IPL Matches
-
జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!
స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్ ఆటో డ్రైవర్ కిశోర్ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్ డేటా లిమిట్ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్ డేటా వాడకం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. అప్పుడైతే పీక్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయట! సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్ ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చౌక స్మార్ట్ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 2029 నాటికి మనమే టాప్... అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎరిక్సన్ చెబుతోంది.జీడీపీకి దన్నుపెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్వర్క్ స్పెషలిస్ట్ పరాగ్ కర్ చెప్పారు. కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్ టీఎంటీ కన్సలి్టంగ్ సంస్థ ఎనాలిసిస్ మేసన్‌కు చెందిన అశ్విందర్ సేథి చెప్పారు.అత్యధిక మొబైల్ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్) నెలవారీ వినియోగంప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్ స్ట్రీమింగ్: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం– సాక్షి, బిజినెస్ డెస్క్ -
12 కోట్ల వీక్షకులతో జియోసినిమా కొత్త రికార్డు
న్యూఢిల్లీ: టాటా ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న జియోసినిమా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది విశిష్ట వీక్షకులు వీక్షించినట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు ’పీక్ కాన్కరెన్సీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం 3.2 కోట్ల వీక్షకులతో మరో రికార్డు సృష్టించినట్లు వివరించింది. తద్వారా స్పోర్ట్స్ వీక్షణలో గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టినట్లు జియోసినిమా తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో మ్యాచ్‌లను ప్రసారం చేసిన నేపథ్యంలో సగటున ప్రతి మ్యాచ్ వీక్షణ సమయం 60 నిమిషాల పైగా నమోదైనట్లు వివరించింది. వీడియోల రూపంలో చూసే మొత్తం వీక్షకులను విశిష్ట వీక్షకులుగా వ్యవహరిస్తారు. ఏ క్షణంలోనైనా ఏకకాలంలో అత్యధిక లాగిన్లు నమోదైన సమయాన్ని పీక్ కాన్‌కరెన్సీగా పరిగణిస్తారు. -
ఖాతాలు తెరిచి.. కోట్లు తరలించి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు పాకిస్తాన్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ నడిపించారు. ఇది చాలదన్నట్టు బెట్టింగ్ సొమ్మును హవాలా మార్గంలో దేశం దాటించారు. ఇందుకోసం బ్యాంకుల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ధ్రువపత్రాలతో ఖాతాలు తెరిచారు. బ్యాంకు అధికారుల వత్తాసుతో కోట్ల కొద్దీ సొమ్మును వేరే దేశాలకు చేర్చారు. 2013, 2019 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో జరిగిన బెట్టింగ్‌లోని చీకటి కోణాలివి. ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన రెండు బెట్టింగ్ కేసుల్లో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కోట్ల లావాదేవీలపై పట్టింపేది? ఢిల్లీకి చెందిన దిలీప్‌కుమార్.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన గుర్రం సతీశ్, గుర్రం వాసుతో కలిసి పాకిస్తాన్లో ఉన్న వకాస్ మాలిక్‌తో నేరుగా టెలిఫోన్ సంభాషణలు సాగించారు. క్రికెట్ బెట్టింగ్ కోసం పలు జాతీయ బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలతో ఖాతాలు తెరిచారు. ఎలాంటి వ్యాపారం లేని సతీశ్, వాసు.. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలు తెరిచారు. ఢిల్లీలోని దిలీప్‌కుమార్ ఖాతాల ద్వారా 2013, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.49 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ డబ్బు బెట్టింగ్ ద్వారా వచ్చిందేనని సీబీఐ గుర్తించింది. సతీశ్ 2012–13, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.4.55 కోట్ల బెట్టింగ్ లావాదేవీలు జరిపాడని, విదేశాల నుంచి రూ.3.05 లక్షలను బెట్టింగ్ కోసం తీసుకున్నాడని సీబీఐ గుర్తించింది. వాసు అకౌంట్ల నుంచి 2012–13, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.37 కోట్ల లావాదేవీలు జరిగినట్టు దర్యాప్తు విభాగం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ డబ్బును హవాలా రూపంలో వకాస్ మాలిక్ చెప్పిన దేశాలకు పంపినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. నిద్రపోయారా.. నటించారా? ఇంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగు తుంటే బ్యాంకు అధికారులు నిద్రపోయారా లేదా నటించారా అన్న కోణంలో సీబీఐ కూపీ లాగు తోంది. సామాన్యుడు ఖాతా తెరవాలంటే సవాలక్ష పత్రాలు అడిగే బ్యాంకు అధికారులు.. నకిలీ బర్త్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలు సమర్పించిన దిలీప్‌కుమార్‌తో పాటు గుర్రం సతీశ్, వాసులను ఎందుకు గుర్తించలేదు? ఆ పత్రాలు అసలువా, నకిలీవా ఎందుకు విచారించలేదని సీబీఐ అనుమానిస్తోంది. పైగా ఈ ముగ్గురూ కేవలం సేవింగ్ పేరుతో తెరిచిన ఖాతాలో రూ.11 కోట్ల మేర నగదు లావాదేవీల వ్యవహారాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు, ఏటా జరిగే ఆడిటింగ్‌లో ఎందుకు ఇది బయటపడలేదో సీబీఐ అధికారులను విస్తుపోయేలా చేస్తున్నట్టు తెలిసింది. బ్యాంకు అధికారులపై నజర్ సీబీఐ ఢిల్లీ విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాదు ‘అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులు’ అని కూడా పేర్కొంది. దీనితో సంబంధిత బ్యాంకుల్లోని అధికారుల్లో వణుకు మొదలైనట్టు తెలుస్తోంది. నిందితులకు సహకరించి ఖాతాల తెరిచిన దగ్గరి నుంచి డబ్బు విదేశాలకు తరలివెళ్లిన వ్యవహారాల్లో ఏయే స్థాయి అధికారు లున్నారో సీబీఐ విచారించబోతోంది. దీంతో దిలీప్‌కుమార్, సతీశ్, వాసు నకిలీ పత్రాలతో ఖాతాలు తెరిచిన బ్యాంకు బ్రాంచుల్లో సోదాలు చేసేందుకు సీబీఐ సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. -
ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం.. స్టార్ స్పోర్ట్స్ లింకును దొంగిలించి..!
Tamil Nadu Man Arrested For Streaming IPL Matches In Own App: సొంత యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని వ్యక్తులు తమ లింకును దొంగిలించి ఓ యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్ టీవీ ప్రతినిధి కదరామ్ తుప్పా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ యాప్‌ను తమిళనాడులోని శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం తమిళనాడు వెళ్లిన పోలీసులు శివగంగై సమీపంలోని కాంజిరంగల్‌లోని పిల్లైయార్ కోయిల్ వీధిలో ఉంటున్న రామమూర్తి (29) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ టీవీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ ఛానల్ బీసీసీఐతో 16,347 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. అయితే కొందరు ఫ్రాడ్లు అక్రమంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ లీగల్‌గా ఒప్పందం చేసుకున్న సంస్థలకు నష్టం చేకూరుస్తున్నారు. టీవీల్లో ఐపీఎల్ వ్యుయర్షిప్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటమే ఇందుకు నిదర్శనం. చదవండి: IPL 2022: సీఎస్కేకు మరో భారీ షాక్.. లీగ్‌ను వీడిన విదేశీ బ్యాటర్ -
‘స్మార్ట్’ బెట్టింగ్.. ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేల జోరు
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఐపీఎల్ మ్యాచ్‌లను చిన్నాపెద్దా తేడా లేకుండా వీక్షిస్తున్నారు. ఫలితం తేలే వరకు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్, ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్‌కు దిగుతున్నారు. దీనికితోడు సెల్ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితి చేరుకుంటున్నారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. ♦మూడేళ్ల క్రితం బైరెడ్డిపల్లె మండలంలో ఓ యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ♦పెద్దపంజాణి మండలంలో ఓ యువకుడు ఆన్లైన్ యాప్ బెట్టింగ్ ద్వారా తీవ్రంగా నష్టపోయి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ♦పుంగనూరుకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగులో డబ్బు పోగొట్టుకుని ఊరు నుంచి పరారై బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నాడు ♦కుప్పంలో ఓ ఆటోడ్రైవర్ క్రికెట్ బెట్టింగుల్లో ఓడి తనకు జీవనాధారమైన ఆటోను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ♦కాలేజీలో ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ మోజులో సొమ్ము పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ♦జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నా పోలీసుల వరకు వచ్చేవి కొన్నే.. పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్‌కు తెరతీశాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి పందేలు కట్టించుకుంటున్నారు. బెట్టింగ్ ఆట కట్టించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయతిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. వీరికి తోడు ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం పందేల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్‌లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది. పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిడెన్ యాప్‌లే కీలకం ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్ మోడ్‌లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్‌లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్లు సమాచారం. ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పొలాల వద్ద ఫామ్హౌస్లతోపాటు పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. హైవేల్లో దాభాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గ్రామాల్లో అయితే పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇళ్లలోనే కాయ్ రాజా కాయ్ అంటున్నట్టు తెలుస్తోంది. కోడ్లతో లావాదేవీలు ఐపీఎల్ మ్యాచ్‌లు రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచే బెట్టింగ్‌లు ప్రారంభమవుతుంటాయి. చాలా వరకు పందేలు కోడ్లతోనే నిర్వహిస్తుంటారు. గెలిచే జట్టును ఫ్లయింగ్ , ఓడిన జట్టును ఈటింగ్ , రూ.వెయ్యిని ఫింగర్ , రూ.10 వేలను బోన్, రూ.లక్షను లెగ్ అని పిలుస్తుంటారు. ఫోన్ పే, గూగు ల్ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. కర్ణాటక ముఠాలదే హవా కర్ణాటకలోని శ్రీనివాసపుర, ముళబాగల్, నంగళి, కోలార్, కేజీఎఫ్, హోసకోట్లకు చెందిన కొన్ని బెట్టింగు గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది. వీరు కేవలం స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మ్యాచ్‌కు ముందు బెట్టింగ్ రేట్ నిర్ణయించి ఆన్లైన్లో సొమ్మ జమచేయించుకుంటారు. అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఇందులో 10 నుంచి 15శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు. పలమనేరులో పందేల జోరు పలమనేరులోని రొంటకుంట్ల రోడ్డు, డిగ్రీ కళాశాలకు వెనుకవైపు, నీళ్లకుంట, గొబ్బిళ్లకోటూరు చెరువలు, వారపుసంత, నాగమంగళం, రంగాపు రం, మార్కెట్ యార్డు గదులు, ఆర్టీసీ డిపో వెనుక బెట్టింగ్‌కు అడ్డాలుగా మారినట్లు సమాచారం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం పలమనేరు సబ్డివిజన్పరిధిలో బెట్టింగులపై ఇప్పటికే బ్లూకోల్ట్స్ ద్వారా నిఘా పెట్టాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. చిన్న క్లూ దొరికినా ప్రధాన ముఠాను పట్టుకుంటాం. బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
ఐపీఎల్ మ్యాచ్: నా చేతుల్లో మంత్రదండం లేదు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2021 మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాకపోవడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ వివరణ ఇచ్చారు. హెచ్‌సీఏ సీనియర్ సభ్యులు ఈ విషయంపై తనను తప్పుపట్టడంలో అర్థం లేదన్న అజహర్... చివరి వరకు తాను ప్రయత్నించానని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్‌ను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో మాత్రమే నిర్వహించనున్నారు. ‘అజహర్ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్ కౌన్సిల్ వేదికలను ఖరారు చేశాయి. ఉప్పల్ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్‌ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది’ అని అజహర్ వ్యాఖ్యానించారు. కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్ అన్నారు. ‘ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్‌సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ అయినా తీసుకొచ్చారా’ అని ఆయన ప్రశ్నించారు. -
ఐపీఎల్ నిరవధిక వాయిదా.. బీసీసీఐ ప్రకటన
-
ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లను ఢిల్లీలో నిర్వహించకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది.ఇదే విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ' ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉంది. దాంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిషేధిస్తున్నాం. ఐపీఎల్‌తో పాటు మిగతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను కూడా అనుమతించేది లేదు. ఒకవేళ బీసీసీఐ కొత్త ఫార్మాట్లో ఐపీఎల్లో నిర్వహించాలనుకుంటే అది వారి ఇష్టం' అని పేర్కొన్నారు. (భయంతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు) మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలా ? వద్దా? అనే దానిపై సందిగ్థత నెలకొనే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించలేమని కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. ఇదే విషయమై శనివారం(మార్చి 14) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. -
బీరు.. యమ జోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్ల విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు ఏకంగా రెండింతలు పెరగడం ఎక్సైజ్ శాఖనే ఆశ్చర్యపరిచింది. నూతన సంవత్సరం వేడుకలు జరిగే డిసెంబర్, జనవరి నెలల కన్నా.. మార్చిలో రెండు రెట్లు అధికంగా బీర్ల విక్రయాలు జరగడం గమనార్హం. వేసవి కావడంతో చల్లదనం కోసం తాగుతున్నారు అనుకున్నా.. గత విక్రయాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటున్నాయి. ఐపీఎల్, ఎన్నికలే కారణం.. వేసవి మొదలైనప్పటి నుంచి బీరు బాటిళ్ల విక్రయాలు పెరగడం అత్యంత సహజం. కానీ, ఈసారి మార్చిలో రెండింతలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా, రెండోది పార్లమెంటు ఎన్నికలు. మార్చి రెండో వారంలో ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకావడంతో బీర్ల కొనుగోళ్లు ఊపందుకుంది. దీనికితోడు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. దీంతో అటు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు ఓ వైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లను కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లలో రాజకీయ పార్టీల వాటానే అధికంగా ఉందని సమాచారం. తమ కార్యకర్తలకు, యువతకు పంచేందుకు కేసుల కొద్దీ బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్లకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే దీనికి కారణం. ఫలితంగా బీర్ల కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. సాధారణంగా ఎక్సైజ్ శాఖ విక్రయాల ప్రకారం.. ఐఎమ్ఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) అంటే బ్రాండీ వైన్ తదితరాలతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు. సాధారణంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలు నెలకు సగటున రూ.1,500 నుంచి రూ.1,700 కోట్లుగా ఉంటుంది. వివిధ కాలాల్ని బట్టి వీటిలో మద్యం, బీర్ల విక్రయాలు మారుతుంటాయి. గత 4 నెలల మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. బీర్ల కేసులు పెరగడం గమనించవచ్చు. -
వారి పోరు చూడాల్సిందే
ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తమ ఓటమి పరంపర కొనసాగకుండా గెలుపుబాట పట్టాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది. సునీల్ నరైన్ సేవలు అందుబాటులో లేకపోవడం కోల్‌కతాకు ఇబ్బందికరమే. ఈ సీజన్లో బౌలర్‌గా నరైన్ అంతగా ప్రభావం చూపలేకపోయినా ఓపెనర్‌గా మాత్రం రాణించాడు. నరైన్ ధాటిగా పరుగులు చేసి శుభారంభం అందిస్తుండటంతో ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోతోంది. శుబ్‌మన్ గిల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించడం మంచి ఎత్తు కాగా... రాబిన్ ఉతప్ప కూడా బ్యాట్ ఝళిపిస్తే కోల్‌కతాకు ఎదురుండదు. దినేశ్ కార్తీక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే కోల్‌కతాకు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కుల్దీప్ యాదవ్ మినహా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ప్రసిధ్ కృష్ణ భారీగా పరుగులు ఇస్తుండగా... రసెల్ బౌలింగ్‌లో నిలకడ కనిపించడంలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జోరు మీదుంది. పాయింట్ల పట్టికలో అగ్రభాగాన ఉంది. చివరి ఓవర్లలో చెన్నై జట్టు అద్భుతంగా ఆడుతోంది. మిగతా జట్లకు చెన్నై జట్టుకు ఇదే తేడా కనిపిస్తోంది. క్లిష్ట సమయాల్లో చెన్నై ఆటగాళ్లు తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడుతున్నారు. అంపైర్లతో వాగ్వాదం వివాదాన్ని ధోని మర్చిపోయి మరో విజయంపై దృష్టి పెట్టాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కూడా ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. కోల్‌కతాను ఢిల్లీ జట్టు సునాయాసంగా ఓడించడం... శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రావడం, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కూడా మెరిపిస్తుండటం ఢిల్లీకి సానుకూలాంశం. ఈడెన్ గార్డెన్స్ తరహా పిచ్ లభిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలరు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, రబడ, మోరిస్... సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ మధ్య పోరు చూడాల్సిందే. సన్‌రైజర్స్‌కు బెయిర్‌స్టో, వార్నర్ దూకుడైన ఆరంభం ఇస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. -
చిదంబరం స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, చెన్నై : కావేరీ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహారంపై తమిళనాడు రగిలిపోతుండగా.. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ తంబీలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నేటి సీఎస్కే-కేకేఆర్ మ్యాచ్‌ను అడ్డుకుని తీరతామన్న ఆందోళనకారులు.. స్టేడియాన్ని ముట్టడించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పటికీ.. భారీ భద్రత వలయాన్ని చేధించుకుంటూ ఆందోళనకారులు స్టేడియం వద్దకు దూసుకొస్తున్నారు. భారీ భద్రత నడుమ సీఎస్కే-కేకేఆర్ టీమ్ సభ్యులు మైదానంకు చేరుకున్నారు. స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో తమిళ సంఘాలు స్టేడియం దగ్గర్లోని కూడలిలో ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం మైదానం వద్ద చోటుచేసుకున్న పరిస్థితులపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచ్‌లను నిర్వహించేందుకు చెన్నై పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.(ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాజకీయాలొద్దు) -
తమిళుల ఆగ్రహం చవిచూస్తారు!
తమిళసినిమా (చెన్నై): కేంద్ర ప్రభుత్వం తక్షణం కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుంటే తమిళనాడు ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని సూపర్‌స్టార్ రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాడు మొత్తం ముక్త కంఠంతో కావేరీ బోర్డు ఏర్పాటును కోరుతోందన్నారు. కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్షాల పోరాటానికి మద్దతుగా ఆదివారం కోలీవుడ్ పరిశ్రమ నిర్వహించిన మౌన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబు కాదన్నారు. ‘రాష్ట్రం మొత్తం కావేరీ అంశంపై ఆందోళన చేస్తుంటే ఐపీఎల్‌ను నిర్వహించడం అవమానకరమే అవుతుంది. ఐపీఎల్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణను నిర్వాహకులు రద్దు చేసుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించి మ్యాచ్‌లు ఆడాలి’ అని రజనీకాంత్ సూచించారు. కావేరీ అంశంపై తమిళనాడు, కర్ణాటకల్లో ఆందోళన కొనసాగుతున్న వేళ.. కన్నడ సంతతికి చెందిన ఎంకే సూరప్పను అన్నా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా గవర్నర్ నియమించడం సరికాదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నై నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద జరిగిన ఈ మౌనదీక్షలో రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్, విజయ్, సూర్య, విశాల్, శింబు, ధనుష్‌లు సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ కార్మికులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ రోజుకి 3జీబీ డేటా
న్యూఢిల్లీ : పాపులర్ ఐపీఎల్ టోర్నమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టెలికాం కంపెనీల రేసులో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. స్పెషల్ ఐపీఎల్ ప్లాన్‌గా 248 రూపాయలతో ఓ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించింది. 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. తమ ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు ఎస్టీవీ రూ.248పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటాను అందించనున్నామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. తక్కువ రేటుకు లైవ్ ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసుకునేందుకు తమ సబ్స్క్రైబర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. మూడు రోజుల క్రితమే రిలయన్స్ జియో కూడా ఐపీఎల్ సందర్భంగా రూ.251 ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీ ఎయిర్టెల్ కూడా హాట్‌స్టార్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని తెలిపింది. బీఎస్ఎన్ఎల్ కేవలం 3జీ నెట్‌వర్క్‌నే కలిగి ఉండగా.. జియో 4జీ సర్వీసులను అందించనుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో 2018 ఏప్రిల్ 7 నుంచి 2018 ఏప్రిల్ 30 వరకు ఆ ఆఫర్ పరిమిత సమయంలో అందుబాటులో ఉండనుంది. -
భారీ స్కెచ్
ప్రొద్దుటూరు క్రైం :మరో ఐదు రోజుల్లో క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 50 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ సీజన్ అంటే క్రికెట్ అభిమానులతోపాటు బుకీలకూ పండగే. ఇరు జట్ల గెలుపోటములతోపాటు.. స్టేడియంలో పరుగులు తీసే ప్రతి బంతికి రూ. కోట్లలో పందాలు జరుగుతాయి. ఇందుకోసం బుకీలు తమ స్థావరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకే చోట ఉండి పందాలు నిర్వహిస్తే పోలీసులకు పట్టుబడే అవకాశం ఉన్నందున రోజుకో ప్రాంతంలో ఉండేలా బుకీలు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఇందుకోసం మూడు, నాలుగు రాష్ట్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, చెన్నూ రు, రాజంపేట, జమ్మలమడుగు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ పందాలు కూడా జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ జాడ్యం పాకడంతో పోలీసులు గ్రా మాలపై కన్నేశారు. తెరపైకి కొత్త ముఖాలు జెంటిల్మెన్ గేమ్‌గా పేరొందిన క్రికెట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరు పందెం రాయుళ్లు కూడా జెంటిల్మెన్లుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెట్టింగ్ నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. రెండేళ్ల నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటి ఎస్పీ రామకృష్ణ తీసుకున్న చర్యల వల్ల జిల్లాలోని చాలా మంది బుకీలు తోక ముడిచారని చెప్పవచ్చు. తర్వాత వచ్చిన ఎస్పీ అట్టడ బాబూజీ కూడా అదే పం««థాను కొనసాగిస్తుండటంతో జిల్లాలో బెట్టింగ్ సుమారు 60 శాతం మేర తగ్గింది. కారణం తెలియదు కానీ ఇటీవల పోలీసుల దాడులు తగ్గడంతో బెట్టింగ్ మళ్లీ పురుడు పోసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల భయంతో సీనియర్ బుకీలు కొందరు పందాలకు స్వస్తి చెప్పినా.. కొత్త బుకీలు మాత్రం చెలరేగి పోతున్నట్లు సమాచారం. ఇటీవల కొత్తగా కొందరు యువ బుకీలు కూడా తెరపైకి వచ్చారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో.. బుకీలు 50 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఒకే చోట స్థావరం ఏర్పరుచుకొని పందాలు నిర్వహిస్తే పోలీసుల నుంచి కష్టాలు తప్పవని భావించి.. ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో ఉండేలా రూట్ మ్యాప్‌ను తయారు చేసుకున్నట్లు సమాచారం. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటూ బెట్టింగ్ నిర్వహించే వాళ్లు, అయితే ఇటీవల ఈ రెండు నగరాల్లో పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ రెండు సిటీలు క్రికెట్ పందాలకు సురక్షితం కాదని బుకీలు గ్రహించారు. చెన్నై, గోవా, మహారాష్ట్రలోని ముంబై, ఒడిస్సా తదితర ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలిసింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తు పట్టే అవకాశం ఉన్నందున రోజుకో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరమని బుకీలు భావిస్తున్నట్లు తెలిసింది. వేధిస్తున్న సిబ్బంది కొరత గతేడాది ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు 15 క్రికెట్ బెట్టింగ్ కేసులను నమోదు చేసి.. బుకీల నుంచి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో దాడులు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది. సబ్‌డివిజన్‌లోని 72 మంది పోలీసులను ప్రొద్దుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ అంట్ కంట్రోల్ సెంటర్‌కు మార్చారు. దీంతో ప్రధాన స్టేషన్లలో సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పోలీసులు బుకీలను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి వారం రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లను అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌తో పాటు మే నెలలో కూడా ఈ పొడిగింపు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో రైళ్లను రాత్రి 10.00 గంటల వరకే నడుపుతున్నారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇపుడు మెట్రో అధికారుల నిర్ణయంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. అభిమానుల కోసం.. ఐపీఎల్ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పొడిగింపుకు సంబంధించి సీబీటీసీ అనుమతి కోరగా, వారి నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు. అమీర్‌పేట నాగోల్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు... అమీర్‌పేట మియాపూర్ మార్గంలో 8 నిమిషాలకు రైలు నడుస్తుందన్నారు. -
ఐపీఎల్ కోసం జియో హైస్పీడ్ వైఫై
హైదరాబాద్ : క్రికెట్ మహాసంగ్రామం ఐపీఎల్ సంబురంలో జియో కూడా భాగమైపోయింది. నేటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ హై-స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది. జియో నెట్ వై-ఫైతో స్టేడియం మొత్తాన్ని కవర్ చేసింది. క్రికెట్ ను వీక్షించడానికి వచ్చిన అభిమానులు తమ స్మార్ట్ ఫోన్లలో జియో హైస్పీడ్ వై-ఫై సేవల ప్రయోజనాలను పొందేలా అవకాశం కల్పిస్తోంది. ఈ సేవలు పొందడానికి ప్రేక్షకులకు కావాల్సిందల్లా ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-పైకి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నెంబరుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని జోడించగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది. ఇలా జియో హై-స్పీడ్ వై-ఫై సేవలను ఐపీఎల్ ప్రేక్షకులు వినియోగించుకోవచ్చు. -
హైటెక్ బెట్టింగ్ దందా గుట్టు రట్టు
