
టోక్యో: ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ తాత్యానా షున్‌మేకర్ ఈ ఘనత సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును 24 ఏళ్ల తాత్యానా 2ని:18.95 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2ని:19.11 సెకన్లతో 2013లో రికీ మోలెర్ పెడర్సన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తాత్యానా బద్దలు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment