ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్‌కియాన్
టోక్యో: ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్‌కియాన్.. టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మన దేశం ఒక్క పతకంతోనే మురుస్తుంటే ఎమ్మా ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. స్విమ్మింగ్ విభాగంలో తనకు ఎదురు లేదనేలా దూసుకుపోయిన మెక్‌కియాన్ మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణాలు.. మూడు క్యాంస్యాలు ఉన్నాయి.
100 ఫ్రీస్టైల్, 4x100 ఫ్రీస్టైల్ రిలే , 50 ఫ్రీస్టైల్ , 4x100 మెడ్లీరిలేల్లో స్వర్ణం గెలిచిన ఆమె.. 100 బటర్‌ఫ్లై, 4x200 ఫ్రీస్టైల్ రిలే, 4x100 మిక్స్‌డ్ మెడ్లీరిలే విభాగాల్లో క్యాంస్యం గెలిచింది. 1952లో సోవియట్ జిమ్మాస్ట్ మరియా గోరోకోవిస్కయ రికార్డును ఎమ్మా సమం చేసింది. అలాగే స్విమ్మింగ్ లెజెండ్ ఇయాన్ తోర్ప్ రికార్డును అధిగమించి... ఆస్ట్రేలియా తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో ఎమ్మా మెక్‌కియాన్ తర్వాతి స్థానంలో అమెరికన్ ఫ్రీ స్టైల్ స్మిమ్మర్ కాలెబ్ డ్రెసెల్ 5 పతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఓవరాల్‌గా ఎమ్మా మెక్‌కియాన్ 2016 రియో ఒలింపిక్స్ కలుపుకొని ఇప్పటివరకు 11 పతకాలు సాధించి ఆస్ట్రేలియా తరుపున అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఒక ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు కొల్లగొట్టిన ఆటగాడిగా అమెరికాకు చెందిన మైకెల్ పెల్స్ తొలి స్థానంలో ఉన్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పెల్స్ 8 పతకాలతో మెరవగా.. అవన్నీ స్వర్ణ పతకాలే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment