో: ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ తాత్యానా షున్మేకర్ ఈ ఘనత సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును 24 ఏళ్ల తాత్యానా 2ని:18.95 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2ని:19.11 సెకన్లతో 2013లో రికీ మోలెర్ పెడర్సన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తాత్యానా బద్దలు కొట్టింది. -
ప్రపంచ రికార్డుకోసం 17 నెలల గర్భిణి ....!
చైనాః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనావాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ వారికి వారే సాటి. అయితే తాజాగా ఓ మహిళ తాను 17 నెలల గర్భిణినని, ప్రపంచ రికార్డుకు అర్హురాలినంటూ క్లైమ్ చేయడం సంచలనంగా మారింది. సాధారణంగా ఉండే తొమ్మిది నెలల గర్భం.. కొందర్లో అరుదుగా పది నెలలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే 17 నెలలు గర్భంతో ఉన్నానంటూ ఆమె చెప్తున్న వివరాలు నిజమే అయితే.. వరల్డ్ రికార్డు ఆమెను వహించినట్లే... చైనా హునాన్ ప్రావిన్స్, తియాన్సింగ్ నగరానికి చెందిన వాంగ్ షి అనే మహిళ... బహుశా గిన్నిస్ రికార్డును సాధించే అవకాశం కన్పిస్తోంది. రికార్డుకోసం ప్రత్యేకంగా ఆమె ఏ ప్రయత్నాలు చేయకపోయినా... గత సంవత్సరంలో గర్భం ధరించిన ఆమె.. 17 నెలల పాటు ప్రసవం కాకుండా గర్భిణిగానే ఉండిపోవడం.. దీర్థకాలం గర్భాన్ని ధరించిన మహిళగా రికార్డు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. లెక్క ప్రకారం 2015 నవంబర్ నెలలో వాంగ్ షి కి ప్రసవం కావాల్సి ఉండగా.. డ్యూ డేట్ దాటి ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకు ఆమె.. ఆగస్టు 18న బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా (మాయ) సరిగా పెరగకపోవడంతోనే అంతకాలంపాటు ప్రసవం కానట్లు తెలుస్తోంది. 2015 ఫిబ్రవరి నెలలో గర్భాన్ని ధరించిన వాంగ్ షి.. తొమ్మిది నెలల తర్వాత ప్రసవం కాకపోవడంతో ఆస్పత్రికి వెళ్ళింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని, ప్రసవానికి కొంత సమయం పడుతుందని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్లాసెంటా ప్రీవియాగా పిలిచే సమస్యవల్ల ఆమెకు తొమ్మిది నెలలు దాటినా ప్రసవం అయ్యే సూచనలు కనిపించడం లేదని చెప్పారు. డ్యూడేట్ దాటిపోవడంతో ఆందోళనలో పడ్డ వాంగ్ సహా.. ఆమె భర్త.. ప్రతి ఏడునుంచీ పది రోజులకోసారి చెకప్ కోసం ఆస్పత్రికి వెడుతూనే ఉన్నారు. అనంతరం 14 నెలలు గర్భం ఉన్నసమయంలో ఓసారి ప్రసవానికి సిద్ధమైన వాంగ్ ను వైద్యులు వారించారు. ఆమె ఇంకొంతకాలం ప్రసవంకోసం వేచి చూడాల్సి ఉందని, సి-సెక్షన్ ఆపరేషన్ చేయడానికి తగినంతగా 'ఫీటస్' వృద్ధి చెందలేదని తెలిపారు. ఆగస్టు 18న విజయవంతంగా బిడ్డకు జన్మనిచ్చిన వాంగ్... అంతకు ముందు నెల రోజుల క్రితం తన బాధను మీడియాముందు వ్యక్తపరచింది. ఇంతకాలంపాటు గర్భిణిగా ఉండటం ఎంతో సిగ్గుగా ఉందని, అంతేకాక అధిక నెలలు మోయడంతో కేవలం చెకప్ ల కోసం 1,500 డాలర్ల వరకూ ఖర్చు కూడా అధికంగానే అయ్యిందని వాపోయింది. సాధారణంగా గర్భానికి ముందు 52.2 కిలోల బరువుండే తాను.. 26 కేజీలు పెరిగి 78 కేజీలకు చేరుకున్నానని, ఇక తనకు భరించే శక్తి లేదంటూ ఆందోళన చెందింది. కానీ ఎటువంటి ఇతర సమస్యలు లేకుండా ఆరోగ్యంగానే ఉండటంతో చివరికి ఆగస్టు 18న 3.8 కేజీల బరువున్న ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించింది. 1945 సంవత్సరంలో ఆమెరికాకు చెందిన బ్యూలా హంటర్ అనే మహిళ.. 375 రోజుల సుదీర్ఘ గర్భంతో ఉన్నట్లు ఆధారాలు తెలుపుతున్నాయని, వాంగ్ కు 2015 లో ప్రసవం కావాల్సినట్లు వైద్యులు ఇచ్చిన రికార్డులు ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికెట్ జారీచేస్తే..వాంగ్ షి గత రికార్డును తిరగరాసినట్లేనని పీపుల్స్ డైలీ వెల్లడించింది. అయితే వాంగ్ షి 17 నెలల గర్భంతో ఉన్నట్లు పూర్తిశాతం రికార్డులు లేవని, డ్యూ డేట్ కు ముందు ఆమె ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నట్లు ఆధారంకోసం పరిశీలిస్తున్నామని చెంగ్ షా కు చెందిన ఓ ఫిజిషియన్ తెలిపారు. -
విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్
-
విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్
మెల్ బోర్న్: ఆతిత్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్ డేలో టీడిండియా బ్యాట్స్ మన్, టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫీట్ సాధించాడు. వన్ డేల్లో అతి వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 169 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 161 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికన్ స్టార్ ఏ.బి. డివిలియర్స్ పేరుమీద ఉండేది. వన్ డేల్లో తన 166వ ఇన్నింగ్స్(172వ మ్యాచ్)లో డివిలియర్స్ 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ తాజా ఇన్నింగ్స్ తో ఏబీ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు 7 వేల పరుగుల మైలురాయిని దాటిన క్రికెటర్లు 36 మంది ఉన్నారు. వన్ డేల్లో ప్రమాదకరమైన బ్యాట్స్ మన్ గా ముద్రపడ్డ 27ఏళ్ల కోహ్లీ ఇప్పటివరకు వన్ డేల్లో 23 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు కూడాసాధించాడు. వేగంగా ఏడువేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ల వివరాలిలా ఉన్నాయి.. సౌరవ్ గంగూలి(భారత్) - 174వ ఇన్నింగ్స్(180వ మ్యాచ్) బ్రియాన్ లారా(వెస్టిండీస్)- 183వ ఇన్నింగ్స్ లో డెస్మండ్ హెన్స్(వెస్టిండీస్) 183వ ఇన్నింగ్స్ లో జాక్వెస్ కలిస్(దక్షిణాఫ్రికా)- 188వ ఇన్నింగ్స్ సచిన్ టెండూల్కర్(భారత్)- 189వ ఇన్నింగ్స్ -
112 ఏళ్ల బామ్మ ప్రపంచ రికార్డు
లండన్: ఇంగ్లండ్‌కు చెందిన 112 ఏళ్ల బామ్మ గ్లాడ్సీ హూపర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమెకు ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచంలో ఈ ఆపరేషన్ విజయవంతమైన అత్యధిక వయస్కురాలిగా గ్లాడ్సీ హూపర్ రికార్డులకెక్కారు. గ్లాడ్సీ హూపర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. ఆమెకు చేసిన ఆపరేషన్ విజయవంతమైందని కొడుకు డెరెక్ హర్మిస్టన్ (84) చెప్పారు. ఆపరేషన్ చేశాక తన తల్లి బాగా కోలుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలో ఈ ఆపరేషన్ ను విజయవంతంగా చేయించుకున్న వృద్ధ మహిళ గ్లాడ్సీ హూపరేనని సర్జన్ జేసన్ మిల్లింగ్టన్ తెలిపారు. వందేళ్లు దాటిన మహిళకు ఆపరేషన్ చేయడమన్నది సాహసోపేత నిర్ణయమని, అయితే విజయవంతంగా ఆపరేషన్ చేశామని చెప్పారు. గతంలో జాన్ రాండల్ 102 ఏళ్ల వయసులో ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. తాజాగా గ్లాడ్సీ హూపర్ సరికొత్త రికార్డును సృష్టించారు. -
మూడేళ్ల వయస్సులో వరల్డ్ రికార్ట్
-
గిన్నిస్‌కెక్కిన జాతీయ పతాకం