క్యాష్ డెలివరీ బాయ్ పట్టివేత పరారీలో బుకీలు సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా హైటెక్ పద్ధతిలో కొనసాగుతున్న బెట్టింగ్ దందా గుట్టును రట్టు చేశారు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ముఠాకు చెందిన క్యాష్ డెలివరీ బాయ్‌ను అరెస్టు చేసి రూ.7.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... ఫీల్‌ఖానాకు చెందిన విశాల్విశాల్ గతంలోనూ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ముఖేష్, గౌరవ్లతో కలిసి ముఠా ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులకు చిక్కకుండా పక్కాగా దందా నిర్వహిస్తున్నాడు. గోవాలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న ఈ ముగ్గురూ బల్క్ ఎస్సెమ్మెస్‌ల ద్వారా సందేశాలు పంపుతూ పంటర్లను ఆకర్షిస్తున్నారు. పందాలు కాసేవారి (పంటర్లు) నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి, వాటిని రికార్డు చేయడానికి ఉద్యోగుల్ని నియమించుకున్నారు. పందెం డబ్బు వసూళ్లు, గెలిచిన వారికి చెల్లింపులు చేయడానికి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రకంగా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు టర్నోవర్ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం బుధవారం వలపన్నింది. క్యాష్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నిఖిల్ షాను పట్టుకున్న అధికారులు రూ.7.5 లక్షలు, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న సూత్రధారుల (బుకీలు) కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. -
సుప్రీంలోనూ ఐపీఎల్‌కు ఝలక్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులోనూ ఐపీఎల్ నిర్వాహకులకు, ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలకు చుక్కెదురైంది. మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో మహారాష్ట్రలో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు కోతపడింది. మహారాష్ట్రలో కరువు, నీటి కొరత కారణంగా ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 లోపు జరిగే ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన మరో 13 మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్‌పూర్ వేదికల్లో మ్యాచ్‌లు జరగాల్సివుంది. కాగా బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడా నిరాశ ఎదురైంది. -
బాంబే హైకోర్టు తీర్పుపై సవాలు
సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముంబై, మహారాష్ట్ర అసోసియేషన్లు ముంబై: రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ మేరకు రెండు సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈనెల 25న జస్టిస్ దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్‌లతో కూడిన బెంచ్ వీటిపై విచారణ జరపనుంది. తాము పిచ్‌ల నిర్వహణ కోసం శుద్ధి చేసిన నీటిని (సీవరేజ్) ఉపయోగిస్తున్నామని చెప్పినా... కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న అంశాన్ని ఎంసీఏ తన పిటిషన్లో పేర్కొంది. ‘మా రెండు సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. ఐపీఎల్ లేకపోవడం వల్ల మేం పెద్ద మొత్తంలో డబ్బులు, ఉద్యోగాలు నష్టపోతున్నామని కోర్టుకు విజ్ఞప్తి చేశాం. సీవరేజ్ నీటిని ఉపయోగించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలిపినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఐపీఎల్ లేకపోయినా మేం గడ్డి కోసం నీటిని వినియోగిస్తున్నాం. ఈ ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని మేం సుప్రీంకోర్టుకు వెళ్లాం’ అని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి ఉన్మేష్ కన్విల్కర్ పేర్కొన్నారు. ఐపీఎల్ మన దగ్గరెందుకు? మహారాష్ట్రతో పోలిస్తే తమ దగ్గరే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇక్కడ ఎందుకు ఆతిథ్యమిస్తున్నారని రాజస్తాన్ హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లను ఇక్కడికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఓ పిల్‌పై కోర్టు విచారణ జరపింది. ఈనెల 27లోగా దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి మ్యాచ్‌లను తరలించడంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యామ్నాయ వేదికగా జైపూర్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. -
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌లు?
విశాఖపట్నం: విశాఖపట్నంలో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది. శుక్రవారం బీసీసీఐ అధికారులు విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని పరిశీలించారు. ఈ వేదికలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయాన్ని చర్చించినట్టు సమాచారం. మహారాష్ట్ర నుంచి తరలించే ఐపీఎల్ మ్యాచ్‌లలో కొన్నింటిని విశాఖలో నిర్వహించవచ్చు. కరువు, నీటికొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్‌పూర్ వేదికల్లో జరగాల్సిన 13 మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
హైకోర్టు తీర్పుపై నేడు సమావేశం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపుపై నేడు (శుక్రవారం) లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా.. ఫ్రాంచైజీలతో సమావేశం కానున్నారు. నీటి సమస్య కారణంగా బాంబే హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 30 అనంతరం ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌లకు చెందిన 13 మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈనేపథ్యంలో చర్చించేందుకు రెండు జట్లకు చెందిన ప్రతినిధులను శుక్లా ఆహ్వానించారు. ఈసమావేశంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొంటారు. రేసులోకి వైజాగ్ మహారాష్ట్ర నుంచి తరలించాల్సిన మ్యాచ్‌లలో కొన్నింటిని విశాఖపట్నంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ముంబై, పుణే జట్ల హోమ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు వైజాగ్, రాయ్‌పూర్, కాన్పూర్ రేసులో ఉన్నట్లు సమాచారం. మే నెలలో ముంబై ఇండియన్స్ ఆడాల్సిన మూడు హోమ్ మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు అవుట్
ముంబై: బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. కరువు, నీటి కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఆ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన అన్ని మ్యాచ్‌లనూ రాష్ట్రం నుంచి తరలించాలని బాంబే హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్‌పూర్ వేదికల్లో మ్యాచ్‌లు జరగాల్సివుంది. ఏప్రిల్ 30 లోపు కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహిస్తారు. హైకోర్టు తాజా ఉత్తర్వుల కారణంగా మరో 13 మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామని, రోజు 40 లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీటిని లాతూర్ లేదా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని బీసీసీఐ తరపు న్యాయవాది అంతకుముందు కోర్టుకు విన్నవించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, పుణె చెరో 5 కోట్లు రూపాయల చొప్పున సీఎం సహాయక నిధికి అందజేస్తాయని చెప్పారు. వాదనలు విన్న అనంతరం ఆరు మ్యాచ్‌ల నిర్వహణకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది. -
రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అడ్డు తొలగించుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. తాము ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేసే నీటినే మ్యాచ్‌లలో పిచ్ సిద్ధం చేయడానికి వాడుకుంటామని బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. వాడిన నీటిని రీసైకిల్ చేసి, ఆ నీళ్లనే ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేస్తుంది. దానివల్ల తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎంసీఏ చెప్పింది. పిచ్‌లను సిద్ధం చేయడానికి వాళ్లు సరఫరా చేసే రీసైకిల్డ్ నీళ్లు సరిపోతాయని ఎంసీఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందువల్ల మంచినీటిని ఉపయోగించకుండానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాగా.. ముంబై, పుణె నగరాల్లో నిర్వహించే 17 మ్యాచ్‌లకు ఈ రీసైకిల్డ్ నీళ్లను ఉపయోగిస్తారు. మరోవైపు నాగపూర్‌లో నిర్వహించదలచిన మూడు మ్యాచ్‌లను మొహాలీకి తరలించేందుకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని బీసీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. -
ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్
బెంగళూరు : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయమై కర్ణాటక హైకోర్టులో సోమవారం ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల తాగునీటి విషయమై ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అయితే ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ పరిమాణంలో నీటిని స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదంటూ నగరానికి చెందిన శ్రీనివాస్‌శర్మ అనే అర్చకుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాకుండా సదరు నీటిని కూడా జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని ఫిర్యాదుదారుడు న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల చిన్నస్వామి స్టేడియంకు వినియోగించే నీటిపై ఆడిట్‌ను జరపాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అది సమస్యకు పరిష్కారం కాదు:వీవీఎస్
హైదరాబాద్: మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌లను వేరే చోటకు తరలించాలనడం ఎంతమాత్రం సరికాదని మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సలహాదారు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అసలు రాష్ట్రంలోని నీటి కరువుకు, ఐపీఎల్ మ్యాచ్ లకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఇక్కడ నిర్వహించే మ్యాచ్ లను వేరే చోటకి తరలించడంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నాడు. 'ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి తరలించాలంటూ పేర్కొనడం సమస్యకు పరిష్కారం కాదు. నీటి సమస్యకు తొలుత పరిష్కారం వెతకండి. ముంబైలో జరిగే మ్యాచ్‌లను తరలించాలనడం నిజమైన పరిష్కారమైతే కాదు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు.ఇదొక జాతీయ సమస్య. దేశంలో చాలా చోట్ల నీటి సమస్య ఉంది. గ్లోబర్ వార్మింగ్ వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు రావడం మనం చూశాం. తద్వారా దేశ వ్యాప్తంగా నీటి కొరత అధికంగానే ఉంది. ఇందుకోసం ప్రత్యేక డిపార్టమెంట్లను ఏర్పాటు చేసి అందుకు తగిన పరిష్కారాన్ని వెదకడానికి ప్రభుత్వం కృషి చేయాలి' అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు.