100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో డ్రెసెల్‌ ప్రపంచ రికార్డు | Caleb Dressel Shatters World Record to Win 100m Butterfly Gold | Sakshi
Sakshi News home page

100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో డ్రెసెల్‌ ప్రపంచ రికార్డు

Published Sun, Aug 1 2021 6:45 AM | Last Updated on Sun, Aug 1 2021 8:15 AM

Caleb Dressel Shatters World Record to Win 100m Butterfly Gold - Sakshi

పురుషుల స్విమ్మింగ్‌లో సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికన్‌ కాలెబ్‌ డ్రెసెల్‌ మరోసారి తన సత్తాను ప్రదర్శించాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌ను 49.45 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలువడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2019లో 49.50 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును డ్రెసెల్‌ తిరగరాయడం విశేషం.

మహిళల విభాగంలో క్యాథలీన్‌ లెడెకీ (అమెరికా) హవా కొనసాగింది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఆమె స్వర్ణ పతకం (8 నిమిషాల 12.57 సెకన్లు) సాధించింది. టిట్మస్‌ (ఆస్ట్రేలియా)కు రజతం, సిమోనా క్వాడ్రెల్లా (ఇటలీ)కి కాంస్యం దక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement